Diabetes: వేగంగా నడిస్తే డయాబెటిస్‌ అదుపులో ఉంటుందా? కీలక పరిశోధన

ప్రస్తుతం డయాబెటిస్‌ వ్యాధి చాపకింద నీరులా ప్రపంచ మొత్తాన్ని చుట్టేస్తోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు వయస్సుతో..

Update: 2023-12-03 02:45 GMT

ప్రస్తుతం డయాబెటిస్‌ వ్యాధి చాపకింద నీరులా ప్రపంచ మొత్తాన్ని చుట్టేస్తోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు వయస్సుతో సంబంధం లేకుండా అందరిని కబలిస్తోంది. టైప్‌ 2 డయాబెటిస్‌ అనేది ఈ రోజుల్లో జీవితంలో ఒక భాగమైపోయింది. జీవనశైలి, ఒత్తిడి, కుటుంబ చరిత్ర, అధిక టెన్షన్, ఆహారపు అలవాట్లలో మార్పులు తదితర కారణాల వల్ల మధుమేహం పేషంట్ల సంఖ్య పెరిగిపోతోంది. శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడానికి, మధుమేహాన్ని నివారించడానికి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం లేదా ఎప్పుడైనా చిన్నపాటి నడక చాలా మంచిదని భావిస్తారు. ఇప్పుడు నడక వేగం, మధుమేహం తగ్గే ప్రమాదం మధ్య లింక్‌పై కొత్త పరిశోధన ఉంది.

అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ఏం చెబుతోంది..?

మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ దినచర్యలో సమతుల్య ఆహారం నుండి రోజువారీ వ్యాయామం వరకు మంచి అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా కూడా ఆరోగ్యంగా ఉండగలరు. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ ప్రకారం, మధుమేహాన్ని నివారించడానికి రోజుకు 10,000 అడుగులు నడవడం మంచిది. ప్రతిరోజు వాకింగ్‌ చేయడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కొత్త పరిశోధన ప్రకారం..

బ్రిటిష్ జనరల్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక కొత్త అధ్యయనం ప్రకారం.. ఆరోగ్యంగా ఉండటానికి, డయాబెటిస్‌ను నివారించడానికి నడక వ్యవధి మాత్రమే కాదు, ఒక గంట లేదా రెండు గంటలు వేగంగా నడవడం చాలా ముఖ్యమంటున్నారు. కొత్త పరిశోధన ప్రకారం, చురుకైన నడక టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని దాదాపు 40 శాతం తగ్గిస్తుంది.

నడకలో మార్పు చేయడం వల్ల..

సాధారణ వేగంతో నడిచే వారి కంటే వేగంగా నడిచే వారికి మధుమేహం వచ్చే ప్రమాదం 24 శాతం తక్కువగా ఉంటుందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే నడక వేగాన్ని పెంచితే ఈ మెటబాలిక్ డిజార్డర్ అంటే మధుమేహం వచ్చే ప్రమాదాన్ని 39 శాతం తగ్గించుకోవచ్చు. అంటే మామూలు నడకకు బదులు కాస్త వేగంగా నడిస్తే మంచిదంటున్నారు.

గుండె ఆరోగ్యం:

మధుమేహాన్ని నివారించడానికి సాధారణ నడక కంటే వేగంగా నడవడం మంచిది. చురుకైన నడక హృదయ స్పందన రేటును పెంచుతుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీ, జీవక్రియను మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడటమే కాకుండా మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

Tags:    

Similar News