Thyroid: థైరాయిడ్‌ ఎన్నిరకాలు..ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి

Thyroid Symptoms: థైరాయిడ్ సమస్యలు సాధారణంగా మహిళల్లో కనిపిస్తాయి. అయితే చాలా మంది..

Update: 2023-11-08 15:09 GMT

Thyroid Symptoms: థైరాయిడ్ సమస్యలు సాధారణంగా మహిళల్లో కనిపిస్తాయి. అయితే చాలా మంది పురుషులు కూడా థైరాయిడ్‌తో బాధపడుతున్నారు. శరీరంలోని హార్మోన్ల అసమతుల్యత వల్ల ఈ వ్యాధి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నమాట. మన గొంతులో సీతాకోకచిలుక ఆకారపు థైరాయిడ్ గ్రంధి ఉంటుంది. ఇది హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని కారణాల వల్ల ఈ ఎండోక్రైన్ గ్రంధి కార్యాచరణ ప్రభావితమైనప్పుడు, హార్మోన్లు అసమతుల్యత చెందుతాయి. దీని వల్ల థైరాయిడ్ సమస్యతో బాధపడాల్సి వస్తుంది. మీరు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లయితే, మీరు అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. చాలా మంది శరీరంలో జరిగే చిన్న చిన్న మార్పులకు శ్రద్ధ చూపరు. కానీ ఈ సమస్య తీవ్రమవుతుంది.

థైరాయిడ్‌లో రెండు రకాలు. శరీరంలో థైరాయిడ్ హార్మోన్ అధికంగా ఉత్పత్తి అయినప్పుడు 'హైపర్ థైరాయిడిజం' సమస్య ఏర్పడుతుంది. అలాగే ఈ హార్మోన్ తక్కువ పరిమాణంలో ఉత్పత్తి అయినప్పుడు 'హైపోథైరాయిడిజం' బారిన పడతాడు. థైరాయిడ్ ప్రారంభ లక్షణాలపై శ్రద్ధ వహిస్తే, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా కొన్ని చికిత్సల ద్వారా దీనిని నియంత్రించవచ్చంటున్నారు నిపుణులు. అందుకే దాని లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు.


Full View


 హైపర్ థైరాయిడిజంలో కనిపించే లక్షణాలు

ఎవరికైనా హైపర్ థైరాయిడిజం సమస్య ఉంటే బరువు తగ్గడం, ఆకలి పెరగడం, కండరాల బలహీనత, నొప్పి, వేగవంతమైన హృదయ స్పందన, నాడీ అనుభూతి, చిరాకు వేయడం,అధిక చెమట రావడం వంటి లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి.

హైపోథైరాయిడిజం లక్షణాలు

ఎవరైనా హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నప్పుడు అతను తక్కువ చెమట, అధిక జుట్టు రాలడం, అలసట, ముఖం మీద వాపు, మలబద్ధకం, ఒత్తిడికి గురికావడం, తక్కువ హృదయ స్పందన, కండరాలు దృఢత్వం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

నివారణ చర్యలు:

మీరు థైరాయిడ్ లక్షణాలను ఎదుర్కొంటుంటే, సోయాబీన్, దాని ఉత్పత్తులకు దూరంగా ఉండటం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే సోయాబీన్‌లో ఫైటోఈస్ట్రోజెన్ ఉంటుందని నిపుణులు గుర్తించారు దీంతో దీనికి దూరంగా ఉండటం మంచిదంటున్నారు. ఇది థైరాయిడ్ హార్మోన్‌ను ఉత్పత్తి చేసే ఎంజైమ్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది కాకుండా, ఈ వ్యాధితో బాధపడుతున్న వారు ఆల్కహాల్, కెఫీన్ కలిగిన టీ-కాఫీ, మితిమీరిన స్వీట్లు తినడం,ప్రాసెస్ చేసిన ఆహారాలకు కూడా దూరంగా ఉండాలి.

జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి?

ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ కొంత సమయం వ్యాయామానికి కేటాయించడం చాలా ముఖ్యం. థైరాయిడ్ సమస్య విషయంలో కూడా రోజూ వ్యాయామం చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని నిణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే దీనితో మీరు మీ బరువును అదుపులో ఉంచుకోగలుగుతారు. బెండకాయ, పొట్లకాయ, పుట్టగొడుగు వంటి కూరగాయలను మీ ఆహారంలో చేర్చుకోండి. ఇది కాకుండా, ఆవు పాలు, కొబ్బరి నీరు, గ్రీన్ టీ, బాదం, వేరుశెనగ వంటి ఆహారాలు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ఇంకో విషయం.. ఇందులోని అంశాలు నిపుణుల సలహాలు, సూచనల ద్వారా అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Tags:    

Similar News