క్యారెట్ తినడం, జ్యూస్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసా ? థైరాయిడ్ ఉన్నవారు క్యారెట్ తినొచ్చా ?

రాయిడ్ ఉన్నవారు క్యారెట్ తినొచ్చా ? థైరాయిడ్ ఉన్నవారు క్యారెట్ తీసుకోవచ్చో లేదో అని సందేహిస్తుంటారు. ఈ సమస్యలు ఉన్నవారు

Update: 2022-08-15 12:55 GMT

క్యారెట్.. ఆ సీజన్.. ఈ సీజన్ అని లేకుండా.. ఏడాదంతా లభించే దుంప జాతికి చెందిన వెజిటేబుల్ ఇది. చాలా మంది క్యారెట్ ను పచ్చిగా తినేందుకే ఇష్టపడుతుంటారు. కొందరు సలాడ్ లో, మరికొందరు జ్యూస్ రూపంలో, ఇంకొందరు కూరగా చేసుకుని ఆహారంగా తీసుకుంటుంటారు. క్యారెట్ ను పచ్చిగా తినడం, జ్యూస్ తాగడం వల్ల ఎక్కువ పోషకాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు. కంటికి, కంటి చూపు మెరుగు అయ్యేందుకు ఎంతో మేలు చేసే క్యారెట్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

క్యారెట్ లో యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. క్యారెట్ లో ఉండే విటమిన్ -A మన కంటిచూపును మెరుగుపరుస్తుంది. అలాగే విటమిన్-C కూడా ఉంటుంది.

క్యారెట్ లో ఉండే ఫ్లావనాయిడ్ కాంపౌండ్స్ చర్మానికి మంచి కాంతినిస్తాయి. అలాగే ఊపిరితిత్తులకు రక్షణ కల్పిస్తాయి. ఇందులో ఉండే సోడియం బీపీ (రక్తపోటు)ను నియంత్రించేలా సహాయపడుతుంది.

అలాగే క్యారెట్ లో ఉండే ఫోలిక్ యాసిడ్, పిరిడాక్సిన్, థయామిన్ వంటి విటమిన్లు జీవక్రియను క్రమంగా ఉంచేందుకు తోడ్పడుతాయి.


ప్రతిరోజూ క్యారెట్ తినడం వల్ల కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. లివర్ క్యాన్సన్సర్, లంగ్ క్యార్, కోలన్ క్యాన్సర్ ముప్పు ఉండదు.

అంతేకాకుండా.. క్యారెట్ లో కాల్షియం, కాపర్‌, పొటాషియం, మాంగనీస్‌, ఫాస్ఫరస్‌ వంటి మినరల్స్‌ కూడా పుష్కలంగా లభిస్తాయి.

విటమిన్-ఎ లోపంతో చాలామందికి చర్మం, జుట్టు పొడిబారుతుంటాయి. ప్రతినిత్యం క్యారెట్ తినడం వల్ల అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

గుండె వ్యాధులను నివారించడంలోనూ క్యారెట్ తోడ్పడుతుంది. క్యారెట్‌లో ఉండే అత్యధిక కెరోటినాయిడ్స్, ఆల్ఫా కెరోటిన్, లూటిన్‌లు గుండె వ్యాధులను నివారిస్తుంది.

థైరాయిడ్ ఉన్నవారు క్యారెట్ తీసుకోవచ్చో లేదో అని సందేహిస్తుంటారు. థైరాయిడ్, పీసీఓడీ సమస్యలు ఉన్నవారు క్యారెట్ ను పచ్చిగా తినేకంటే.. జ్యూస్ చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు.


Tags:    

Similar News