ఫ్యాక్ట్ చెక్: గత 100 సంవత్సరాలలో మొదటిసారి సౌదీ అరేబియాలో మంచు కురిసిందా..? లేదు

భారీగా మంచు కురుస్తూ ఉండగా.. అక్కడే రెండు ఒంటెలు కూర్చున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. పలువురు ట్విట్టర్‌లో వీడియోలను పోస్టు చేస్తూ ఉన్నారు.

Update: 2023-03-18 13:54 GMT

భారీగా మంచు కురుస్తూ ఉండగా.. అక్కడే రెండు ఒంటెలు కూర్చున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. పలువురు ట్విట్టర్‌లో వీడియోలను పోస్టు చేస్తూ ఉన్నారు. సౌదీ అరేబియాలో మంచు కురుస్తూ ఉందని.. గత 100 సంవత్సరాలలో ఇలా జరగడం మొదటిసారి అంటూ పలువురు పోస్టులు పెడుతూ వస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సౌదీ అరేబియాలో మంచు కురుస్తోందన్న వాదనతో వీడియో షేర్ చేస్తున్నారు.

హిమపాతం వీడియో "గ్లోబల్ వార్మింగ్ మళ్లీ ప్రభావాన్ని చూపిస్తూ ఉంది, సౌదీ అరేబియాలో 100 సంవత్సరాలలో మొదటిసారి మంచు కురిసింది" (“Global warming strikes again, First snow in Saudi Arabia in 100 years.”) అనే శీర్షికతో పోస్టులను వైరల్ చేస్తూ వస్తున్నారు.

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న పోస్టు ప్రజలను తప్పు దోవ పట్టిస్తూ ఉంది. వైరల్ వీడియో 2021 లో సౌదీ అరేబియాకు సంబంధించినది.వీడియో నుండి తీసుకున్న కీలక ఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా.. ఫిబ్రవరి 2021 కు సంబంధించి మేము అనేక ఫలితాలను కనుగొన్నాము.GulfToday.ae ప్రకారం, సౌదీ అరేబియా, సిరియా, లెబనాన్, జోర్డాన్, ఇజ్రాయెల్‌తో సహా మిడిల్ ఈస్ట్ లోని పలు దేశాలలో మంచు కురిసింది. కొన్ని ప్రాంతాలను మంచు కప్పేసింది. సౌదీ అరేబియాలోని తబుక్ ప్రాంతంలో కూడా మంచు కురుస్తోంది. పక్కనే ఉన్న పర్వత ప్రాంతం తెల్లటి మంచుతో కప్పబడి ఉంది. మంచుతో కప్పబడిన దారిలో ఒంటెలు కూర్చున్న వీడియో వైరల్‌గా మారింది.khou.com అనే వెబ్సైట్ లో కూడా వీడియోను పోస్ట్ చేశారు.అయితే సౌదీ అరేబియాలో మంచు కురవడం ఇదే మొదటిసారి ఏమీ కాదు. నవంబర్ 2020లో thenationalnews.comలో ప్రచురించబడిన ఒక నివేదిక, సౌదీ అరేబియాకు ఉత్తరాన ఉన్న ఆష్ షుకైక్ సమీపంలో మంచు కురిసిందని గుర్తించారు. ఇసుక దిబ్బలు మంచుతో కప్పబడి ఉంది. ఆ ప్రాంతంలో ఒంటెల గుంపు వెళుతున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.సౌదీ అరేబియాలో ఎప్పుడైనా మంచు కురుస్తుందో లేదో తెలుసుకోడానికి మేము "సౌదీ అరేబియాలో హిమపాతం" అనే కీవర్డ్‌లతో శోధించాము. టూరిస్ట్ వెబ్‌సైట్ visitsaudi.comని కనుగొన్నాము, అందులో మంచును చూడాలని అనుకుంటే సౌదీకి ఉత్తరం వైపు వెళ్లండని ఉంది. ఆ దేశంలోని ఉత్తర ప్రాంతాల పర్వతాలలో హిమపాతం ఉంటుంది. సౌదీ అరేబియా అంటే విపరీతమైన ఎండలు మాత్రమే ఉంటాయని అనుకోకండి. సౌదీ అరేబియాలోని తబుక్ ప్రాంతంలో 2018లో కూడా మంచు కురిసినట్లు వార్తలు వచ్చాయి.https://www.arabnews.com/node/1220741/saudi-arabiaసౌదీ అరేబియాలో 100 ఏళ్ల తర్వాత తొలిసారి మంచు కురిసిందన్న వాదన తప్పుదారి పట్టిస్తోంది. సౌదీ అరేబియాలోని ఉత్తర ప్రాంతాలలో గత కొన్ని సంవత్సరాలుగా మంచు కురుస్తోంది.

Claim :  viral video shows first snowfall in Saudi Arabia in last 100 years
Claimed By :  Twitter Users
Fact Check :  False
Tags:    

Similar News