హైదరాబాద్ లో నకిలీ ఐపీఎస్
నకిలీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారిగా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
నకిలీ ఐపీఎస్, ఐఏఎస్ అధికారిగా నటిస్తూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. టీజీఐఐసీ మైన్స్ డిప్యూటీ డైరెక్టర్‌గా చెప్పుకుంటూ ఇండస్ట్రీల కోసం భూములు కేటాయిస్తానంటూ మోసాలు చేస్తున్నట్టు గుర్తించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన బత్తిని శశికాంత్ నుంచి రెండు సెల్ ఫోన్లు, ఆరు సిమ్ కార్డులు, రెండు వాకీటాకీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎన్ఐఏ పేరుతో ముద్రించిన గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇక గన్‌మెన్లుగా పనిచేసిన తమిళనాడుకు చెందిన మాజీ సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రవీణ్, విమల్ కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.