ఫ్యాక్ట్ చెక్: పాకిస్తానీ క్రికెట్ జట్టు సభ్యులు 5 కిలోల గోధుమలు, 5 కిలోల బియ్యంతో వెళుతున్న ఫోటో కంప్యూటర్‌ ద్వారా రూపొందించారు

దాదాపు ఆరు వారాల పాటూ ప్రపంచ కప్ ఎంతో గొప్పగా సాగుతూ వచ్చింది. ఇక టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఇక ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత వరుసగా మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది పాకిస్థాన్.

Update: 2023-11-15 11:47 GMT

Pakistani team

దాదాపు ఆరు వారాల పాటూ ప్రపంచ కప్ ఎంతో గొప్పగా సాగుతూ వచ్చింది. ఇక టోర్నీ చివరి దశకు చేరుకుంది. ఇక ప్రపంచకప్‌లో పాకిస్థాన్ క్రికెట్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన తర్వాత వరుసగా మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది పాకిస్థాన్.


వరుస పరాజయాల తర్వాత, పాకిస్తాన్ జట్టు ప్రపంచ కప్‌లో సెమీస్ కు చేరకుండా స్వదేశానికి పయనమైంది. ఆ జట్టు ప్రదర్శనపై విమర్శలు గుప్పిస్తూ.. అనేక మీమ్‌లు సృష్టించారు. పాక్ జట్టు తమ ఆటగాళ్లపై కొన్ని సంచులు పెట్టుకుని ఉన్న ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. పాక్ జట్టు ఆటగాళ్లకు భారత ప్రభుత్వం 5 కిలోల గోధుమలు, 5 కిలోల బియ్యం అందించిందని అందులో తెలిపారు.

Full View

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ చిత్రం కంప్యూటర్‌ ద్వారా రూపొందించిన చిత్రం. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మీమ్‌గా ప్రచారం చేశారు.
మేము చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించినప్పుడు, చిత్రంలో ఉన్న వ్యక్తుల ముఖాలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయని మేము గమనించాము. ఆటగాళ్ల జెర్సీలపై ఉన్న అక్షరాలు, వారు మోసుకెళ్తున్న బ్యాగులపై ఉన్న అక్షరాలు కూడా అస్పష్టంగానే ఉన్నాయి.

పాకిస్తాన్ జట్టు తిరిగి పాకిస్తాన్‌కు తిరిగి వచ్చినట్లు రిపోర్ట్‌ల కోసం సెర్చ్ చేయగా.. మేము కొన్ని వీడియోలను గమనించాము. ముఫద్దల్ వోహ్రా అనే వినియోగదారుడు పాకిస్తాన్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం, ఇతరులు పాకిస్తాన్‌కు చేరుకున్న వీడియోను పోస్ట్ చేసారు. “పాకిస్తాన్ క్రికెట్ జట్టు ప్రపంచకప్‌ను ముగించిన తర్వాత పాకిస్తాన్‌కు చేరుకుంది.” అని అందులో పేర్కొన్నారు.


ప్రపంచకప్‌లో పాక్ జట్టు ఓటమి పాలయ్యాక ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజం లాహోర్‌కు చేరుకున్న వార్తను కూడా దున్యా న్యూస్ యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేశారు. ‘ప్రపంచ కప్‌లో ఘోర ప్రదర్శన తర్వాత బాబర్ ఆజం లాహోర్ చేరుకున్నాడు | దున్యా న్యూస్’ అంటూ వీడియోను పోస్టు చేశారు. ప్రపంచ కప్‌లో పాక్ జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకోకపోవడంతో.. సోమవారం తెల్లవారుజామున దుబాయ్ నుండి లాహోర్‌కు చేరుకుంది పాకిస్థాన్ జట్టు.
కెప్టెన్ బాబర్ ఆజంతో పాటు కొంత మంది టీమ్, మేనేజ్‌మెంట్ సభ్యులు ఒక ప్రైవేట్ ఎయిర్‌లైన్ ద్వారా దుబాయ్ నుండి లాహోర్ చేరుకున్నారు. జాతీయ జట్టు కెప్టెన్‌ను కట్టుదిట్టమైన భద్రతతో అతని కారు వద్దకు తీసుకెళ్లారు. విమానాశ్రయంలో గుమిగూడిన అభిమానులు పాకిస్థాన్ జట్టుకు అనుకూలంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ జట్టు సెమీ-ఫైనల్‌కు చేరుకోవడంలో విఫలమైంది. మెగా ఈవెంట్‌లో ఐదో స్థానంలో నిలిచింది. నాలుగు మ్యాచ్‌లు మాత్రమే గెలిచిన పాక్ ఐదు మ్యాచ్ లు ఓడిపోయింది.
Full View

‘Babar Azam receives warm welcome after reaching Pakistan following green shirts fifth place finish in ICC cricket world cup 2023, video goes viral.’ అంటూ వీడియోను latestly.com లో పోస్టు చేశారు. బాబర్ ఆజంకు మంచి స్వాగతం లభించిందంటూ అందులో తెలిపారు.

పాకిస్థాన్‌ క్రికెట్ జట్టు బియ్యం, గోధుమలతో కూడినబస్తాలను మోస్తున్నట్లు చూపుతున్న చిత్రంలో ఎటువంటి నిజం లేదు. ఇది కంప్యూటర్‌లో రూపొందించిన చిత్రం. వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు.
Claim :  Pakistani team reaches Pakistan bearing 5kg wheat and 5kg rice from India given by the Indian government
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News