మీ శరీరంలో ఇది పెరుగుతుందా? అయితే గుండెపోటు రావడం ఖాయం

ప్రస్తుతం కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. జీవననశైలిలో మార్పులు, సరైన

Update: 2024-03-24 05:31 GMT

Heart attack

ప్రస్తుతం కాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే మంచి పోషకాలున్న ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. జీవననశైలిలో మార్పులు, సరైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మేలు. ఇప్పుడున్న జనరేషన్‌లో ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది పని నిమిత్తం తొందరపడి అల్పాహారాన్ని మానేస్తారు. ఇది సరైనది కాదంటున్నారు నిపుణులు. మీరు ఉదయం ఆఫీసుకు వెళ్లే ముందు ఆరోగ్యకరమైన వాటిని తినాలి. ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. అయితే అల్పాహారం దాటవేయడం వల్ల లిపోప్రొటీన్ (LDL) పెరుగుతుంది. చెడు కొవ్వు పెరగడం వల్ల ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి మనం బ్రేక్‌ఫాస్ట్‌లో ఎలాంటివి తినాలో తెలుసుకుందాం.

వీటిని తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది

వోట్మీల్: వోట్మీల్ అల్పాహారంలో తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది మీ జీర్ణవ్యవస్థలో LDL కొలెస్ట్రాల్‌ను స్తంభింపజేసి పెరగకుండా నియంత్రిస్తుంది. మీ శరీరం హైకొలెస్ట్రాల్ ను తొలగించడంలో ఎంతగానో సహాయపడుతుంటున్నారు నిపుణులు. అలాగే తరిగిన ఆపిల్, పియర్ లేదా కొన్ని రాస్ప్బెర్రీస్ లేదా స్ట్రాబెర్రీలను జోడించండి.

గుడ్డులోని తెల్లసొన: మీరు న్యూట్రీషియన్-రిచ్ అల్పాహారం కోసం చూస్తున్నట్లయితే, గుడ్డులోని తెల్లసొనను ఖచ్చితంగా తినండి. ఎందుకంటే ఇది తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగదు. మంచి మొత్తంలో ప్రోటీన్ కూడా లభిస్తుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తుంది.

ఆరెంజ్: ఆరెంజ్ (కమల పండు) చాలా సాధారణంగా అన్ని చోట్ల దొరికే పండు. దీని రసంలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఫైబర్‌ ఫుడ్ లతో కలిపి తినడం మంచిది. తద్వారా మీకు పుష్కలంగా ఫైబర్ లభిస్తుంది. దీంతో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

స్మోక్డ్ సాల్మన్: సాల్మన్ ఫిష్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు.. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అలాగే రక్తంలో ట్రైగ్లిజరైడ్‌ల సంఖ్యను తగ్గిస్తాయి. దీని కోసం, మీరు టమోటాలు, కేపర్లు, నువ్వులు వంటి ఇతర ఆహారాలతో కాల్చి సాల్మన్‌ను ఆస్వాదించవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కొలెస్ట్రాల్‌ పెరగకుండా చూసుకుంటే గుండె జబ్బులకు దూరంగా ఉండవచ్చు. లేకుంటే గుండె సంబంధిత వ్యాధులతో పాటు గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags:    

Similar News