ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియో ఉత్తరాఖండ్ లో వచ్చిన ఫ్లాష్ ఫ్లడ్ కి సంబంధించింది కాదు, ఇటలీ కి చెందింది

దేశవ్యాప్తంగా, ఉత్తరాఖండ్ ఉత్తరఖాషి జిల్లాలో ఆగస్ట్ 5న జరిగిన భారీ క్లుడ్ బర్స్ట్ వల్ల తీవ్రతరమైన ఫ్లాష్ ఫ్లడ్స్

Update: 2025-08-14 07:28 GMT

దేశవ్యాప్తంగా, ఉత్తరాఖండ్ ఉత్తరఖాషి జిల్లాలో ఆగస్ట్ 5న జరిగిన భారీ క్లౌడ్ బరస్ట్ వల్ల తీవ్రతరమైన ఫ్లాష్ ఫ్లడ్స్ సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదలలో ఇళ్ళు, హోటళ్లు, మౌలిక వసతులు సమూలంగా నాశనం అయిపోయాయి. కనీసం 50 మంది కనిపించకుండా పోయారు. వాతావరణం, భౌగోళిక విపత్తుల కారణంగా రక్షణ చర్యలకు అవరోధాలు ఏర్పడుతున్నాయి. ఆగస్ట్ 15 వరకు ఉత్తరఖాషిలో భారీ వర్షాలు పడుతునడటం తో రక్షణ చర్యలు ఆలస్యమై, ఇంకా 43 మంది ఆచూకీ లభ్యం కాలేదని అధికారికంగా ప్రకటించారు. ధరాలిలో ప్రకృతి బీభత్సం సృష్టించిన వీడియో చూసిన ఎవరైనా వెన్నులో వణుకుపుడుతుంది. ఒక్కసారిగా దూసుకొచ్చిన బురద నీరు గ్రామాన్ని కబలించిన దశ్యాలు ఇప్పటికీ మైండ్‌లో మెదులుతూనే ఉన్నాయి. దీనంతిటికీ క్లౌడ్‌ బరస్ట్ అని ప్రాథమికంగా చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో, నల్లని రంగుతో, మట్టి కలిసిన నీటి ప్రవాహం ఉదృతంగా ప్రవహిస్తున్న దృశ్యాన్ని చూపించే వీడియో ఒకటీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “05-08-2025, हे भगवान अब बचालो इस गुप्तकाशी को ఈ उत्तराखंड का ये आपदा है” అంటూ, ఉత్తరఖండ్ వరదను చూపిస్తున్నట్టుగా వైరల్ అవుతోంది.అనువదించగా "05-08-2025, ఓ భగవంతుడా, ఇప్పుడు ఈ గుప్తకాశిని రక్షించు. ఇది ఉత్తరాఖండ్లో జరిగిన ఈ ఆపద ది." అనే వాదన తో షేర్ అవుతోంది. ఈ క్లెయిం కు సంబంధించిన లింకులను ఇక్కడ చూడొచ్చు.
Full View
Full View

క్లెయిమ్ ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

ఈ క్లెయిమ్ పూర్తిగా అబద్దపుది, నిజం కాదు. ఈ వీడియో 2025 జూలైలో ఇటలీ లోని బార్డోనేచ్చియా పట్టణంలో భారీ వర్షాలకు సంభవించిన చిత్రమైన ఫ్లాష్ ఫ్లడ్ ను చూపిస్తుంది. 

ఒక ఫేస్బుక్ యూజర్ “June 30, 2025 — Bardonecchia, Piedmont, Italy” అంటూ ఎక్కువ వివరాలతో వీడియోను షేర్ చేశాడు. ‘‘భారీ వర్షాల వల్ల Fréjus స్ట్రీమ్ ఒడ్డులు వారిగా, వీధులు, బ్రిడ్జీలు, హైవేలు నీటిలో నిండిపోయాయి; 70 సంవత్సరాల వృద్ధుడు తన వాన్ నుండి బయటికి వస్తుండగా మట్టి, నీటి ప్రవాహం అతనిని తడిమింది. అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు, రోడ్లు మూసేశారు, ప్రజలు సురక్షితంగా ఉండాలని కోరారు.’’
అంటూ ఎక్కువ నిడివి ఉన్న ఇదే వీడియో ని షేర్ చేసారు.
Full View
న్యూస్ చానల్ The Sun దీన్ని ‘‘Moment DEADLY 'water bomb’ floods town in Italy as extreme weather hits Europe’’ అనే టైటిల్ తో YouTubeలో పోస్ట్ చేసింది. ఉత్తర ఇటలీలో జరిగిన భారీ వరదలను వివరిస్తూ, కనీసం ఒకరు మరణించారని పేర్కొన్నారు.
Full View
TheUS Sun కథనం ప్రకారం, Fréjus-Tunnel వద్ద బార్డోనేచ్చియా నగరంలో శక్తివంతమైన బ్లాక్ మడ్ విద్యుత్పథంలోకి ప్రవహించింది. మేయర్ ప్రజలకు ‘‘ఇళ్లలో ఉండండి, డ్రైవింగ్ చేయద్దు’’ అని హెచ్చరించారు. ఈ ఘోర వరదల్లో 70 ఏళ్ల వ్యక్తి మృతి చెందారు. ఫైర్ఫైటర్స్ 10 మందిని భవనాలు, కార్లలో చిక్కుకున్నవారి నుండి కాపాడారు.
కనుక, ఆగస్ట్ 5, 2025న ఉత్తరాఖండ్లో ప్రమాదకర ఫ్లాష్ ఫ్లడ్ జరిగినట్టు చెప్పే వైరల్ వీడియో వాస్తవానికి ఇటలీ, బార్డోనేచ్చియా జూలై 30, 2025 ఫ్లాష్ ఫ్లడ్ ను చూపిస్తోంది; వీడియో భారతదేశానికి సంభందించింది కాదు. వాదన నిజం కాదు.
Claim :  ఆగస్ట్ 5, 2025 న ఉత్తరాఖండ్ లో వచ్చిన ప్రమాదకరమైన ఫ్లాష్ ఫ్లడ్ ని వైరల్ వీడియో చూపిస్తోంది
Claimed By :  Social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News