ఫ్యాక్ట్ చెక్: వైరల్ వీడియోలో పవన్ కళ్యాణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై విరుచుకు పడ్డారు, డీఎంకే ఎమ్మెల్యేలపై కాదు
The actor-politician’s warning was directed at YSRCP leaders, not DMK MLAs, clarifies fact-check
pawan kalyan
ఆంధ్ర ప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు. ఆయన ఉద్వేగభరితమైన ప్రసంగాలు, బలమైన రాజకీయ అభిప్రాయాలతో ప్రసిద్ధి చెందారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.
అయితే, పవన్ కళ్యాణ్ ఒక సభ లో మాట్లాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆయన “డీఎంకే ఎమ్మెల్యేలను చర్మం తీసేస్తా” అని హెచ్చరించాడని పోస్టులు షేర్ అవుతోంది. వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేస్తూ, పవన్ కళ్యాణ్ డీఎంకే ఎమ్మెల్యేలకు ఈ హెచ్చరిక జారీ చేశారని పేర్కొన్నారు. వైరల్ క్లిప్‌లో పవన్ కళ్యాణ్ కోపంగా చెప్పును పట్టుకుని, రాజకీయ ప్రత్యర్థులను హెచ్చరిస్తున్నట్లు కనిపిస్తుండటంతో, చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు దీన్ని డీఎంకే నాయకులపై ఇచ్చిన హెచ్చరికగా తప్పుగా అర్థం చేసుకున్నారు.
వినియోగదారులు ఈ వీడియోను తమిళ క్యాప్షన్ ఇలా ఉంది “எத்தனை திமுக எம்எல்ஏ-க்கள் வர்றீங்களோ வாங்க, தோல உரிச்சு தொங்க விட்ருவேன்" - ஆந்திர துணைமுதல்வர் பவன் கல்யாண் அவர்கள். தமிழக பாஜகவிற்கு இவரைப் போன்ற ஒரு ஆள்தான் தேவை! #ఫవంఖల్యన్” దీనిని తెలుగులోకి అనువదిస్తే, “ఎంతమంది డీఎంకే ఎమ్మెల్యేలు వస్తున్నారో రండి, చర్మం తీసి వేలాడదీస్తాను” అని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. తమిళనాడు బీజేపీకి ఇలాంటి వ్యక్తి అవసరం అని పేర్కొన్నారు.”
క్లెయిమ్ లింక్ యొక్క స్క్రీన్‌షాట్.
ఫ్యాక్ట్ చెక్ :
వైరల్ క్లెయిమ్ తప్పుదారి పట్టిస్తోంది. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వీడియోలో పవన్ కళ్యాణ్ డీఎంకే లీడర్లని తిట్టలేదు.
వైరల్ వీడియోలోని కీలక ఫ్రేమ్‌లను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ మరియు వీడియోలోని కీవర్డ్స్ తో వెతికినప్పుడు, జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానెల్లో 2022 అక్టోబర్ 18న ప్రచురించిన పూర్తి వీడియో లభించింది. వైరల్ భాగం 14.46 నిమిషాల వద్ద చూడొచ్చు.
అసలు ఘటన 2022 అక్టోబర్‌లో ఆంధ్రప్రదేశ్ గుంటూరులో జనసేన పార్టీ కార్యకర్తలతో జరిగిన సభలో చోటు చేసుకుంది. ఆ సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనను “ప్యాకేజ్ స్టార్” అని ఎగతాళి చేయడంపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఆయన కోపంతో చెప్పును చూపుతూ, వైఎస్సార్సీపీ నాయకులు ఇకపై తనను అవమానిస్తే సహించనని హెచ్చరించారు. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా వైఎస్సార్సీపీ నాయకులను ఉద్దేశించి చేసినవే, డీఎంకే ఎమ్మెల్యేలను గురించి ఎక్కడా ప్రస్తావించలేదు.
The News Minute ప్రచురించిన కధనం ప్రకారం, ఆయన వైఎస్సార్సీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేసి, ఎవరైనా తనను ‘ప్యాకేజ్ స్టార్’ అని పిలిస్తే చెప్పుతో కొడతానని హెచ్చరించినట్లు పేర్కొంది. తనని ప్యాకేజ్ స్టార్ అంటూ అన్నందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పవన్ కళ్యాణ్ మాటల తూటాలు పేల్చారు. అక్టోబర్ 17న మంగళగిరి లో జరిగిన సభలో మాట్లాడుతూ ఆయన ఎవడు తనని 'ప్యాకేజ్ స్టార్' అని పిలిస్తే అతడిని తన చెప్పులతో కొడతానని. స్వయంగా ఆయనపై చేసే వ్యక్తిగత నిందలు, సంపాదన గురించి ప్రశ్నించడంపై ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చెసారు. ప్రసంగం మధ్యలో పవన్ కళ్యాణ్ ఒక చెప్పును చూపిస్తూ 'వైఎస్సార్సీపీ గుంగుల'కు ఘోర హెచ్చరికను ఇచ్చారు. తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడుల కారణంగా ఆ నటుడు తీర్మానంగా కోపం పెట్టుకున్నట్లు, ఆయన తీవ్ర పరిణామాల గురించి వారిని హెచ్చరించారు.
Deccan Herald కధనం ప్రకారం కూడా పవన్ కళ్యాణ్ వైఎస్సార్సీపీ నాయకులను హెచ్చరిస్తూ చెప్పును చూపించిన సంఘటనను నివేదించింది.
Newschecker Tamil ఈ క్లెయిమ్‌ను పరిశీలించి, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియోను తప్పుడూ వాదన తో షేర్ చేస్తున్నారని నిర్ధారించింది.
కనుక, “ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డీఎంకే ఎమ్మెల్యేలను బెదిరించారు” అనే క్లెయిమ్ తప్పుదారి పట్టిస్తోంది. ఆయన ప్రసంగం వైఎస్సార్సీపీ నాయకులను ఉద్దేశించి చేసినదే, డీఎంకేతో ఎటువంటి సంబంధం లేదు.