ఫ్యాక్ట్ చెక్: భారత్ కు చెందిన మహిళా పైలట్ పాకిస్థాన్ లో పట్టుబడ్డారంటూ జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి నిజం లేదు.

భారత్ కు చెందిన మహిళా ఫైటర్ జెట్ పైలట్ పాకిస్థాన్ లో పట్టుబడ్డారు

Update: 2025-05-10 06:09 GMT

జమ్మూ కశ్మీర్ నుండి గుజరాత్ వరకు 26 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ శుక్రవారం రాత్రి ప్రారంభించిన క్షిపణి, డ్రోన్ దాడులను భారతదేశం సమర్థవంతంగా తిప్పికొట్టింది. విమానాశ్రయాలు, వైమానిక స్థావరాలు సహా కీలకమైన స్థావరాలపై దాడులు చేయడానికి పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలను విజయవంతంగా తిప్పికొట్టామని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీనగర్, పరిసర ప్రాంతాలలో భారత్ పాకిస్తాన్ దళాల మధ్య తీవ్రమైన కాల్పులు జరుగుతున్నాయని వర్గాలు తెలిపాయి.

అమృత్‌సర్‌లో పాకిస్థాన్ డ్రోన్లను భారత ఆర్మీ కూల్చివేసింది. అందుకు సంబంధించిన వీడియోను భారత ఆర్మీ షేర్ చేసింది. శనివారం తెల్లవారుజామున అమృత్‌సర్‌లోని ఖాసా కంటోన్మెంట్‌ గగనతలంలో పాకిస్థాన్ డ్రోన్‌ను గుర్తించిన భద్రతా బలగాలు

వెంటనే దాన్ని కూల్చివేసినట్లు ఆర్మీ తెలిపింది. జమ్ము, సాంబా, పఠాన్‌కోట్‌‍లపై పాకిస్థాన్ మరోసారి డ్రోన్ దాడులకు పాల్పడింది. పాకిస్థాన్ డ్రోన్ దాడిని భారత బలగాలు సమర్థంగా తిప్పికొట్టాయి.

ఇంతలో భారత్ కు చెందిన ఎయిర్ ఫోర్స్ మహిళా పైలట్ ను పాకిస్థాన్ భూభాగం లో పట్టుకున్నారంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతూ ఉన్నాయి.

కొందరు వ్యక్తులు ఓ చోటుకు పరిగెత్తుతూ వెళుతున్న వీడియో ను షేర్ చేస్తున్నారు.








ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన లో ఎలాంటి నిజం లేదు.

మేము సంబంధిత కీవర్డ్స్ తో గూగుల్ సెర్చ్ చేయగా మాకు ఎలాంటి నివేదికలు కనిపించలేదు.

పలు భారత్ కు చెందిన మీడియా సంస్థలు వైరల్ పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని ధ్రువీకరించాయి.

పాకిస్తాన్ అనుకూల సోషల్ మీడియా ఖాతాలు స్క్వాడ్రన్ లీడర్ శివానీ సింగ్ పాకిస్తాన్ కస్టడీలో ఉందని తప్పుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ వాదన పూర్తిగా నకిలీదని, తప్పుడు సమాచార ప్రచారంలో భాగమని అధికారులు, పలు భారత అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ నిర్ధారించాయి.





ఇదే విషయాన్ని పలు మీడియా సంస్థలు కూడా నివేదించాయి.





వైరల్ అవుతున్న వీడియోలో ఎలాంటి నిజం లేదని PIBFactCheck కూడా నివేదించింది.



వైరల్ అవుతున్న వీడియో ని తెలుగు పోస్ట్ స్వతంత్రం గా ధ్రువీకరించనప్పటికీ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని ధృవీకరిస్తున్నాము. 

Claim :  భారత్ కు చెందిన మహిళా ఫైటర్ జెట్ పైలట్ పాకిస్థాన్ లో పట్టుబడ్డారు
Claimed By :  Social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News