ఫ్యాక్ట్ చెక్: వైరల్ చిత్రం 2008లో జరిగిన 26/11 ముంబై ఉగ్రవాద సంఘటన తర్వాత తీసింది కాదు

దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన 2025 ఆసియా కప్ లీగ్ మ్యాచ్ సందర్భంగా, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు

Update: 2025-09-20 09:26 GMT

దుబాయ్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన 2025 ఆసియా కప్ లీగ్ మ్యాచ్ సందర్భంగా, సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు టాస్ సమయంలోనూ, మ్యాచ్ ముగిసిన అనంతరం పాకిస్తాన్ ఆటగాళ్లతో ఆచారం ప్రకారం కరచాలనం చేయకపోవడంతో వివాదం తలెత్తింది. పహల్గామ్ దాడి తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ ప్రతీకారం తీర్చుకున్న తర్వాత ఈ మ్యాచ్ భారత- పాకిస్తాన్ జట్ల మధ్య మొదటి మ్యాచ్.

ఈ సంఘటన తర్వాత, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ క్రికెట్ మైదానంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టును పలకరిస్తున్న చిత్రం వైరల్ అవుతూ ఉంది. ఈ చిత్రంలో కాంగ్రెస్ నాయకుడు శరద్ పవార్‌ను కూడా మనం చూడవచ్చు. 26/11 ఉగ్రవాద దాడుల తర్వాత కూడా ఆయా నేతలు పాకిస్తాన్ క్రికెట్ జట్టును స్వాగతించారనే వాదనతో ఈ చిత్రం వైరల్ అవుతూ ఉంది. ఈ చిత్రం "ముంబైలో 26/11 ఉగ్రవాద దాడుల తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారతదేశానికి వచ్చింది. అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ క్రికెట్ జట్టును స్వాగతించడానికి హాజరయ్యారు. శరద్ పవార్ కూడా ఆయనతో కలిసి కనిపించారు. కాంగ్రెస్ పార్టీ మోదీ భక్తులకు దేశభక్తిని నేర్పించకూడదు."



ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. ఈ చిత్రం ముంబైలో 26/11 ఉగ్రవాద దాడుల తర్వాత చోటు చేసుకున్న సంఘటనది కాదు కాదు. 

చిత్రాన్ని శోధించగా, ఆ చిత్రం మార్చి 30, 2011న మొహాలి క్రికెట్ స్టేడియంలో చోటు చేసుకున్న ఘటన. ఆ సమయంలో భారత ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేశారు. ఈ చిత్రంలో సయ్యద్ యూసుఫ్ రజా గిలానీ కూడా కనిపిస్తున్నారు.

ఔట్‌లుక్‌లోని ఒక కథనం ప్రకారం, 2011 ప్రపంచ కప్‌లో భారతదేశం- పాకిస్తాన్ మధ్య జరిగిన సెమీ-ఫైనల్ మ్యాచ్ సందర్భంగా, మన్మోహన్ సింగ్ పాక్ ప్రధాన మంత్రి యూసుఫ్ రజా గిలానీతో కలిసి మొహాలీలో మ్యాచ్ వీక్షించారు. రాజకీయంగా చర్చించాల్సిన అవసరం వచ్చినప్పుడల్లా రెండు దేశాలు క్రికెట్‌ను ఉపయోగించాయి. గిలానీ పర్యటన తర్వాత, పరిస్థితి మెరుగుపడింది. పాకిస్తాన్ 2012 క్రిస్మస్ రోజు నుండి 2013 జనవరి ప్రారంభం వరకు భారతదేశంలో పర్యటించింది. రెండు వన్డే మ్యాచ్‌లు, T-20లు ఆడింది. అదే పాకిస్తాన్ జట్టు భారతదేశానికి చేసిన చివరి ద్వైపాక్షిక పర్యటన.

ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను టైమ్స్ నౌ కూడా షేర్ చేసింది, ఈ వీడియో మార్చి 31, 2011న అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో డాక్టర్ మన్మోహన్ సింగ్, పాకిస్తాన్ ప్రధాన మంత్రి యూసుఫ్ రజా గిలానీ పాకిస్తాన్ క్రికెటర్లను, భారత క్రికెటర్లను పలకరిస్తున్నట్లు చూపిస్తుంది.

Full View

26/11 ఉగ్రవాద దాడి తర్వాత, భారత ప్రభుత్వం పాకిస్తాన్ భారత క్రికెట్ జట్టుకు అనుమతి నిరాకరించడంతో, సిరీస్ భవితవ్యంపై చాలా కాలంగా ఉన్న అనిశ్చితికి ముగింపు పలికింది.

కనుక, భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ క్రికెటర్లను పలకరిస్తున్నట్లు చూపిస్తున్న వైరల్ చిత్రం 2008లో 26/11 ఉగ్రవాద దాడుల తర్వాత వెంటనే చోటు చేసుకున్న సంఘటనది కాదు. 2011లో భారతదేశం-పాకిస్తాన్ మధ్య జరిగిన ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ సమయంలో తీసింది. వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టిస్తోంది.

Claim :  2008లో జరిగిన 26/11 ముంబై ఉగ్రవాద సంఘటన తర్వాత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాకిస్తాన్ క్రికెట్ జట్టును పలకరించారు
Claimed By :  Social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News