అంబేద్కర్ చిత్రం ఉన్నట్టుగా కనపడుతున్న బస్సు చిత్రం మార్ఫ్ చేయబడింది

విదేశాలలో తిరిగే ఒక వాల్వో బస్సు పైన బిఆర్ అంబేద్కర్, ఆయన భార్య సవితా అంబేద్కర్ చిత్రాలున్నట్టుగా ఒక చిత్రం వైరల్ అవుతోంది.

Update: 2022-07-15 04:42 GMT

విదేశాలలో తిరిగే ఒక వాల్వో బస్సు పైన బిఆర్ అంబేద్కర్, ఆయన భార్య సవితా అంబేద్కర్ చిత్రాలున్నట్టుగా ఒక చిత్రం వైరల్ అవుతోంది. "कोलंबिया (अमेरिका) की सड़कों पर दौड़ती सिटी बस पर बाबासाहब का चित्र. यह असली सम्मान है, अमेरिका आज भी बाबा साहब को अपना आदर्श मानता है क्योंकि अमेरिका की अर्थव्यवस्था उसी पुस्तक पर आधारित है जिसे बाबा साहब ने ब्रिटिश काल में अपनी डाक्टर की डिग्री के लिए थिसिस के रूप में लिखा था।"

అనువదించబడినప్పుడు "కొలంబియా (అమెరికా) వీధుల్లో నడుస్తున్న సిటీ బస్సుపై బాబాసాహెబ్ చిత్రపటం..ఇది నిజమైన గౌరవం, అమెరికా ఇప్పటికీ బాబా సాహెబ్‌ను ఆదర్శంగా భావిస్తోంది ఎందుకంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ బాబా సాహెబ్ వ్రాసిన పుస్తకంపై ఆధారపడి ఉంది. బ్రిటిష్ కాలంలో అతని డాక్టర్ డిగ్రీ కోసం థీసిస్."

ఈ చిత్రం 2020లో వైరల్‌గా మారింది, ఇప్పుడు మళ్లీ ఫేస్‌బుక్‌లో ప్రత్యక్షమైంది.

Full View


Full View


నిజ నిర్ధారణ:

అమెరికాలోని కొలంబియాలో ఉన్న బస్సులో అంబేద్కర్, ఆయన భార్య సవితా అంబేద్కర్ చిత్రాలు ఉన్నాయన్న క్లెయిం అవాస్తవం. చిత్రం మార్ఫ్ చేయబడింది.

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ ఫలితాలలో వికీపీడియా కామన్స్ వెబ్‌సైట్‌లో ఉన్న బస్సు చిత్రాన్ని చూడవచ్చు, వివరణలో " సిటీ సైట్‌ సీయింగ్స్ 273 (EU05 VBJ), వోల్వో B7L/Ayats బ్రావో సిటీ, బాత్, సోమర్‌సెట్, ఇంగ్లాండ్‌. ఇతర ఆపరేటర్లకు ఫ్రంచైస్ కింద నిర్వహించబడే అనేక సిటీ సిగ్త్‌సీయింగ్ టూర్‌ల వలె కాకుండా, ఇది నేరుగా కంపెనీ వారిచే నిర్వహించబడుతుంది."

https://commons.wikimedia.org/wiki/File:Tour_bus_in_bath_england_arp.jpg

ఈ బస్సు నగర సందర్శన కార్యక్రమం లో భాగం, ఇది ప్రపంచవ్యాప్తంగా 130 కంటే ఎక్కువ నగరాల్లో టూర్ బస్సు సేవలను అందిస్తుంది. సందర్శనం కోసం బస్సులు ఓపెన్ టాప్ కలిగి ఉంటాయి.

వైరల్ ఇమేజ్‌ని పోలి ఉండే సైట్ సీయింగ్ బస్సు చిత్రాలను మనం చూడవచ్చు.

https://en.wikipedia.org/wiki/City_Sightseeing

'హాప్ ఆన్ హాప్ ఆఫ్ సిటీ టూరిస్ట్ బస్, బాత్, ఇంగ్లాండ్, యూకే.' శీర్షికతో మరొక చిత్రం కూడా జూలై 2010లో అలామీ.కాం లో కనబడింది. ఈ బస్సుల పైన అంబేద్కర్, ఆయన భార్య చిత్రాలు లేవు.

https://www.alamy.com/stock-photo-hop-on-hop-off-city-tourist-bus-bath-england-uk-32065499.html

కొలంబియాలో అంబేద్కర్, ఆయన భార్య ఉన్న బస్సుల కోసం వెతికినప్పుడు అలాంటి బస్సులేవీ దొరకలేదు.

అంబేద్కర్, అతని భార్య చిత్రాల కోసం శోధించినప్పుడు, నగర సందర్శనా బస్సులో మార్ఫింగ్ చేయబడిన అసలు చిత్రాన్ని పంచుకునే కథనాన్ని కనుగొన్నాం.

https://www.forwardpress.in/2017/06/ambedkar-and-periyars-intellectual-comradeship/

అందుకే, అమెరికాలోని కొలంబియాలో ఉన్న బస్సులో అంబేద్కర్, ఆయన భార్య సవితా అంబేద్కర్ చిత్రాలు ఉన్నాయని చేసిన క్లెయిం అబద్దం. చిత్రం మార్ఫ్ చేయబడింది.

Claim :  The image of the bus with Ambedkar’s picture
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News