ఫ్యాక్ట్ చెక్: వరద నీటిలో కొట్టుకుపోతున్న వారిని చూపిస్తున్న వీడియో ఏఐ తో తయారు చేసింది, నిజం కాదు

భారతదేశంలోని వివిధ ప్రాంతాలను భారీ వర్షాలు, ఆ తర్వాత వచ్చిన వరదలు ప్రభావితం చేశాయి. అస్సాం, మేఘాలయ, మిజోరం, ఇతర రాష్ట్రా

Update: 2025-06-20 11:29 GMT

భారతదేశంలోని వివిధ ప్రాంతాలను భారీ వర్షాలు, ఆ తర్వాత వచ్చిన వరదలు ప్రభావితం చేశాయి. అస్సాం, మేఘాలయ, మిజోరం, ఇతర రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటం, ప్రాణనష్టం సంభవించాయి. సాధారణంగా దేశంలో వ్యవసాయానికి కీలకమైన రుతుపవనాలు కూడా ఈ వరదలకు కారణమయ్యాయి. భారీ వరదలు కొండచరియలు విరిగిపడటంతో ఈశాన్య ప్రాంతంలో కనీసం 34 మంది మరణించారు. ముంబై, బెంగళూరు వంటి నగరాలలో రోజువారీ ప్రజల జీవితానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఫిబ్రవరి, మే 2025లో, హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి. దీని వలన కులు, ఇతర జిల్లాల్లో గణనీయమైన నష్టం వాటిల్లింది. వరదల కారణంగా ఆస్తి నష్టాలే కాదు, వాహనాలు కూడా కొట్టుకుపోయాయి.

గుజరాత్‌లో కూడా వర్షపాతం చాలా ప్రాంతాల్లో విపత్తుగా మారింది. ఎందుకంటే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు, భవనాలు కూలిపోవడం, పలు జిల్లాల్లో ప్రాణనష్టం సంభవించింది. జూన్ 16, 17, 18 తేదీల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి, బోటాడ్‌లో ఒక కుటుంబంలోని ఏడుగురు సభ్యుల ప్రాణాలను బలిగొంది. వివిధ వరద ప్రభావిత ప్రాంతాల నుండి 100 మందికి పైగా రక్షించారు. ఇలాంటి సంఘటనలను చూపించే అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బలమైన నది ప్రవాహాల కారణంగా ఒక పెద్ద రాతిపై కొంతమంది వ్యక్తులు చిక్కుకున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెలవులకు వచ్చిన వ్యక్తులు ఆకస్మిక వరదల్లో చిక్కుకున్నారనే వాదనతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
Full View



వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

ఆకస్మిక వరదల కారణంగా నది మధ్యలో ఒక పెద్ద రాయిపై ప్రజలు చిక్కుకున్న వాదన నిజం కాదు.
ఈ వీడియో AI-జనరేటెడ్. జాగ్రత్తగా గమనించినప్పుడు విజువల్స్ చాలా తేడాగా అనిపిస్తున్నాయి. వాస్తవానికి దూరంగా ఉన్నాయి. రాతిపై నిలబడి ఉన్న వ్యక్తుల సంఖ్య చాలా పెద్దదిగా కనిపిస్తుంది. చెట్లు, ఒకదానికొకటి కలిసిపోతున్న శరీరాలు, రాళ్ళు, ఇతర పర్యావరణ వివరాలు AI-జనరేటెడ్ వీడియో లాగా అనిపిస్తూ ఉన్నాయి.
వైరల్ వీడియో AI-జనరేటెడ్ అవునా కాదా అని తెలుసుకోడానికి మేము మిస్‌ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్‌లో భాగమైన డీప్‌ఫేక్స్ అనాలిసిస్ యూనిట్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాము. ఏఐ తో తయారు చేసిన చిత్రాలనీ, వీడియోలనీ కనుగొనడానికి ఉపయోగించే కొన్ని డిటెక్షన్ టూల్స్ ని ఉపయోగించి శోధించగా వీడియో నిజం కాదని తెలిసింది. 
AI డిటెక్షన్ టూల్, AI or Not ఇది ఏఐ టెక్నాలజి ని వాడి తయారు తయారు చేసిన వీడియోగా
 నిర్ధారించింది. ఏఐ అవునా కాదా అని తెలియజేసే ఫలితాలకు సంబంధించిన స్క్రీన్‌షాట్ ఇక్కడ ఉంది. 

ISitAI సాధనాన్ని ఉపయోగించి వీడియోలోని కీఫ్రేమ్‌లను తనిఖీ చేసినప్పుడు, ఆ వీడియో AI-జనరేటెడ్ వీడియో అని మేము నిర్ధారించగలిగాము. అందుకు సంబంధించిన స్క్రీన్‌షాట్ ఇక్కడ చూడొచ్చు.

మరో AI డిటెక్షన్ టూల్ WasitAI కూడా వీడియో AI- జనరేటెడ్ వీడియో అని నిర్ధారించింది. ఫలితానికి సంబంధించిన స్క్రీన్‌షాట్ ఇక్కడ ఉంది.

అందువల్ల, నదిలో ఆకస్మిక వరదల కారణంగా ఒక పెద్ద రాతిపై చాలా మంది చిక్కుకున్నట్లు వైరల్ అవుతున్న వీడియో నిజమైన సంఘటనకు చెందింది కాదు. ఈ వీడియోను AI ద్వారా సృష్టించారు.
Claim :  నదిలో ఆకస్మిక వరదల కారణంగా ఒక పెద్ద రాతిపై నిలబడి ఉన్న వ్యక్తులు కొట్టుకుపోయినట్లు వైరల్ వీడియో చూపిస్తుంది
Claimed By :  Social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News