ఫ్యాక్ట్ చెక్: ఫ్యాక్టరీలో పండని పండ్లు, కూరగాయలపై కెమికల్స్‌ స్ప్రే చేస్తున్నట్టు చూపుతున్న వీడియో ఏఐ తో తయారు చేసింది

పండ్లను వేగంగా పక్వం చేయడానికి కృత్రిమ పక్వం (Artificial ripening) అనే నియంత్రిత విధానాన్ని ఉపయోగిస్తారు. సాధారణంగా ఇది

Update: 2025-10-08 12:03 GMT

పండ్లను వేగంగా పక్వం చేయడానికి కృత్రిమ పక్వం (Artificial ripening) అనే నియంత్రిత విధానాన్ని ఉపయోగిస్తారు. సాధారణంగా ఇది ఎథిలీన్ గ్యాస్ (Ethane gas) ద్వారా జరుగుతుంది. ఇది పండ్ల రూపాన్ని మెరుగుపరచడంలో, రవాణా సులభంగా చేయడానికీ, వినియోగదారుల అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది. అయితే, ఇలా రసాయనాలతో పండిచిన పండ్లు ఆరోగ్యానికి హానికరం, ఎందుకంటే వాడే రసాయనాలు విషపూరితమైనవి, నిషేధించబడినవి. ఈ పద్ధతిలో కొన్నిచోట్ల నియంత్రణ లేకపోయినా, చాలా దేశాలలో, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో, ప్రజల ఆరోగ్య భద్రత కోసం దీనిని నిషేధించారు. అయితే, కొంతమంది వ్యాపారులు కేల్షియం కార్బైడ్ (Calcium carbide) అనే నిషేధిత రసాయనాన్ని ఉపయోగిస్తారు. దీనిలో ఉన్న ఆర్సెనిక్ (Arsenic) ఫాస్ఫరస్ (Phosphous) వంటి పదార్థాలు ఆరోగ్యానికి హానికరం. కృత్రిమంగా పక్వం చేసిన పండ్లు చాలా సమానమైన రంగు లేదా అసహజ మెరుపు కలిగి ఉంటాయి, రసాయనాల వాసన వస్తుంది.

ఇదిలా ఉండగా, ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఫ్యాక్టరీలో హాజ్మాట్ సూట్ లు ధరించిన వ్యక్తులు పండని అరటిపండ్లు, టమాటాలు మొదలైన వాటిపై కెమికల్ స్ప్రే చేస్తున్నట్లు, ఆ స్ప్రే చేసిన వెంటనే పండ్లు పసుపు లేదా ఎరుపు రంగులోకి మారుతున్నట్లు కనిపిస్తోంది.

Full View

Full View

ఇదే క్లెయిమ్‌తో షేర్ అవుతున్న అధిక నిడివి ఉన్న వీడియో కూడా ఆన్‌లైన్‌లో ఉంది. ఇందులో కూడా అవే దుస్తులు ధరించి ఆపిల్‌, ద్రాక్షలపై స్ప్రే చేస్తూ కొంతమంది ని చూడొచ్చు.

Full View

ఇదే వైరల్ క్లెయిమ్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్‌.


ఫ్యాక్ట్ చెక్:

ఈ క్లెయిమ్‌ వాస్తవం కాదు. వీడియో ఏఐ ద్వారా సృష్టించినది.

వైరల్ వీడియో నుంచి కీ ఫ్రేమ్‌లు తీసి Google రివర్స్ ఇమేజ్ సెర్చ్ వాడి పరిశీలించగా, ఇదే వీడియోని ఇతర సోషల్ మీడియా అకౌంట్లు కూడా పంచుకున్నాయి. ఆ వీడియోల్లో ఎడమ పై మూలలో చైనీస్ పదం “AI生成” కనిపించింది.

Full View

ఈ “AI生成” అనే చైనీస్ పదాన్ని అనువదించగా “AI-generated” (ఏఐ తో తయారు చేసినది) అని వస్తుంది. అంటే ఈ వీడియోను ఏఐ టూల్స్ ద్వారా రూపొందించారు.

ఇంకా, టమాటాలపై స్ప్రే చేస్తున్నప్పుడు కొన్నివి ఎరుపు రంగులోకి మారగా, మరికొన్నివి పచ్చగానే ఉన్నాయి — ఇది సహజంగా జరగదు. ఈ దృశ్యం వీడియో కృత్రిమంగా రూపొందించబడిందని సూచిస్తుంది. ఈ వాటర్ మార్క్ వల్ల మనకి వీడియో ఏఐ తో తయారు చేసింది అని తెలుస్తోంది

ఇక్కడ వీడియోలో కనిపించిన “AI生成” వాటర్‌మార్క్‌ ఉన్న స్క్రీన్‌షాట్‌.


వైరల్ వీడియో ఫ్రేమ్‌లను Hive Moderation, Was it AI వంటి ఏఐ కంటెంట్ గుర్తించే టూల్స్‌తో పరీక్షించగా, ఫలితాలు ఆ వీడియో ఏఐ ద్వారా రూపొందించిందని నిర్ధారించాయి. ఇక్కడ ఆ ఫలితాల స్క్రీన్‌షాట్‌లు ఉన్నాయి.




ఈ వీడియో huqiuju అనే టిక్ టాక్ వినియోగదారుడు తమ ఖాతా లో ఏఐ తో తయారౌ చేసిందని పేర్కొన్నట్టు ఫ్యాక్ట్ లీ ఫ్యాక్ట్ చెక్ కధనంలో పేర్కొన్నారు   

కనుక, వైరల్ అవుతున్న వీడియోలో కనిపించే దృశ్యాలు నిజమైనవి కావు. ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తులు పండ్లపై కెమికల్ స్ప్రే చేస్తున్నారనే క్లెయిమ్‌ నిజం కాదు. ఈ వీడియోను ఏఐ టూల్స్‌ ద్వారా రూపొందించి, మార్కెట్లో అమ్ముతున్న పండ్లపై అనవసర అనుమానం కలిగించేందుకు ప్రచారం చేస్తున్నట్లు కనిపిస్తోంది. కొంతమంది వ్యాపారులు కేల్షియం కార్బైడ్ వంటి హానికర రసాయనాలతో పండ్లను పక్వం చేస్తారనేది నిజమే, కానీ ఈ వీడియో నిజం కాదు, ఏఐ తో తయారుచేసినది.

Claim :  ఫ్యాక్టరీలో పనిచేసే వ్యక్తులు పండని పండ్లపై, కూరగాయలపై కెమికల్స్‌ స్ప్రే చేసి వాటిని పక్వమైన రంగులోకి మార్చడం వైరల్ వీడియో చూపుతోంది
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News