మనిషి 200 ఏళ్ల దాకా బతకొచ్చంటున్న బాబా

ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు 40 ఏళ్లకే ప్రాణాలు కోల్పోతున్నారు. 60 సంవత్సరాలు పైన మనిషి బతికితే చాలని అనుకునే పరిస్థితులు తలెత్తాయి

Update: 2025-07-02 10:15 GMT

ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు 40 ఏళ్లకే ప్రాణాలు కోల్పోతున్నారు. 60 సంవత్సరాలు పైన మనిషి బతికితే చాలని అనుకునే పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో యోగా గురు బాబా రాందేవ్‌ మనిషి 200 ఏళ్ల దాకా బతకొచ్చని అంటున్నారు. మనిషి జీవితకాలం కేవలం వందేళ్ల వరకు మాత్రమే పరిమితం కాదని అన్నారు. సహజంగా మానవుడి జీవితకాలం 100 ఏళ్లు మాత్రమే కాదు. దాదాపు 150-200 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. ప్రస్తుత కాలంలో మనం మెదడు, గుండె, కళ్లు, కాలేయంపై ఎక్కువ ఒత్తిడి పెడుతున్నామని, 100 ఏళ్లలో తినాల్సిన ఆహారాన్ని కేవలం 25 సంవత్సరాల్లోనే తింటున్నామని అన్నారు. అందరికీ ఆహార క్రమశిక్షణ, మంచి జీవనశైలి ముఖ్యమని చెప్పారు. శరీరంలో ప్రతీ కణానికి సహజమైన జీవితకాలం ఉంటుందని, దానిపై ప్రభావం పడేలా ఏదైనా చేసినప్పుడు అది అంతర్గతంగా ఇబ్బందులు తలెత్తేలా చేస్తుందన్నారు.

Tags:    

Similar News