సిజేరియన్ డెలివరీ తర్వాత ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

C-Section Tips: సిజేరియన్ డెలివరీ తర్వాత, గర్భిణీ స్త్రీలకు అదనపు జాగ్రత్త అవసరం. ఈ సమయంలో చిన్న పొరపాటు జరిగినా తర్వాత

Update: 2024-01-11 11:50 GMT

C-Section Tips

C-Section Tips: సిజేరియన్ డెలివరీ తర్వాత, గర్భిణీ స్త్రీలకు అదనపు జాగ్రత్త అవసరం. ఈ సమయంలో చిన్న పొరపాటు జరిగినా తర్వాత అనేక సమస్యలు వస్తాయి. సిజేరియన్ తర్వాత నడవడానికి లేదా ఏదైనా ఇతర కార్యకలాపాలు చేసే ముందు, కొన్ని విషయాలను గుర్తుంచుకోవడం ముఖ్యం. అందుకే ఆహారం నుండి లైంగిక కార్యకలాపాల వరకు సిజేరియన్ డెలివరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రసూతి, గైనకాలజిస్ట్ డాక్టర్ రిద్ధిమా శెట్టి నుండి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

సిజేరియన్ డెలివరీ తర్వాత మీరు తెలుసుకోవలసిన ముఖ్యమైన అంశాలు:

1. డాక్టర్ సలహాను అనుసరించండి:

సిజేరియన్ డెలివరీ తర్వాత గాయం పూర్తిగా ఆరిపోయి కోలుకోవడానికి 4-8 వారాలు పడుతుంది. శస్త్రచికిత్స తర్వాత 48 గంటలలో స్నానం చేయడం సిఫారసు చేయలేదు. ఇలా చేస్తే శస్త్రచికిత్స జరిగిన ప్రాంతంలో గాయంగా ఏర్పడే ప్రమాదం ఉంది. సంక్రమణ ప్రమాదం పెరుగుతుంది.

2. లైంగిక చర్య:

సిజేరియన్ తర్వాత, కొన్ని వారాల వరకు ప్రైవేటు పార్ట్‌లోకి ఏమీ వెళ్లకూడదు. సాధారణంగా డాక్టర్ రిద్ధిమా శెట్టి 6 వారాల తర్వాత లేదా డాక్టర్ అనుమతి తర్వాత మాత్రమే లైంగిక చర్యల్లో పాల్గొనాలని సలహా ఇస్తున్నారు.

3. బరువు తగ్గడానికి డైట్ చేయవద్దు:

ప్రసవించిన 6-12 నెలల తర్వాత బరువు తగ్గడం గురించి ఆలోచించండి. చాలామంది మహిళలు ప్రసవించిన 6 వారాలలో సగం బరువు కోల్పోతారు. రోజువారీ వ్యాయామంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. పరుగు, కఠోరమైన వ్యాయామం, హడావుడిగా మెట్లు ఎక్కడం, దిగడం పూర్తిగా మానుకోవాలి. డెలివరీ అయిన వెంటనే బరువు తగ్గడానికి డైటింగ్‌లో పాల్గొనవద్దు. ఎందుకంటే మీరు తల్లిపాలు ఇస్తున్నట్లయితే మీకు రెట్టింపు పోషకాహారం అవసరం.

4. తల్లిపాలు:

మీరు తల్లిపాలు ఇవ్వలేకపోతే అపరాధ భావంతో ఉండకండి. ఇది సాధారణ సమస్య కావచ్చు. అందుకే దాని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ఈ సమయంలో డాక్టర్ సలహాను జాగ్రత్తగా పాటించడం చాలా ముఖ్యం.

5. జ్వరం వచ్చినప్పుడు వైద్యుడిని సంప్రదించండి:

జ్వరం 100 ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికి ఇది చాలా ముఖ్యం. కొన్నిసార్లు నొప్పి, ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరం వచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు పార్ట్‌లో దుర్వాసన వచ్చినా.. నొప్పిని అనుభవిస్తే వైద్యుడిని సంప్రదించండి.

6. మానసిక ఆరోగ్యానికి చికిత్స:

సాధారణంగా ప్రసవం తర్వాత హార్మోన్ల మార్పుల కారణంగా తల్లులు ప్రసవానంతర డిప్రెషన్‌కు గురవుతారు. మీకు త్వరగా కోపం వస్తుంటే సైకాలజిస్ట్ లేదా థెరపిస్ట్‌ని కలవడానికి వెనుకాడకండి.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags:    

Similar News