అవాస్తవం: ప్రధాని మోడీ అదాని భార్య ముందు వంగి వంగి నమస్కారాలు చేయడం లేదు

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక మహిళ ముందు వంగి ఆమెకు అభివాదం చేస్తున్న చిత్రం ప్రచారంలో ఉంది. ఆమె గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీ అనీ, వారి ముందు ప్రధాని వంగి వంగి దండాలు పెడుతూ జీతగాడిలా ఉంటారనీ ఆ కధనం పేర్కొంది.

Update: 2022-09-13 11:25 GMT

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక మహిళ ముందు వంగి ఆమెకు అభివాదం చేస్తున్న చిత్రం ప్రచారంలో ఉంది. ఆమె గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీ అనీ, వారి ముందు ప్రధాని వంగి వంగి దండాలు పెడుతూ జీతగాడిలా ఉంటారనీ ఆ కధనం పేర్కొంది.

చిత్రంపై క్యాప్షన్, తెలుగులో ఇలా ఉంది " అదాని సతీమణి కి వంగి వంగి దండాలు పెడుతున్న విశ్వగురువు…. మనం ప్రధాని అనుకుంటున్నాం కానీ ఆయన అంబానీ, అదానీ కుటుంబాలకు జీతగాడు అనేది అర్ధం కావట్లేదు"

ఇది సోషల్ మీడియా అన్ని మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

Full View


Full View


Full View


ఈ క్లెయిమ్ 2020 సంవత్సరంలో ఇంగ్లీష్, హిందీ వంటి భాషలలో వైరల్ అయ్యింది. అనేక నిజ నిర్ధారణ చేసే సంస్థలు దీనిని తప్పుడు వార్తగా నిర్ధారించాయి, కానీ ఇప్పుడు మళ్లీ ఈ క్లెయిం తెలుగు భాషలో వైరల్ అయ్యింది.

నిజ నిర్ధారణ:

భారత ప్రధాని మోదీ అదానీ భార్య ముందు వంగి నమస్కరిస్తున్నట్లు వైరల్‌గా ఉన్న వాదన అవాస్తవం. చిత్రంలో కనిపిస్తున్న మహిళ గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీ కాదు. ఆమె దివ్య జ్యోతి ఫౌండేషన్ అనే ఎన్ జీ ఓ చీఫ్ ఫంక్షనరీ ఆఫీసర్ దీపికా మోండోల్.

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి చిత్రాన్ని శోధించినప్పుడు, ఈ చిత్రం హిందీ దినపత్రిక అమర్ ఉజాలా ప్రచురించిన ఒక కథనంలో లభించింది. అమితాబ్ బచ్చన్ వంటి ప్రముఖులతో ఆమె ఇతర చిత్రాలను కూడా మనం ఈ కధనం లో చూడవచ్చు.

మరాఠీ వెబ్‌సైట్ 'దైనిక్ దివ్య మరాఠీ'లో మరొక కథనం కూడా లభించింది. ఈ రెండు కథనాలు భారత ప్రధాని మోడీ ఈ మహిళకు ఎందుకు వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారో, ఈ మహిళ ఎవరో అని చర్చించాయి.

మహిళ పేరు దీపికా మోండల్ అని, ఈ ఫోటో 2015లో తీయబడింది అని ఈ రెండు కథనాలు వివరిస్తున్నాయి. ఆమె ఒక ఎన్ జీ ఓ - దివ్య జ్యోతి కల్చరల్ ఆర్గనైజేషన్ మరియు వెల్ఫేర్ సొసైటీకి చీఫ్ ఫంక్షనల్ ఆఫీసర్. ఈ ఎన్ జీ ఓ భారతీయ కళలు, సంస్కృతిని ప్రోత్సహిస్తుంది.

'అనా టీవీ' అనే యూట్యూబ్ ఛానెల్ ఆగస్టు 24, 2018 న దీపికా మోండోల్ ఇంటర్వ్యూను ప్రచురించింది. ఆ వీడియో టైటిల్ ""बदलता भारत –एक महिला जिसके आगे भारत के प्रधानमंत्री को झुकाना पड़ा अपना सिर, जानकर रह जाएंगे दंग", అనువదించగా, "మారుతున్న భారతదేశం – భారత ప్రధాని తల వంచి దండం పెత్తిన ఈ స్త్రీ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు". ఇంటర్వ్యూ మధ్యలో వైరల్ చిత్రం చూడవచ్చు, కనుక ఈ చిత్రంలో కనిపించేది దీపికా మోండోల్ అని ధృవీకరించవచ్చు.

Full View

ఎన్ జీ ఓ డైరెక్టరీ వెబ్‌సైట్ కూడా దీపికా మోండోల్ ను ఎన్ జీ ఓ చీఫ్ ఫంక్షనల్ ఆఫీసర్ గా పేర్కొంది.

ఎన్ జీ ఓ దివ్య కల్చరల్ ఆర్గనైజేషన్స్ అండ్ సోషల్ వెల్ఫేర్ సొసైటీ వెబ్‌సైట్‌లో శోధించినప్పుడు, వైరల్ ఇమేజ్‌లో ఉన్న మహిళతో సరిపోలుతున్న దీపికా మోండోల్ చిత్రాలు లభిన్చాయి.

http://www.dcosws.org/gallery.asp

కాబట్టి, వైరల్ చిత్రంలో కనిపిస్తున్న మహిళ అదానీ భార్య కాదు, ఆమె ఒక ఎన్ జీ ఓ కి పని చేస్తారు. క్లెయిం అవాస్తవం.

Claim :  Woman to whom Modi bowed is Adani’s wife
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News