ఫ్యాక్ట్ చెక్: నేపాల్ నిరసనల వీడియోగా షేర్ అవుతున్నది సిక్కిం లో ప్రజలు మోడీకి స్వాగతం పలుకుతున్న వీడియో
సోషల్ మీడియా నిషేధం కారణంగా నేపాల్‌లో రాజకీయ అవినీతిపై పెద్ద పోరాటమే జరిగింది. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నిరసనలు
By - Satya Priya BNUpdate: 2025-09-13 07:00 GMT
సోషల్ మీడియా నిషేధం కారణంగా నేపాల్‌లో రాజకీయ అవినీతిపై పెద్ద పోరాటమే జరిగింది. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. స్థిరపడిన ఉన్నత వర్గాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 9 న జరిగిన నిరసనలు ప్రధాన మంత్రి కె.పి. శర్మ ఓలిని పదవీచ్యుతుని చేయడానికి దారితీశాయి. దక్షిణాసియాలోని ఇతర ప్రాంతాలలో ఇటీవలి సంక్షోభాలను గుర్తుకు తెస్తూ, అనేక మంది సీనియర్ మంత్రులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. అధికారిక నివాసాలను నిరసనకారులు తగలబెట్టారు. దోచుకున్నారు. ఈ హింసాత్మక నిరసనల సమయంలో 51 మంది మరణించారు.
ఇదిలా ఉండగా, భారత ప్రధాని మోదీ చిత్రంతో కూడిన బ్యానర్‌ను పట్టుకుని కొంతమంది ఊరేగింపుగా వెళ్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, నేపాల్‌లో కూడా భారత ప్రధాని మోదీని అభిమానిస్తున్నారనే వాదనతో పోస్టులు పెట్టారు. “देखो चमचों मोदी नेपाल में भी छाया हुआ है‚ तुम लोग डूब कर मर क्यों नहीं जाते आहुल गांडी को साथ में लेकर के।“. అంటూ పోస్టులు పెట్టారు.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఈ వీడియో నేపాల్ కు సంబంధించింది కాదు, భారత రాష్ట్రమైన సిక్కిం కు సంబంధించింది.
వీడియోను జాగ్రత్తగా గమనిం
చగా, బ్యానర్‌పై ‘సిక్కిమీస్ లింబూ తెగలు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని సిక్కిం రాష్ట్రానికి హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నారు. సిక్కిం యక్తుంగ్ సప్సోక్ సాంగ్చుంబో’ అని చూడవచ్చు. వీడియో కు సంబంధించిన స్క్రీన్ షాట్ ఇక్కడ
చూడొచ్చు.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి శోధించినప్పుడు, “we Indians feel proud of being Indian india prime minister Narendra Modi is a responsible and vigilant leader. He rules over the hearts of 144 crore Indians. india king only one pm Narendra Modi” అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసిన ఒక వీడియో కనిపించింది.
సుఖిమ్ యక్తుంగ్ సప్సోక్ సాంగ్చుంబో అనే పేజీలో “We, the Sikkimese Limboo Tribe, under the banner of Sukhim Yakthung Sapsok Songchumbho, were eagerly prepared to extend a warm welcome to the Hon’ble Prime Minister of India, Shri Narendra Modi, on his scheduled visit to Sikkim on 29th May 2025, to commemorate the 50th Anniversary of Sikkim’s Statehood.” అప్లోడ్ చేసిన ఒక ఫేస్‌బుక్ వీడియోను కూడా మేము కనుగొన్నాము. దాని శీర్షిక ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం పలుకుతూ ఉన్నారు.
ఫేస్ బుక్ పేజీ లో ఉన్న వీడియో లోని స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడొచ్చు.
కాబట్టి, వైరల్ వీడియో నేపాల్ లో నిరసనలకు సంబంధించినది కాదు. ఈ వీడియో సిక్కిం రాష్ట్రం నుండి వచ్చింది, సిక్కిమీస్ లింబో తెగ అనే తెగ భారత ప్రధాని మోదీని సిక్కింలో స్వాగతించే ఊరేగింపుకు సంబంధించింది. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim : హింసాత్మక నిరసనల మధ్య భారత ప్రధాని మోదీకి మద్దతుగా నేపాల్ ప్రజలు వీధుల్లోకి వచ్చారని వైరల్ వీడియో చూపిస్తోంది
Claimed By : Twitter users
Fact Check : Unknown