ఫ్యాక్ట్ చెక్: హనుమంతుని చిత్రంతో ఉన్న కాషాయ జెండాను నీటి అడుగునకు తీసుకుని వెళ్ళింది ఒక స్కూబా డైవర్.. భారత నావికాదళ సభ్యులు కాదు

అయోధ్యలో శ్రీరాముని దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఒక కోతి గర్భగుడిలోకి ప్రవేశించి, విగ్రహం దగ్గరకు వెళ్ళింది. కానీ ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా వెళ్లిపోయింది. అయోధ్య రామమందిరం గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

Update: 2024-01-31 06:32 GMT

Scuba diver

అయోధ్యలో శ్రీరాముని దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఒక కోతి గర్భగుడిలోకి ప్రవేశించి, విగ్రహం దగ్గరకు వెళ్ళింది. కానీ ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా వెళ్లిపోయింది. అయోధ్య రామమందిరం గురించి అనేక వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి నీటి అడుగున ఈత కొడుతూ, హనుమంతుడి చిత్రంతో కూడిన జెండాను పట్టుకున్న వీడియో కూడా వివారాలు అవుతూ ఉంది. భారత నావికాదళ సభ్యులు ఇలా చేశారనే వాదనతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


‘By Indian Navy.... Underwater..Jay Shree Ram..’ అనే క్యాప్షన్ తో వీడియోను పోస్టు చేశారు.


వైరల్ ఫేస్ బుక్ లింకులు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

భారత నౌకాదళ సిబ్బంది నీటి అడుగునకు కాషాయ జెండాను తీసుకుని వెళ్లినట్లు జరుగుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. గుజరాత్‌కు చెందిన స్కూబా డైవర్ ఈ పని చేశారు.
మేము వీడియో నుండి తీసుకున్న కీఫ్రేమ్‌లను గూగుల్ లో సెర్చ్ చేశాం. ఆ సమయంలో 'ఒక స్కూబా డ్రైవర్ కాషాయ జెండాను నీటిలోకి తీసుకుని వెళ్ళాడు' అని పేర్కొంటూ అనేక సోషల్ మీడియా హ్యాండిల్స్ వీడియోను పంచుకోవడం మాకు కనిపించింది.

Full View

పిటిఐ న్యూస్ యూట్యూబ్ ఛానెల్ ఈ వీడియోను కూడా షేర్ చేసింది: ‘రామ్ మందిర్ స్పెషల్: ప్రాణ్ ప్రతిష్ఠ వేడుకకు ముందు సముద్రపు నీటిలో కాషాయ జెండాను ఊపుతున్న స్కూబా డైవర్’ అనే టైటిల్ తో వీడియోను షేర్ చేశారు. లొకేషన్‌ను గుజరాత్‌లోని ద్వారక అని కూడా తెలిపారు.

Full View
అదే వీడియో వారి X (ట్విట్టర్) హ్యాండిల్‌లో కూడా పోస్టు చేశారు. “VIDEO | A scuba diver raises a saffron flag with Lord Hanuman's image under seawater at the Shivarajpur Beach in Gujarat.” అనే శీర్షికతో వీడియోను పోస్టు చేశారు. దీన్ని బట్టి ఆ వ్యక్తి ఒక స్కూబా డైవర్ అని నిర్ధారించాం. గుజరాత్‌లోని శివరాజ్‌పూర్ బీచ్‌లో ఈ పని చేశాడు.
మరిన్ని వివరాలు తెలుసుకోడానికి ప్రయత్నించగా.. గుజరాత్‌లోని ప్రసిద్ధ శివరాజ్‌పూర్ బీచ్‌లో స్కూబా డైవర్‌గా పనిచేస్తున్న కరంభ చమ్డియా సముద్రం లోపల హనుమంతుని చిత్రంతో కూడిన జెండాను ఎగురవేసినట్లు gujaratijagran.com కు
చెందిన ఒక నివేదికను కూడా కనుగొన్నాం.

న్యూస్18 గుజరాతీ కూడా ఆ వ్యక్తి నీటి అడుగున కాషాయ జెండాను తీసుకుని వెళ్లిన వీడియోను షేర్ చేసింది.

Full View

వైరల్ వీడియోలో ఉన్నది భారత నేవీ సిబ్బంది కాదు. గుజరాత్‌లోని ద్వారక బీచ్‌లో స్కూబా డైవర్ జెండాను నీటి లోపలికి తీసుకుని వెళుతున్నట్లు చూపిస్తుంది. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.
Claim :  A saffron flag with an image of Lord Hanuman on it, was hoisted underwater by the Indian Navy officials
Claimed By :  Social media users
Fact Check :  Misleading
Tags:    

Similar News