చియాన్ విక్రమ్ వైరల్ వీడియో ఇటీవలిది కాదు, 2017 నాటిది

తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలో పాపులర్ నటుడు విక్రమ్ గత వారం ఛాతీలో అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేయడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్చారు

Update: 2022-07-13 05:09 GMT

తెలుగు మరియు తమిళ చిత్ర పరిశ్రమలో పాపులర్ నటుడు విక్రమ్ గత వారం ఛాతీలో అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేయడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేర్చారు. నిపుణులైన వైద్య బృందం అతనికి చికిత్స అందించింది. అదే సమయంలో, అతను కార్డియాక్ అరెస్ట్‌కు గురయ్యాడని పుకార్లు వ్యాపించాయి, అయితే నటుడు కార్డియాక్ అరెస్ట్‌కు గురికాలేదని వైద్యులు ధృవీకరించారు.

జూలై 11న, తన సినిమా కోబ్రా ఆడియో లాంచ్ ఫంక్షన్‌కి హాజరై విక్రం ప్రేక్షకుల ప్రేమ మరియు ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపాడు. అయితే ఇంతలో, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత విక్రమ్‌ ఒక వీడియో ద్వారా తన అభిమానులకు ధన్యవాదాలు చెప్తున్నట్టుగా ఒక వీడియో వైరల్ అవుతోంది.

గత వారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఈ వీడియో ను విక్రమ్ షేర్ చేశారంటూ క్లెయిం తో యూట్యూబ్‌తో సహా పలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు పంచుకున్నాయి. ట్విట్టర్‌లో చాలా మంది ఆ వీడియోను "#chiyaan Vikram is discharged today" అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు.

ఈ క్లెయిం ను ప్రముఖ తెలుగు టీవీ ఛానెల్ టివి9తో సహా కొన్ని తెలుగు మీడియా సంస్థలు కూడా పంచుకున్నాయి.

Full View




Full View

https://manithan.com/article/vikram-thanks-video-after-discharge-from-hospital-1657445496?fbclid=IwAR2i8jI7QIB4_E4uU4H9dNsCFDm86WdsuyyZio2w8_ybLmgSettWcBaaqf4

నిజ నిర్ధారణ:

'చియాన్' విక్రమ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత వైరల్ వీడియో ను తీసినట్టుగా అవుతున్న ప్రచారం అబద్ధం.

ఈ వీడియోను పోస్ట్ చేసిన ట్వీట్‌లపై వచ్చిన వ్యాఖ్యలను గమనించినప్పుడు, ఈ వీడియో పాతది, ఇటీవలిది కాదని పేర్కొంటూ ఎన్నో కామెంటను గమనించాము.

విక్రమ్ తన అభిమానులకు విపరీతమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపుతున్న వీడియో ఇది అని కొంతమంది తమ బదులులో పేర్కొన్నారు.

దీనిని ఆధారంగా తీసుకుని, 'చియాన్ విక్రమ్ అభిమానులకు ధన్యవాదాలు' () అనే కీవర్డ్‌లతో సెర్చ్ చేసినప్పుడు, విక్రమ్ ఫ్యాన్స్ ట్విట్టర్ హ్యాండిల్ ఒకటి ఏప్రిల్ 2017లో వారి ఖాతాలో ప్రచురించిన అదే వీడియో కనిపించింది. ఈ వీడియోలో, 'ఇది అద్భుతమైన జన్మదినం' అని విక్రం చెప్పడం మనం వినవచ్చు.

ఈ వీడియోను ఇండియా గ్లిట్జ్ తమిళ్ అనే వెబ్ సైట్ వారు ఏప్రిల్ 2017లో షేర్ చేసారు, టైటిల్‌ 'విక్రమ్ పొంగిపోయాడు: అభిమానుల ప్రేమ మద్దతుకు ధన్యవాదాలు | పుట్టినరోజు వేడుక, స్కెచ్ మూవీ' అని ఉంది.

వీడియో వివరణలో 'చియాన్ విక్రమ్ యొక్క ధ్రువ నక్షత్రం రెండవ టీజర్ విక్రమ్ పుట్టినరోజు (ఏప్రిల్ 17) సందర్భంగా విడుదల చేయబడింది. తన అభిమానుల స్పందనతో ఉబ్బితబ్బిబ్బైన నటుడు, తన అభిమానుల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్స్టాగ్రాం లో వీడియోను పంచుకున్నారు.

Full View

'the_real_chiyaan' పేరుతో విక్రమ్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియో కూడా లభించింది. ఈ వీడియో ఏప్రిల్ 17, 2017న పోస్ట్ చేయబడింది.

అందువల్ల, జూలై 2022లో ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత నటుడు విక్రమ్ ఈ వైరల్ వీడియోను పోస్ట్ చేశారనే క్లెయిం అబద్దం.

ఈ వీడియో ఇటీవలిది కాదు, 2017 నాటిది. తన అభిమానులు తన పుట్టినరోజు సందర్భంగా అభిమానం చూపినందుకు ధన్యవాదాలు తెలుపుతూ విడుదల చేసిన వీడియో అది.

Claim :  viral video of Vikram after he was discharged from the hospital in 2022
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News