మాగంటి ఇంటికి కేసీఆర్
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తుంది
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహిస్తుంది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు జూబ్లీ హిల్స్ లోని మహా ప్రస్థానంలో మాగంటి గోపీనాధ్ అంత్యక్రియలు జరగనున్నాయి. ఏఐజీ ఆసుపత్రి నుంచి మాగంటి గోపీనాధ్ భౌతిక కాయాన్ని మాదాపూర్ లోని ఆయన ఇంటికి తీసుకు వచ్చారు. మాగంటి ఇంటికి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, పార్టీ అభిమానులు తరలి వస్తున్నారు.
మహా ప్రస్థానంలో...
మరికాసేపట్లో మాగంటి గోపీనాధ్ భౌతిక దేహన్ని దర్శించి నివాళులర్పించేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకుంటారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి ఆయన బయలుదేరి మాగంటి ఇంటికి చేరుకోనున్నారు. ఇప్పటికే మాగంటి గోపీనాధ్ ఇంటికి బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, కేటీఆర్ లు చేరుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా మాగంటి ఇంటికి చేరుకుంటున్నారు.