ఫ్యాక్ట్ చెక్: క్షవరం చేయించుకున్న మోడీ చిత్రం మార్ఫ్ చేసినది

డిసెంబర్ 31, 2022న తన తల్లి మరణించిన తర్వాత, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆమె అంత్యక్రియలను నిర్వహించి, తర్వాత తిరిగి పనిలోకి వచ్చారు. ఇదిలా ఉండగా, అంత్యక్రియలు చేసిన తర్వాత తల నీలాలు ఇచ్చారని అతని ఫోటో వైరల్ అవుతోంది.

Update: 2023-01-06 12:00 GMT

డిసెంబర్ 31, 2022న తన తల్లి మరణించిన తర్వాత, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆమె అంత్యక్రియలను నిర్వహించి, తర్వాత తిరిగి పనిలోకి వచ్చారు. ఇదిలా ఉండగా, అంత్యక్రియలు చేసిన తర్వాత తల నీలాలు ఇచ్చారని అతని ఫోటో వైరల్ అవుతోంది.

హిందీలోని క్లెయిం ఇలాఉంది “”

దీనిని అనువదించినప్పుడు, “గౌరవనీయులైన ప్రధాన మంత్రి మోడీ జీ హిందూ ఆచారాల ప్రకారం, తన తల్లి మరణానంతరం తల నీలాలు అర్పించారు. ఈ కర్మయోగి ధన్యుడు. శ్రీ మాతాజీ హీరా బెహెన్‌కి ఆత్మీయ నివాళి. ఓం శాంతి”
Full View


Full View



ఈ వాదన ఫేస్‌బుక్‌తో పాటు ట్విట్టర్‌లోనూ వైరల్‌గా మారింది.

నిజ నిర్ధారణ:

క్లెయిం అబద్దం. వైరల్ చిత్రం మార్ఫ్ చేసారు.

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి చిత్రాన్ని శోధించినప్పుడు, చిత్రం జనవరి 2021 నుండి ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ చిత్రం షేర్ అయిన కొన్ని లింక్‌లు ఇక్కడ ఉన్నాయి.


Full View


Full View


Full View

2018, 2019 మొదలైన కధనాలలో ప్రచురించిన అలాంటి చిత్రాలను షేర్ చేసిన కొన్ని వార్తా వెబ్‌సైట్ కథనాలు లభించాయి.

https://www.siasat.com/modi-reaches-out-riyadh-1561424/

https://www.zeebiz.com/companies/news-videocon-blames-pm-modi-court-and-brazil-for-579-mn-bad-debt-pile-50748

ఇక్కడ అసలు చిత్రం, వైరల్ చిత్రం పోల్చి చూడొచ్చు.

తన తల్లికి అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం పశ్చిమ బెంగాల్‌లో రైల్వే, మెట్రో ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో మోదీ పాల్గొన్నారు. లాంచ్ సందర్భంగా ఆయన ప్రసంగం చేసారు. అందులో ఆయన జుట్టు సాధారణంగా ఉండడం చూడొచ్చు.
డిసెంబర్ 31, 2022న భారత ప్రధాని పంచుకున్న మరో ట్వీట్‌లో, ఆయన జుట్టు సాధరణంగా ఉండడాన్ని స్పష్టంగా చూడవచ్చు. ట్వీట్ ఇక్కడ ఉంది.
కనుక, తన తల్లికి అంత్యక్రియలు చేసిన తర్వాత మోడీని క్షవరం చేయించుకున్నారనే వాదనతో షేర్ చేసిన చిత్రం అబద్దం. షేర్ చేసిన చిత్రం మార్ఫ్ చేసినది, ఇది సంవత్సరం పైగా ఆన్‌లైన్‌లో ఉంది. క్లెయిం అవాస్తవం.
Claim :  Modi tonsured his head after his mother's death
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News