ఫ్యాక్ట్ చెక్: ఏఐ తో సృష్టించిన వీడియో తమిళనాడులోని మహాబలిపురంకు చెందిన విజువల్స్ గా ప్రచారం అవుతోంది

తమిళనాడు తీరప్రాంత పట్టణం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన మహాబలిపురం ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం. ప్రాచీన భారతీయ

Update: 2025-04-17 11:34 GMT

 submerged temple

తమిళనాడు తీరప్రాంత పట్టణం, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన మహాబలిపురం ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం. ప్రాచీన భారతీయ శిల్పకళా నైపుణ్యాన్ని, ఆనాటి పల్లవ రాజుల ఘనమైన చారిత్రక కళా సంపదను తరతరాలుగా తెలియజేస్తున్న రాతి గోపురాల సముద్ర తీర పట్టణమే మహాబలిపురం. సముద్ర తీర ఆలయం మాత్రమే నీటి పైన కనిపించినప్పటికీ, నీటి అడుగున ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయని అంటుంటారు. పల్లవ రాజవంశం నిర్మాణ శైలికి సాక్ష్యంగా గణనీయమైన సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఈ శిథిలాలు పెద్ద ఎత్తున పర్యాటకాన్ని ఆకర్షిస్తాయి. 2017లో, తీర ప్రాంత ఆలయానికి సమీపంలో నీటి అడుగున పురావస్తు పరిశోధనలో 4 నుండి 9 మీటర్ల లోతులో మునిగిపోయిన మానవ నిర్మిత నిర్మాణాలు బయటపడ్డాయి.

నీటిలో మునిగిపోయిన శిల్పాలు, విష్ణువు విగ్రహాలు, ఆలయ నిర్మాణాల చుట్టూ స్కూబా డైవర్లు ఈత కొడుతున్నట్లు చూపించే వీడియో వైరల్ అవుతూ ఉంది. మహాబలిపురం తీరంలో తీర దేవాలయానికి సమీపంలో భారతీయ డైవర్ల బృందం చేస్తున్న పరిశోధన అనే వాదనతో ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది. శేషనాగు శరీరంపై చుట్టబడిన అనంతశయన భంగిమలో విష్ణువు విగ్రహాన్ని వారు కనుగొన్నారని ఈ పోస్టుల ద్వారా చెబుతున్నారు. “Indian divers on exploration off coast of ancient #Mahabalipuram For centuries 7 magnificent temples been told of, 6 swallowed by sea. भारतीय गोताखोरों की एक टीम प्राचीन #महाबलीपुरम के एक शोध पर। सदियों से, सात भव्य मंदिरों के बारे में बताया है,छह समुद्र निगल गया। #तमिलनाडु” అనే క్యాప్షన్ తో వీడియోలను షేర్ చేస్తున్నారు.


వైరల్ అవుతున్న పోస్టులకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ లను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. సర్క్యులేషన్‌లో ఉన్న వీడియో AI టెక్నాలజీని ఉపయోగించి రూపొందించారు.
వీడియోను విశ్లేషించడానికి, వీడియో AI ద్వారా రూపొందించబడిందో లేదో తనిఖీ చేయడానికి మేము డీప్‌ఫేక్స్ అనాలిసిస్ యూనిట్‌ సహకారం తీసుకున్నాం. కొన్ని విలక్షణమైన విజువల్స్‌ను స్క్రీన్‌షాట్‌లుగా తీసుకుని వివిధ AI డిటెక్షన్ టూల్స్ ను ఉపయోగించి వాటిని తనిఖీ చేసాము. ఈ వీడియో మిగిలిన వాటి కంటే మెరుగైన నాణ్యతతో ఉన్నట్లు మేము గమనించాము. జనరేటివ్ ఎలిమెంట్‌లను కంటితో గుర్తించడం చాలా కష్టం. మేము మొత్తం వీడియోను హైవ్ AI ఇమేజ్ క్లాసిఫైయర్‌కు అప్‌లోడ్ చేసాము, బహుళ ఇమేజ్ క్లాసిఫైయర్‌ల ద్వారా తెలుసుకోడానికి బహుళ కీఫ్రేమ్‌లను తీసుకున్నాము.

