ఫ్యాక్ట్ చెక్: ఇద్దరు ముస్లిం వ్యక్తుల చేతిలో నుండి ఒక బాలికను హిందూ యువకుడు రక్షించాడనేది నిజం కాదు

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం, మైనర్ల మీద ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అభాగ్యులైన

Update: 2025-09-19 11:55 GMT

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) డేటా ప్రకారం, మైనర్ల మీద ఎన్నో దారుణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అభాగ్యులైన చిన్నారులను అపహరించి, లైంగిక వేధింపులకు పాల్పడుతూ ఉన్నారు. ఇక లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (POCSO) చట్టం వంటి చట్టాలు పిల్లలను రక్షించడానికి, కఠినమైన శిక్షలను అమలు చేయడానికి రూపొందించబడినప్పటికీ తక్కువ ప్రభావం చూపుతూ ఉన్నాయి. నివేదికలు ఇవ్వడానికి వెనకడుగు వేస్తూ ఉండడం, సామాజికంగా కళంకం వస్తుందని భయపడడం వంటి సవాళ్లు భారతదేశంలో పిల్లల రక్షణకు గణనీయమైన అడ్డంకులుగా మారాయి.

ఆయేషా అనే అమ్మాయిని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్ చేయకుండా ఒక వ్యక్తి ఒక అమ్మాయిని కాపాడుతున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఫ్రోజ్, ఇమ్రాన్ అనే ఇద్దరు వ్యక్తులు ఆయేషా అనే అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నారని వారి నుండి హర్షవర్ధన్ అనే వ్యక్తి కాపాడాడని వైరల్ అవుతున్న వాదన చెబుతోంది.
కొంతమంది వినియోగదారులు “అతను నిజమైన హీరో అఫ్రోజ్, ఇమ్రాన్ కలిసి ఆయేషా అనే అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నారు హర్షవర్ధన్ అనే అబ్బాయి అటుగా వెళ్తున్నాడు. ఆమెను కాపాడటానికి అతను తన ప్రాణాలను పణంగా పెట్టాడు. హర్షవర్ధన్ గాయపడ్డాడని, కానీ ప్రమాదం నుండి బయటపడ్డాడని కూడా అతనికి తెలియని అమ్మాయిని కాపాడాడు. #KidnappingCase #kidnappers #KidnappingAwareness #fypシ #protest #nepal #NepalPolitics” అనే క్యాప్షన్‌తో వీడియోను షేర్ చేస్తున్నారు.



Full View

Full View

ఫ్యాక్ట్ చెక్: 

వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. ఆ అమ్మాయిని కాపాడిన వ్యక్తి హర్షవర్ధన్ కాదు. ఆ వీడియో భారతదే
శానికి సంబంధించింది
 కాదు.
వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ చేయగా, ఆ వీడియో భారతదేశం నుండి వచ్చింది కాదని, శ్రీలంక నుండి అని మేము తెలుసుకున్నాం. జనవరి 12, 2025న శ్రీలంక వార్తా సంస్థ న్యూస్‌వైర్ X ఖాతాలో "జనవరి 11న కాండీలోని దౌలాగలలో ప్రైవేట్ కి వెళుతుండగా 19 ఏళ్ల పాఠశాల విద్యార్థిని కిడ్నాప్ కు గురైంది. నిందితుడిని బాధితురాలి బంధువుగా గుర్తించారు. బాలికను గుర్తించడానికి అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు" అనే శీర్షికతో జనవరి 12, 2025న అప్లోడ్ చేసిన వీడియోను మేము కనుగొన్నాము.
‘ది మార్నింగ్’ అనే వార్తా వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం, ఈ సంఘటన జనవరి 11, 2025న శ్రీలంకలోని కాండీలోని దౌలాగల ప్రాంతంలో జరిగిందని మేము కనుగొన్నాము.
కధనాల ప్రకారం, శ్రీలంకలోని కాండీలోని దౌలాగలలో 19 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసినట్లు వీడియో చూపిస్తుంది. బాలికను రక్షించారు. అనుమానితుడు మొహమ్మద్ నాసర్‌ను అంపారా నుండి కాండీకి వెళుతుండగా అరెస్టు చేశారు. బాధితురాలి తండ్రిని బెదిరించి డబ్బు వసూలు చేయడానికి కిడ్నాప్ ప్లాన్ చేశారు. వీడియోలో వ్యాన్ ఆపడానికి ప్రయత్నించిన వ్యక్తి 25 ఏళ్ల ఎలక్ట్రీషియన్ అయిన మొహమ్మద్ ఇజాదీన్ అర్షద్ అహ్మద్. బాధితురాలిని రక్షించే ప్రయత్నంలో అతను గాయపడ్డాడు. పాఠశాల బాలికను రక్షించే ప్రయత్నంలో ఆ వ్యక్తి ధైర్యసాహసాలకు శ్రీలంక పోలీసులు ప్రశంసలు కురిపించారు.
Full View
కిడ్నాప్ నుండి ఒక యువతిని రక్షించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిని చూపించే వైరల్ వీడియో భారతదేశానికి సంబంధించింది కాదు. ఈ సంఘటన జనవరి 2025 లో శ్రీలంకలో జరిగింది, అక్కడ ఒక పాఠశాల బాలికను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించగా రక్షించే ప్రయత్నం చేశారు. భారతదేశంలోని ఇద్దరు ముస్లిం యువకుల బారి నుండి బాలికను ఒక హిందూ వ్యక్తి రక్షించడానికి ప్రయత్నించాడనే వాదన నిజం కాదు.
Claim :  హిందూ యువకుడు తన ప్రాణాలను పణంగా పెట్టి ఇద్దరు ముస్లిం వ్యక్తుల చేతిలో నుండి ఒక బాలికను రక్షించాడంటూ వీడియో వైరల్ అవుతోంది.
Claimed By :  Social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News