రాజేంద్రనగర్ లో గుజరాత్ ఏటీఎస్

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు సోదాలు చేశారు.

Update: 2025-11-13 14:30 GMT

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గుజరాత్ ఏటీఎస్ పోలీసులు సోదాలు చేశారు. ఫోర్త్ వ్యూ కాలనీలోని డాక్టర్ మొహియుద్దీన్‌ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యుల బృందం సోదాల్లో పాల్గొంది. మూడు రకాల లిక్విడ్‌లతో పాటు కంప్యూటర్, పలు రకాల బుక్స్, ఆయిల్ తయారు చేసే మిషన్ సహా పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సయ్యద్ సోదరుడు ఓమర్ ఫారుఖీకి నోటీసులు ఇచ్చి సెర్చ్ నిర్వహించారు. అహ్మదాబాద్‌లో అరెస్టయిన ఉగ్రవాది అహ్మద్‌ మొహియుద్దీన్‌ సయ్యద్‌కు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించేందుకు గుజరాత్‌ ఏటీఎస్‌ బృందం ప్రయత్నిస్తోంది.

Tags:    

Similar News