హైదరాబాద్ చేరుకున్న రాహుల్ గాంధీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ కు చేరుకోనున్నారు.
Rahul gandhi reached hyderabad
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో ఆయన బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్ కు చేరుకోనున్నారు. తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ కులగణన సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ఇప్పటికే పలువురు సామాజిక కార్యకర్తలు, మేధావులు అక్కడకు చేరుకున్నారు. బీసీ కులగణన విషయంలో మేధావుల నుంచి సలహాలు స్వీకరించనున్నారు. తెలంగాణలో రేపటి నుంచి కులగణన ప్రారంభం కానుంది.
కులగణన సదస్సులో...
ఈ నేపథ్యంలో బీసీ సంఘాల ప్రతినిధులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. వారితో నేరుగా మాట్లాడి కులగణనపై వారి అభిప్రాయాన్ని తెలుసుకోనున్నారు. కులగణన వల్ల జరిగే లాభాలను కూడా రాహుల్ గాంధీ ఈ సదస్సులో వివరించనున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకికాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచిరోడ్డు మార్గాన ఆయన బోయినపల్లికి బయలుదేరి వెళ్లారు.