ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో డ్యాన్స్ చేస్తున్నది మోనాలిసా కాదు, అసలు నిజం ఇదే
మహాకుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతూ మీడియా కి దొరికి ఫేమస్ అయిన మోనాలిసా, “మహా కుంభ్ వైరల్ గర్ల్”గా పేరు తెచ్చుకుంది
Monalisa dance video
మహాకుంభమేళాలో రుద్రాక్ష మాలలు అమ్ముతూ మీడియా కి దొరికి ఫేమస్ అయిన మోనాలిసా, “మహా కుంభ్ వైరల్ గర్ల్”గా పేరు తెచ్చుకుంది. ఆమె అమాయకమైన మొహం, సింపుల్ లుక్ వెంటనే అందరి మనసులు గెలుచుకున్నాయి. దీనితో, ఆమె జీవితమే మారిపోయింది. తర్వాత ఆమె మ్యూజిక్ వీడియోల్లో కనిపించసాగింది, అలాగే బాలీవుడ్‌లో నటించడానికి కూడా ఆమెకి కొన్ని అవకాశాలు వచ్చాయి.
ఇటీవల, నలుపు రంగు డ్రెస్‌లో డ్యాన్స్ చేస్తున్న ఒక యువతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ యువతి మోనాలిసానే అని చెబుతూ, “డబ్బు వచ్చాక ఎంతగా మారిపోయిందో చూడండి” అంటూ సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. “OMG!! She is Monalisa from Mahakumbh mela. Money can change everything” అన్న క్యాప్షన్‌తో ఆ వీడియోకు బాగా షేర్లు వచ్చాయి.
ఫ్యాక్ట్ చెక్:
ఈ క్లెయిమ్ నిజం కాదు. వీడియోలో కనిపిస్తున్నది మోనాలిసా కాదు.
జాగ్రత్తగా గమనిస్తే, ఆ వీడియోలో @ni8.out9 అనే వాటర్‌మార్క్ కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఈ హ్యాండిల్ కోసం వెతికితే, “@ni8.out9” అనే AI ఫేస్ స్వాప్ యాప్‌కి సంబంధించిన సోషల్ మీడియా పేజీలు లభించాయి. అందులో ఇలాంటి ఎన్నో ఫేస్ స్వాప్ వీడియోలు ఉన్నాయి. వాటిలో వైరల్ అవుతున్న వీడియో కూడా ఉంది. దీన్నిబట్టి ఇది ఏఐతో చేసిన వీడియో అని స్పష్టమవుతుంది. ఈ వైరల్ వీడియో 25 సెప్టెంబర్ 2025న మొదటిగా పబ్లిష్ అయింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో @ni8.out9 బయోలో కూడా ఇది AI ఫేస్ స్వాప్ యాప్ అని స్పష్టంగా రాసి ఉంది.
దీనితో పాటు మోనాలీసా కు చెందిన మరొక వీడియో లభించింది. దాని డిస్క్రిప్షన్ లో, ఆ వీడియో వినోదం కోసం మాత్రమే ఫేస్ స్వాప్ టెక్నాలజీని ఉపయోగించి సృష్టించారనీ.మోసం చేయడానికి లేదా తప్పుదారి పట్టించే ఉద్దేశ్యం లేదు; అన్ని కంటెంట్ వినోదం, సృజనాత్మక వ్యక్తీకరణ కోసం మాత్రమే ఉద్దేశించింది. వీక్షకుల అభీష్టానుసారం సృష్టించాము అంటూ తెలిపారు.
ఇంకా డీటైల్స్ చెక్ చేయగా, అసలు డ్యాన్స్ వీడియో 'తనూ రావత్' అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దని తెలిసింది. ఆమె తన యూట్యూబ్ ఛానెల్ @టనురవత్33ట్లో ఈ వీడియోను సెప్టెంబర్ 14, 2025న అప్‌లోడ్ చేసింది.
తనూ రావత్ యూట్యూబ్ చానల్ కి చెందిన బయో ని ఇక్కడ చూడొచ్చు.
తను రావత్ తన ఇన్‌స్టాగ్రామ్ఖాతాలో తనను డ్యాన్సర్, ఆర్టిస్ట్‌గా పేర్కొంది. ఇక ఈ డ్యాన్స్ వీడియోను 13 సెప్టెంబర్ 2025న ఆమె ఫేస్‌బుక్ పేజీ “tanurawat 33”లో కూడా షేర్ చేశారు.
మోనాలిసా డ్యాన్స్ వీడియో అని ప్రచారం చేస్తున్నది అబద్దం. అది తనూ రావత్ డ్యాన్స్ వీడియో. తర్వాత దాన్ని ఫేస్ స్వాప్ టెక్నాలజీతో మార్చి, మోనాలిసా వీడియోలా చూపించారు. ఇటువంటి డీప్‌ఫేక్ వీడియోల ప్రచారం మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తాయి. వాటి వలన మానసికంగా, సామాజికంగా సమాజానికి నష్టం కలుగుతుంది. భారతదేశంలో డీప్‌ఫేక్‌ల దుర్వినియోగం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) యాక్ట్ 2000, ఈఫ్ఛ్ ప్రకారం శిక్షార్హం. కోర్టులు కూడా ఇప్పటికే హానికరమైన డీప్‌ఫేక్‌లను తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించాయి.
కనుక, నల్ల డ్రెస్‌లో డ్యాన్స్ చేస్తున్నది మోనాలిసా కాదు. అది ఆఈ ఫేస్ స్వాప్ వీడియో. అసలు వీడియోలో కనిపిస్తున్నది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తనూ రావత్.