ఫ్యాక్ట్ చెక్: కవిత సస్పెండ్ అయ్యాక బీఆర్‌ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు నిప్పు పెట్టారనేది నిజం కాదు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆమె తండ్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్

Update: 2025-09-04 06:30 GMT

Telangana Bhavan fire

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఆమె తండ్రి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నడిపే భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) పార్టీకి వ్యతిరేకంగా ఇటీవల ఆమె చేసిన వ్యాఖ్యలు, పార్టీ సీనియర్ నాయకులపై బహిరంగంగా నెపం మోపడం కారణమని పార్టీ ప్రకటించింది. బీఆర్‌ఎస్ నేతృత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, కవిత ప్రవర్తన, మరియు పార్టీ వ్యతిరేక చర్యలు పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగిస్తున్నాయని తెలిపింది. సస్పెన్షన్ నిర్ణయం వెలువడిన తర్వాత కవిత అనుచరులు నిరసన తెలిపారు.

బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత తనపై కుట్ర జరుగుతోందని తీవ్ర ఆరోపణలు చేశారు. హరీష్ రావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి కుట్రలకు తెరలేపారని అన్నారు. తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపినా, ఆ తర్వాత తిరిగి వచ్చి ప్రజాక్షేత్రంలో పని చేశానని బీసీల కోసం మహిళలకు రూ.2500 ఇవ్వాలని ఉద్యమం చేశానని ఆమె తెలిపారు. తనపై కుట్రలకు ప్రధాన కారణం హరీష్ రావే అని విమర్శించారు.

ఈ క్రమంలో, సోషల్ మీడియాలో బీఆర్‌ఎస్ భవన్ దహనమవుతున్న వీడియో వైరల్ అవుతోంది. కవిత సస్పెన్షన్‌ను ఆనందిస్తూ బీఆర్‌ఎస్ కార్యకర్తలే తెలంగాణ భవన్‌కు నిప్పు పెట్టారంటూ పోస్టులు ప్రచారం అయ్యాయి.



ఆ క్లెయిమ్‌ ఆర్కైవ్ లింక్.

ఫాక్ట్ చెక్:

ఈ క్లెయిమ్ ప్రజల్ను తప్పుదారి పట్టిస్తోంది. వైరల్ వీడియో కొత్తది కాదు. ఇది 2021 మార్చిలో జరిగిన అగ్నిప్రమాదానికి చెందినది. వైరల్ వీడియో నుండి కీ ఫ్రేమ్‌లను తీసి రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అదే వీడియోలు 2021లోనే ప్రచురించబడ్డాయని తెలిసింది.

2021 మార్చి 20న యూట్యూబ్‌లో “Fire Accident in TRS Bhavan l Full Video l Un Expected Accident l” శీర్షికతో వీడియో అప్లోడ్ అయింది.
Full View

అదే తేదీన సియాసత్ డైలీ కూడా వీడియో ప్రచురించింది.
Full View

టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం, మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సురభి వాణీ దేవి విజయం సాధించగా, పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చడంతో తెలంగాణ భవన్‌లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది.

సమయం తెలుగు ప్రకారం, పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీ దేవి బీజేపీ అభ్యర్థి రాంచంద్రరావుపై గెలుపొందిన సందర్భంగా బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఆనందంగా బాణాసంచా కాల్చారు. వాణీ దేవి 1,28,010 ఓట్లు సాధించగా, రాంచంద్రరావు 1,19,198 ఓట్లు పొందారు. ఉత్సాహంగా ఈ సంబరాలు జరుపుకుంటున్న సమయంలో ఉన్నట్టుండి ఈ అగ్ని ప్రమాదం జరిగింది. కార్యకర్తలు సంబరాల్లో అత్యుత్సాహం ప్రదర్శించి బాణసంచా కాల్చారు. బాణాసంచా నిప్పు రవ్వలు కాస్తా పైకప్పుపై పడ్డాయి. వెంటనే మంటలు అంటుకున్నాయి. తెలంగాణ భవన్‌లో మంటలు ఎగిసి పడుతుండడంతో వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. 

వైరల్ వీడియోలో కనిపిస్తున్న తెలంగాణ భవన్ అగ్ని ప్రమాదం కొత్తది కాదు. ఇది 2021 మార్చిలో సురభి వాణీ దేవి ఎమ్మెల్సీ గెలుపు సందర్భంగా జరిగిన బాణాసంచా వేడుకలలో చోటుచేసుకున్నది. కవిత సస్పెన్షన్‌తో దీనికి సంబంధం లేదు. 

Claim :  కవితను పార్టీ నుండి సస్పెండ్ చేసాక బీఆర్‌ఎస్ కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు నిప్పు పెట్టారంటూ వైరల్ అవుతున్న వీడియో
Claimed By :  Twitter users
Fact Check :  Unknown
Tags:    

Similar News