నిజ నిర్ధారణ: ఇండోనేషియాలో భూకంపం టైమ్-లాప్స్ వీడియో తప్పుదారి పట్టించేదిగా ఉంది.

నవంబర్, 2022లో ఇండోనేషియాలోని పశ్చిమ జావా పట్టణం సియాంజూర్‌లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అధికారుల ప్రకారం, ఈ విపత్తులో అనేక భవనాలు కూలిపోవడంతో 300 మందికి పైగా మరణించారు.

Update: 2022-12-02 08:45 GMT

నవంబర్, 2022లో ఇండోనేషియాలోని పశ్చిమ జావా పట్టణం సియాంజూర్‌లో 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. అధికారుల ప్రకారం, ఈ విపత్తులో అనేక భవనాలు కూలిపోవడంతో 300 మందికి పైగా మరణించారు.

అయితే, ఇండోనేషియాలో సంభవించిన భూకంపానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను చూపుతుందనే వాదనతో టైమ్ లాప్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది.

ఈ వీడియోను ట్విట్టర్‌తో పాటు ఫేస్‌బుక్‌లో షేర్ అవుతోంది.

ఈ వీడియో క్యాప్షన్‌: "ఇండోనేషియాలో భూకంప ఉపగ్రహ చిత్రం. భూకంపం జోన్‌లో చిక్కుకున్న వారికి తప్పించుకోవడం లేదు. భూకంపం వచ్చిన ప్రదేశంలో ప్రతిదీ నాశనం చేయబడింది.



Full View

నిజ నిర్ధారణ:

క్లెయిం తప్పుదారి పట్టించేది. వీడియో 2018 నాటిది, ఇటీవలిది కాదు.

మేము వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను గూగుల్ రివర్స్ ఇమేజ్ శోధనను నిర్వహించినప్పుడు, 2018లో ప్రచురించబడిన అనేక నివేదికలు లభించాయి.

జియోస్పేషియల్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానెల్ అక్టోబర్ 4, 2018న 'ఇండోనేషియా భూకంపం, సునామీ వల్ల భారీ విధ్వంసం చూపుతున్న ఉపగ్రహ చిత్రాలు' అనే పేరుతో ఒక వీడియోను ప్రచురించింది. వీడియో వివరణ ఇలా చెబుతోంది: "సెప్టెంబర్ 28, 2018 న సులవేసి ద్వీపం ఉత్తర తీరంలో సంభవించిన 7.5 తీవ్రతతో సంభవించిన శక్తివంతమైన భూకంపం విపరీతమైన నష్టాన్ని కలిగించింది. ఇండోనేషియాలోని పాలూ అనే ప్రదేశం అంతటా ఇళ్లు ధ్వంసం అయిపోయాయి. వరుస సునామీ అలలు తీరప్రాంతాన్ని నాశనం చేశాయి. బురద, మట్టి 300,000 మంది జనాభా ఉన్న నగరంలో అనేక లోతట్టు ప్రాంతాలను నాశనం చేశాయి.

Full View

అక్టోబర్ 2, 2018న ప్రచురించిన వాషింగ్టన్ పోస్ట్‌లో కథనం కూడా లభించింది. భూకంపం కారణంగా జరిగిన నష్టాన్ని ఈ కథనం చర్చిస్తుంది. ఇది సునామీకి తరువాత ఇండోనేషియా నగరం పులు యొక్క చిత్రాలను కూడా పంచుకుంది.

ఏపివార్తలు అనే వెబ్సైట్ ప్రచురించిన కథనం కూడా లభించింది.

ఇండోనేషియాలోని ప్రైవేట్ న్యూస్ టెలివిజన్ నెట్‌వర్క్ అయిన కొంపస్ టీవీ కూడా ఒక వీడియోను ప్రచురించింది.

Full View

అందువల్ల, వైరల్ వీడియో ఇండోనేషియాలో ఇటీవల సంభవించిన భూకంపానికి సంబంధించిన చిత్రాలను చూపడం లేదు, ఇది ఇటీవలది కాదు, 2018లో తీసిన సాటిలైట్ చితాలు.

Claim :  video shows satellite images of recent earthquake in Indonesia
Claimed By :  Social Media Users
Fact Check :  Misleading
Tags:    

Similar News