AI సాధనాల ద్వారా ఈ విజువల్స్ ను సృష్టించారని హైవ్ డిటెక్షన్ టూల్ ద్వారా తెలిసింది. ఈ విజువల్స్ సృష్టి వెనుక 'పికా టూల్' ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. సంబంధిత ఫలితాల స్క్రీన్‌షాట్‌లు ఇక్కడ ఉన్నాయి. 





WasitAI డిటెక్షన్ టూల్ ద్వారా కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ లో సెర్చ్ చేశాము. వీడియో AI టెక్నాలజీని ఉపయోగించి రూపొందించినట్లుగా మేము నిర్ధారించగలిగాము. ఫలితాలకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌లు ఇక్కడ చూడొచ్చు.





మరింత పరిశోధన తర్వాత, ఆ వీడియోను మొదట జైప్రింట్స్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో “Anantashayana Awakens: Vishnu’s Sacred Sleep Beneath the Sea. At sunrise, a team of Indian divers prepares on a research vessel off the coast of Mahabalipuram, near the ancient Shore Temple. For centuries, legends whispered of seven magnificent temples, six of which were swallowed by the sea. Their mission? To investigate sonar scans revealing something… massive. As they descend, the sea parts like memory — and there he lies. A colossal Lord Vishnu in the Anantashayana pose, resting upon the coiled body of Sheshnag, seven divine hoods arched in silence above him. A lotus blooms from his navel. Lakshmi sits at his feet. Coral clings to his form. Myth becomes monument. Divers reach out in reverence — their gloved hands touching a foot once worshipped in temple hymns. A world lost to water, now rediscovered. Inspired by the sunken temple myths of Mahabalipuram, Tamil Nadu. Crafted with love by @jayprints.

Note: These visuals are AI-generated for artistic and cultural storytelling purposes. We honor all traditions with deep respect.
#vishnu #lordkrishna #krishnaconciousness
#vishnubhagwan #isckon #reelsvideo #ai #trendingreels
#trending #explorepage #underwater
#hareramaharekrishna అనే క్యాప్షన్‌తో షేర్ చేశారని మేము కనుగొన్నాము.
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ బయోని మేము పరిశీలించాం. అతను ఒక AI ఆర్టిస్ట్ అని, అతని ఖాతాలో AI జనరేటెడ్ వీడియోలు, చిత్రాలను చాలా షేర్ చేస్తున్నాడని కూడా మేము కనుగొన్నాము. బయో స్క్రీన్‌షాట్ ఇక్కడ చూడొచ్చు.

మహాబలిపురంలోని విష్ణు దేవాలయం మునిగిపోయిన శిథిలాలకు సంబంధించిన చిత్రాల కోసం మేము శోధించినప్పుడు, ‘యూజ్ ఆఫ్ జియోస్పేషియల్ టెక్నిక్స్‌ ఇన్ మారిటైమ్ ఆర్కియాలజీ విత్ రిఫరెన్స్ టు ది తమిళనాడు కోస్ట్’ అనే రీసెర్చ్ పేపర్
లభించింది. అందులో మహాబలిపురం దేవాలయం మునిగిపోయిన శిథిలాలకు సంబంధించిన కొన్ని చిత్రాలు ఉన్నాయి. మరికొన్ని చిత్రాలను కూడా ఈ ఆర్టికల్ లో మనం చూడవచ్చు. ఈ చిత్రాలు వైరల్ వీడియోలోని విజువల్స్ లాగా స్పష్టంగా లేవు.
కాబట్టి, వైరల్ వీడియో AI ద్వారా సృష్టించినవి, ఆ విజువల్స్ తమిళనాడులోని మహాబలిపురంలో మునిగిపోయిన ఆలయానికి సంబంధించిన నిజమైన విజువల్స్‌ కాదు. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  తమిళనాడులోని మహాబలిపురంలో నీట మునిగిన విష్ణు దేవాలయాన్ని చూపుతున్న వైరల్ వీడియో
Claimed By :  Social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News