ఫ్యాక్ట్ చెక్: ఆ పెళ్ళికి వెళ్లి షారుఖ్ ఖాన్ డ్యాన్స్ చేయలేదు

షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ భారీగా కలెక్షన్స్ ను సాధిస్తూ రికార్డులను కొల్లగొడుతూ వస్తోంది. పఠాన్ సినిమా చుట్టూ కొద్దిరోజులు వివాదాలు నడిచినప్పటికీ.. ఆ తర్వాత సినిమా విడుదల అవ్వడం, భారీ కలెక్షన్స్ సాధించడం జరిగిపోయింది.

Update: 2023-02-15 06:00 GMT

షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన పఠాన్ భారీగా కలెక్షన్స్ ను సాధిస్తూ రికార్డులను కొల్లగొడుతూ వస్తోంది. పఠాన్ సినిమా చుట్టూ కొద్దిరోజులు వివాదాలు నడిచినప్పటికీ.. ఆ తర్వాత సినిమా విడుదల అవ్వడం, భారీ కలెక్షన్స్ సాధించడం జరిగిపోయింది.

సినిమా మీద భారీగా ఖర్చు పెట్టిన షారుఖ్ ఖాన్ ఇప్పుడు పెళ్లిళ్లలో డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేయడం మొదలుపెట్టాడని పలువురు పోస్టులు పెడుతున్నారు. షారుఖ్ ఖాన్ లాగా ఉన్న ఓ వ్యక్తి పెళ్లి మండపంలో కనిపించాడు.

“బాయ్ కాట్ పఠాన్” అనే హ్యాష్‌ట్యాగ్‌తో, “పఠాన్ సినిమాపై దాదాపు 500 కోట్లు కొట్టిన తర్వాత, ఇప్పుడు 60 ఏళ్ల వయస్సులో, షారుక్ ఖాన్ పెళ్లిళ్లలో డబ్బు కోసం డ్యాన్స్ చేస్తున్నాడు” అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేస్తున్నారు.

ఫ్యాక్ట్ చెకింగ్:


వైరల్ వీడియోను నిశితంగా పరిశీలిస్తే అందులో ఉన్నది ఒరిజినల్ షారుఖ్ ఖాన్ కాదని స్పష్టంగా తెలుస్తుంది. అంతే కాకుండా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. మా టీమ్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి యూట్యూబ్‌లో అదే విజువల్స్ ఉన్న వీడియోను కనుగొంది. వీడియో నిడివి ఎక్కువ ఉన్న వెర్షన్ మాకు దొరికింది. ‘IBRAHIM QADRI’ అనే ఛానెల్‌లో అప్‌లోడ్ చేశారు. జులై 12, 2022న “Ghunghte Mein Chanda Hai Phir Bhi Hai Phela SHAHRUKH KHAN IBRAHIM QADRI” అనే వీడియోను అప్లోడ్ చేశారు. ఈ వీడియోకు 13 మిలియన్ల వ్యూస్ కంటే ఎక్కువ వచ్చాయి. వైరల్ అవుతున్న వీడియోలో ఉన్న వ్యక్తి ఇబ్రహీం.. అతడు షారుఖ్ ఖాన్ లాగా ఉంటాడు.
Full View
ఇబ్రహీం షారుఖ్ ఖాన్ పాటలకు డ్యాన్స్ చేయడం, వివిధ ఈవెంట్‌లలో పాల్గొంటూ ఉంటాడు. సోషల్ మీడియాలో కూడా అతడు బాగా ఫేమస్ అయ్యాడు. అతను బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ లాగా ఉంటాడని పలు మీడియా సంస్థలు కథనాలను కూడా ప్రసారం చేశాయి. అతడి సోషల్ మీడియా ఖాతాలలో కూడా షారుఖ్ ఖాన్ ను అనుకరిస్తూ వస్తుండడం మీరు గమనించవచ్చు.

https://www.hindustantimes.
com/entertainment/bollywood/shah-rukh-khan-s-latest-lookalike-is-confusing-fans-i-can-t-believe-my-eyes-101622716573247.html


ఇబ్రహీం ఖాద్రీని SRK అని భావించడం ఇది మొదటిసారి కాదు. అక్టోబర్ 2021లో, ఖాన్ తన కొడుకు ఆర్యన్‌ని అరెస్టు చేసిన తర్వాత కలుసుకున్నట్లు ఆరోపిస్తూ అనేక వీడియోలు షేర్ చేశారు. వాస్తవానికి వైరల్ పోస్టులలో ఖాద్రీ, అతని స్నేహితుడు గుఫ్రాన్ రూమి ఉన్నారు.

వైరల్ వీడియోలో బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ డబ్బు కోసం వివాహ వేడుకలో డ్యాన్స్ చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. వైరల్ పోస్టుల్లో నిజం లేదు.
Claim :  Video shows Bollywood actor SRK dancing at a wedding for money, post his expenditure on “Pathaan”.
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News