Telangana : 65 ఈవీ బస్సులు సిద్ధం
తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు
తెలంగాణ ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈరోజు 65 ఈవీ బస్సులను మంత్రి ప్రారంభించారు. దీంతో తెలంగాణ ఆర్టీసీలో మొత్తం 810 ఎలక్ట్రిక్ బస్సులు ఉన్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో ఇప్పటికే 300 ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతనన్ాయి. మరో 65 ఈవీ బస్సులను నేడు ప్రారంభించడంతో వాటి సంఖ్య మరింత పెరుగుతుంది.
కాలుష్యం తగ్గించేందుకు...
ఈవీ బస్సుల వల్ల నిర్వహణ వ్యయం తగ్గడంతో పాటు కాలుష్యం కూడా తగ్గుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్టీసీ వరసగా ఈవీ బస్సులను కొనుగోలు చేస్తుంది. వచ్చే నెలలో మరో 175 ఈవీ బస్సులు రానున్నాయి. దీంతో కొత్త ఏడాది జనవరి నాటికి హైదరాబాద్ నగరంలో 540 ఈవీ బస్సులు తిరుగుతాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా తెలిపారు. వాయు కాలుష్యాన్ని నివారించడంలో భాగంగానే ఈవీ బస్సులను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.