ఫ్యాక్ట్ చెక్: ప్రపంచ ప్రముఖులు కుంభమేళాలో పవిత్ర స్నానం చేశాంటూ షేర్ అవుతున్న వీడియో ఏఐ ద్వారా సృష్టించారు
మహా కుంభమేళా భారతదేశంలోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. జనవరి 13, 2025న ప్రారంభమైన ఈ
Eminent persons
మహా కుంభమేళా భారతదేశంలోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. జనవరి 13, 2025న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26, 2025 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో దాదాపు 40 కోట్ల మంది పాల్గొంటారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా వేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశంగా మారనుంది. యాత్రికుల రద్దీకి అనుగుణంగా, అధికారులు 4,000 హెక్టార్ల విస్తీర్ణంలో తాత్కాలిక నగరాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 150,000 టెంట్లు, మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు, మెరుగైన రవాణా సేవలు ఉన్నాయి. భద్రతా చర్యలలో 40,000 మంది పోలీసు అధికారులను మోహరించారు, భద్రతను నిర్ధారించడానికి నిఘా వ్యవస్థలను అలర్ట్ చేశారు. బ్రెజిల్, జర్మనీ, దక్షిణాఫ్రికా వంటి దేశాల నుంచి చాలా మంది విదేశీయులు మహాకుంభమేళాకు వస్తున్నారు. యాపిల్ కంపనీ మాజీ అధినేత్ స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ జాబ్స్ కూడా వచ్చారు.
ఫ్యాక్ట్ చెక్:
హిందూస్థాన్ టైమ్స్‌లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, మహాకుంభమేళాలో అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు పాల్గొన్నట్లుగా AI వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతూ ఉంది. AI వీడియోలో క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ వంటి స్టార్ ఆటగాళ్లు గంగా నదిలో స్నానం చేస్తున్నట్లు చూపించారని నివేదించారు. డొనాల్డ్ ట్రంప్, రిషి సునక్, వ్లాదిమిర్ పుతిన్ వంటి ప్రపంచ దేశాల నాయకులు AI వీడియోలో కనిపించారు. విల్ స్మిత్, జెండయా, టామ్ హాలండ్ వంటి హాలీవుడ్ స్టార్‌లు కూడా మహాకుంభ్‌కు వచ్చినట్లు ఆ వీడియోలో చూపించారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు, ఎలోన్ మస్క్ కూడా త్రివేణీ సంగమంలో స్నానం చేస్తున్నట్లు AI వీడియోలో చూడొచ్చు. ‘Artificial Budhi’ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో వీడియోను 5.7 మిలియన్ల కంటే ఎక్కువ మంది చూశారు. కామెంట్స్ విభాగంలోని పలువురు ఈ ఫోటోలను చాలా రియలిస్టిక్ గా సృష్టించారని ప్రశంసించారు. అయితే ఇలాంటి ఏఐ సృష్టి గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు.