Heart Attack: చలికాలంలో ఈ తప్పులు చేస్తే గుండెపోటు రావచ్చు!

శీతాకాలం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సమయంలో గుండెపోటు కేసులు కూడా

Update: 2023-12-08 03:12 GMT

శీతాకాలం ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సమయంలో గుండెపోటు కేసులు కూడా పెరుగుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. ఉదయం 4 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో ఎపినెఫ్రిన్, కార్టిసాల్ హార్మోన్ల స్థాయి పెరుగుతుంది. దీని పెరుగుదల కారణంగా శరీరంలో రక్తపోటు పెరుగుతుంది. ఆక్సిజన్ డిమాండ్ కూడా పెరుగుతుంది. ఇది నేరుగా గుండెపై ప్రభావం చూపుతుంది. BP పెరగడం, ఆక్సిజన్‌కు అధిక డిమాండ్ కారణంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది.

చలికాలంలో ఉదయం పూట గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక రక్తపోటు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చలికి శరీరంలోని రక్తనాళాలు కుంచించుకుపోవడం వల్ల చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. ఇది గుండె సిరలలో రక్త ప్రసరణను తగ్గిస్తుంది. దీని కారణంగా రక్తపోటు పెరుగుతుంది. రక్తాన్ని పంప్ చేయడానికి గుండె చాలా కష్టపడాలి. ఈ ఒత్తిడి పెరగడం వల్ల గుండెపోటు వస్తుంది.

నిపుణులు ఏమంటున్నారు?

సునార్ ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లో కార్డియాలజీ విభాగంలో డా. కె.జాంబ్‌ మాట్లాడుతూ.. చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రజలు కూడా కొన్ని తప్పులు చేస్తారు. ఇది గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది అని అన్నారు.

ఈ తప్పు చేయవద్దు:

- విపరీతమైన చలిలో నడవడం మానుకోండి

- అకస్మాత్తుగా త్వరగా వ్యాయామం చేయవద్దు

- తినే ఆహారం స్పీడ్‌గా మింగడం చేయవద్దు

- జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండాలి

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

Tags:    

Similar News