ఫ్యాక్ట్ చెక్: అపరిశుభ్రమైన స్ట్రీట్ ఫూడ్ ను అమ్ముతోంది భారత్ దేశంలో కాదు, వైరల్ వీడియో బాంగ్లాదేశ్ కి చెందింది

భారతీదేశంలోని వీధుల్లో దొరికే ఆహారానికి మంచి పేరు ఉంటుంది. రుచులు, విభిన్న ప్రాంతీయ ప్రత్యేకతలు, సరసమైన ధరలకు ప్రపంచ

Update: 2025-06-06 11:18 GMT

Street food video

భారతీదేశంలోని వీధుల్లో దొరికే ఆహారానికి మంచి పేరు ఉంటుంది. రుచులు, విభిన్న ప్రాంతీయ ప్రత్యేకతలు, సరసమైన ధరలకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పానీ పూరి, వడపావ్, చాట్ వంటి ప్రసిద్ధ వీధి ఆహార పదార్థాలు భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇష్టపడతారు. భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ పెరుగుతోంది కూడా!! భారతీయ సంస్కృతిలో వీధుల్లో దొరికే తినుబండారాలు ముఖ్యమైన పాత్ర పోషిస్థాయి, ప్రాంతీయ సంప్రదాయాల రుచిని ఆస్వాదించే అనుభవాన్ని అందిస్తుంది. భారతీయ నగరాల వీధి మూలల్లోని విక్రేతల నుండి లభించే వివిధ రకాల రుచులు కూడా ఎంతో ఆనందిస్తూ ఉంటారు. చాట్, సమోసా, భెల్ పూరి, పానీ పూరి, జలేబీ వంటి వీధి ఆహారాలు భారతదేశం అంతటా ప్రసిద్ధి చెందాయి. ఈ పదార్థాలు ప్రాంతాల వారీగా మారుతూ ఉంటాయి. వీధుల్లో ఆహారాన్ని తరచుగా చేతులను ఉపయోగించి చేస్తుంటారు. ముఖ్యంగా తయారీ, వడ్డించడానికి చేతులనే ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు దీనిని అపరిశుభ్రంగా భావింస్తారు. ఇటీవలి కాలంలో చాలా మంది వీధి ఆహార విక్రేతలు కూడా గ్లవ్స్ ను వాడడం భారత్ లో బాగా పెరిగింది. పరిశుభ్రత పద్ధతులను పాటిస్తున్నారు. 

ఇంతలో ఒక వీడియోలో వీధి విక్రేత వివిధ రంగుల మసాలా పదార్ధాలను పొట్లం కడుతు కనిపిస్తాడు. కానీ వీడియోలో ఈగలు ఆహారంపైన ఎగురుతుండడం చూడొచ్చు. ఈ వీడియోను భారతీయ వీధి ఆహారంపై విమర్శలు చేస్తూ ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారు. 

వైరల్ వీడియో స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు. 


ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో భారతదేశానికి సంబంధించింది కాదు. బంగ్లాదేశ్ నుండి వచ్చింది. 
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా “బంగ్లాదేశ్‌లో అత్యంత ప్రత్యేకమైన వీధి ఆహారం” అనే శీర్షికతో ఉన్న అదే వీడియోను జూలై 2023లో ప్రచురించారని మేము కనుగొన్నాము. “Most unique street food in Bangladesh” అనే టైటిల్ తో వీడియోను మీరు చూడొచ్చు.
Full View

మరింత వెతికితే “Unusual mixed fruit pickle on Bangladesh streets” అనే శీర్షికతో అదే మసాలా దినుసులను అమ్ముతున్న మరొక వీధి ఆహార విక్రేతకు సంబంధించిన వీడియో మాకు కనిపించింది. దీనిని ఆగస్టు 6, 2023న స్ట్రీట్‌ఫుడ్ రెసిపీ అనే ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు షేర్ చేశారు.

ఇదే వీడియోను ఆమ్చి ముంబై అనే యూట్యూబ్ ఛానల్ “Bangladesh’s unique mixed fruit pickles I street food” అనే శీర్షికతో వీడియో షేర్ చేసింది. వీడియో వివరణలో 'బంగ్లాదేశ్‌లోని ఢాకాలో వీధి ఆహార విక్రేత రుచికరమైన మిశ్రమ పండ్ల ఊరగాయలను అందిస్తాడు #streetfood #bangladeshfood #bangladeshstreetfood' అని ఉంది.
Full View
Full View
బంగ్లాదేశ్‌లో స్ట్రీట్ ఫుడ్‌గా అమ్మే మిక్స్‌డ్ ఫ్రూట్ పికిల్స్ గురించి మరింత వెతికితే, ఫుడ్ బిడి అనే మరో యూట్యూబ్ ఛానెల్ దొరికింది. అందులో ‘Mixed fruits pickle making master I Bangladeshi street food’ అనే వీడియో ఉంది. వీడియో డిస్క్రిప్షన్ లో ‘A South Asian pickle, known as achar, aachar, athanu, achaar or loncha, is a pickled food, native to the Indian subcontinent, made from a variety of vegetables and fruits, preserved in brine, vinegar, or edible oils along with various Indian spices. Bengali Style Unique Mixed Fruits Pickle | Bangladeshi Street Food Mixed Fruits Pickle Making Master | Bangladeshi Street Food Location: TSC, Dhaka University, Shahbag, Dhaka, Bangladesh, South Asia.’ అని ఉంది. దక్షిణాసియా ఊరగాయ, ఆచార్, అథాను, అచార్ లేదా లోంచా అని కూడా దీన్ని పిలుస్తారని తెలిపారు. బెంగాలీ శైలి ప్రత్యేకమైన మిశ్రమ పండ్ల ఊరగాయ అని తెలిపారు. ఇది TSC, ఢాకా విశ్వవిద్యాలయం, షాబాగ్, ఢాకా, బంగ్లాదేశ్ లో లభిస్తుందని వివరించారు.

Full View

అందువల్ల, ఒక వీధి వ్యాపారి అపరిశుభ్రమైన పరిస్థితులలో తినుబండారాలను తయారు చేస్తున్న వైరల్ వీడియో భారతదేశానికి సంబంధించింది కాదు. ఇది బంగ్లాదేశ్‌లో అమ్మే వీధి ఆహారాన్ని చూపిస్తుంది. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. 
Claim :  భారతదేశంలో ఒక స్ట్రీట్ ఫూడ్ విక్రేత అపరిశుభ్రమైన రీతిలో ఆహారాన్ని అమ్ముతున్నాడు
Claimed By :  X (Twitter) users
Fact Check :  Unknown
Tags:    

Similar News