ఫ్యాక్ట్ చెక్: ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి కులాలపై వ్యాఖ్యలు చేయలేదు, వీడియో తప్పుదారి పట్టిస్తోంది

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 25, 2025న ఉస్మానియా యూనివర్సిటీ (OU)ని సందర్శించారు. ఇది చారిత్రాత్మక సంఘటన

Update: 2025-08-28 10:06 GMT

Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగస్టు 25, 2025న ఉస్మానియా యూనివర్సిటీ (OU)ని సందర్శించారు. ఇది చారిత్రాత్మక సంఘటన, ఎందుకంటే గత 20 ఏళ్లలో OU క్యాంపస్‌లో అడుగుపెట్టిన తొలి ముఖ్యమంత్రి ఆయనే. అక్కడ ఆయన రూ.80 కోట్ల వ్యయంతో నిర్మించిన రెండు కొత్త హాస్టళ్లను ప్రారంభించారు, ఇవి 1,200 మంది విద్యార్థులకు వసతి కల్పించనున్నాయి. అదనంగా, మరో 300 మంది విద్యార్థులకు సౌకర్యం కల్పించే రెండు హాస్టళ్లకు శంకుస్థాపన చేశారు. మాజీ సీఎం కెసిఆర్ 2017లో OUలో ప్రసంగించడానికి ప్రయత్నించినా, విద్యార్థుల నిరసనల కారణంగా వెనక్కి తగ్గాల్సి వచ్చింది. OU విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర హోదా కోసం జరిగిన ఉద్యమంలో చారిత్రాత్మక పాత్ర పోషించారు. అనేక మంది విద్యార్థులు తమ జీవితం, భవిష్యత్తును త్యాగం చేసి ఆ ఉద్యమానికి బలమయ్యారు.

సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం అనంతరం, ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. ఆయన కులం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఆ వీడియోల షేర్ అవుతోంది. దానిపై క్యాప్షన్ ఇలా ఉంది “నోటి దూల మానవా రేవంత్. రెడ్డి దొరలు పాలన చేయాలా రేవంత్?”
వైరల్ వీడియోలు ఇక్కడ చూడవచ్చు.

Full View


Full View

ఫ్యాక్ట్ చెక్:

ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టిస్తోంది. పూర్తి ప్రసంగాన్ని పరిశీలిస్తే వీడియోను ఎడిట్ చేసి, సందర్భాన్ని వక్రీకరించి చూపించారని తెలుస్తోంది.

ETV భారత్ నివేదిక ప్రకారం, OUలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగం విద్యార్థుల సాధికారత, విశ్వవిద్యాలయం అభివృద్ధి, సామాజిక సమానత్వం వంటి అంశాలపై కేంద్రీకృతమైంది. ఆయన OUను లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ స్థాయికి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. దాని కోసం నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి అవసరమైన నిధులు కేటాయిస్తానని చెప్పారు. అలాగే, సమాజంలో పెరుగుతున్న మత్తు పదార్థాల సమస్యపై విద్యార్థులను హెచ్చరించారు. గంజాయి, డ్రగ్స్ పాఠశాలలు, కళాశాలలను వేధిస్తున్నాయి. సమాజంలో విస్తరిస్తున్నాయి,” అని ఆయన హెచ్చరిక జారీ చేశారు.

వైరల్ వీడియో వాస్తవానికి ఆయన చేసిన రాజకీయ విమర్శలో భాగం. పూర్తి వీడియోల్లో ఇది స్పష్టంగా చూడొచ్చు. జీ తెలుగు న్యూస్ లైవ్‌స్ట్రీమ్ చేసిన పూర్తి వీడియోను మనం చూడొచ్చు, అందులో వైరల్ భాగం 1 గంట, 21 నిమిషాల వద్ద మనం చూడొచ్చు. దాని తరువాత ఆయన ఇదీ దొరల విధానం, నేను దీనికి పూర్తి విరుద్దం అని చెప్పడం మనం వినొచ్చు.

Full View

తెలుగు న్యూస్ చానల్, V6 న్యూస్ ప్రచురించిన వీడియో కూడా మాకు లభించింది.అందులో, 40:10 నిమిషాల వద్ద వైరల్ భాగాన్ని చూడొచ్చు.

Full View

రెండు వీడియోల్లో ఆయన మాటలు స్పష్టంగా వినవచ్చు. ఆయన కాంగ్రెసు ప్రభుత్వం OUలో దళిత వైస్‌చాన్సలర్‌ను నియమించిందని, కానీ గత ప్రభుత్వాలు అలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రస్తావించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగ వీడియో తప్పుదారి పట్టిస్తోంది. పూర్తి వీడియోలో ఆయన కులంపై వ్యాఖ్యలు చేయలేదు. వాస్తవానికి ఆయన గత ప్రభుత్వాల వైఫల్యాలను ప్రస్తావిస్తూ, సమానత్వం మరియు అభివృద్ధి అవసరాన్ని గుర్తు చేశారు.

Claim :  వైరల్ వీడియో తెలంగాణ ముఖ్యమంత్రి కులానికనుగుణంగా వృత్తులు చేపట్టాలంటూ వ్యాఖ్య చేసినట్లు చూపిస్తోంది
Claimed By :  Social Media Users
Fact Check :  Unknown
Tags:    

Similar News