ఫ్యాక్ట్ చెక్: అగ్రకులాలను బెదిరిస్తున్న భీమ్ కార్యకర్తలను పోలీసులు కొట్టడం వైరల్ వీడియో చూపిస్తోందన్నది నిజం కాదు
పోలీసులు నడి వీధిలో లోదుస్తులు ధరించిన కొంతమంది యువకులను కర్రలతో కొడుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్
Deadly Soma video
పోలీసులు నడి వీధిలో లోదుస్తులు ధరించిన కొంతమంది యువకులను కర్రలతో కొడుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భీమ్ కార్యకర్తలు ఇన్‌స్టాగ్రామ్‌లో అగ్రకులాలకు చెందిన వారిని బెదిరిస్తూ, ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వ్యక్తులకు గుణపాఠం నేర్పుతున్నారని పేర్కొంటూ ఈ వీడియో వైరల్ అవుతూ ఉంది.
“इंस्टाग्राम पर मनुवादियों को धमकी देने बाली भीमटा गैंग की आज सेवा की गई I टोचन जिंदाबाद ” అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేస్తున్నారు. బెదిరిస్తున్న వారికి పోలీసులు గట్టి బుద్ధి చెప్పారని ఈ పోస్టుల్లో తెలిపారు.
“तेलंगाना में भीमटा गैंग की इलाज करती पुलिस..” అంటూ కూడా కొందరు పోస్టులు పెట్టారు. ఇది తెలంగాణలో చోటు చేసుకున్న ఘటన అన్నది కొందరి వాదన.
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వైరల్ వీడియో నిజమైనది కాదు. ఇది “డెడ్లీ సోమ” అనే కన్నడ సినిమా షూటింగ్ కు సంబంధించినది.వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఉపయోగించి వెతకగా, ఆ వీడియో పాతదని మేము తెలుసుకున్నాం. కన్నడ పిచ్చర్ అనే ఛానెల్ కన్నడలో టైటిల్‌తో ప్రచురించిన యూట్యూబ్ వీడియోను మేము కనుగొన్నాము. “ಡೆಡ್ಲಿ ಸೋಮ 2 ಸಿನೆಮಾ exclusive ಮೇಕಿಂಗ್| deadlysoma movie shooting exclusive making | #shorts”, అనే టైటిల్ తో వీడియోను పోస్టు చేశారు.
"కన్నడ పిచ్చర్" అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ‘ಸಿಟಿ ಮಾರ್ಕೆಟ್ ನಲ್ಲಿ ಬಟ್ಟೆ ಬಿಚ್ಚಿಸಿ ಅಟ್ಟಾಡಿಸಿ ಹೊಡೆದ ಪೊಲಿಸರೂ | deadly soma 2 movie exclusive making video |’ అనే క్యాప్షన్ తో ఏప్రిల్ 15, 2025న ప్రచురించబడిన వీడియోను కూడా మేము కనుగొన్నాము. ఇది డెడ్లి సోమా 2 అనే సినిమా మేకింగ్ వీడియో అని వివరించారు.
‘డెడ్లీ సోమ 2’ సినిమా నిర్మాణం గురించి ‘ಸಿನ್ಮಾ ಶೂಟಿಂಗ್ ನೋಡಿ ಬೆಚ್ಚಿಬಿದ್ದ ಪಬ್ಲಿಕ್ | Deadly 2 Shooting | Ravi Srivathsa | Dheekshith’ అనే టైటిల్ తో పోస్ట్ చేసిన నిడివి ఎక్కువ ఉన్న వీడియో కూడా మాకు దొరికింది.
వైరల్ వీడియో నుండి తీసిన స్క్రీన్‌షాట్, ‘కన్నడ పిచ్చర్’ అనే యూట్యూబ్ ఛానల్ షేర్ చేసిన వీడియో నుండి తీసిన స్క్రీన్‌షాట్ పోలిక ఇక్కడ ఉంది.
కనుక, పోలీసులు యువకులను కొడుతున్నట్లు చూపించే వైరల్ వీడియో నిజమైన సంఘటన కాదు. ఇది కన్నడలో డెడ్లీ సోమ 2 అనే సినిమా షూటింగ్‌కు సంబంధించిన విజువల్స్.
Claim : ఇన్‌స్టాగ్రామ్‌లో అగ్రకులాలను బెదిరిస్తున్న భీమ్ కార్యకర్తలను పోలీసులు కొడుతున్న వీడియో
Claimed By : Twitter users
Fact Check : Unknown