ఫ్యాక్ట్ చెక్: స్విట్జర్లాండ్ నుంచి నడుచుకుంటూ వచ్చిన వ్యక్తి వీడియో ఇటీవలది కాదు, 2021 సంవత్సరానికి చెందినది

మహా కుంభమేళా భారతీయులను, విదేశీయులను కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది. అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం, ఉత్సాహభరితమైన ఊరేగింపులు

Update: 2025-01-24 11:28 GMT

Ben Viatee

మహా కుంభమేళా భారతీయులను, విదేశీయులను కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది. అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం, ఉత్సాహభరితమైన ఊరేగింపులు, భక్తితో నిండిన ఈ కార్యక్రమాన్ని చూడటానికి అందరూ ఆసక్తిగా వస్తున్నారు. పవిత్ర జలాల్లో స్నానం చేయడం, ఆధ్యాత్మిక నాయకులు, రాజకీయ నాయకులు మొదలైన ప్రతి ఒక్కరికీ మరపురాని అనుభవం. ఇప్పటివరకు 10 కోట్లకు పైగా యాత్రికులు మహా కుంభమేళాలో పాల్గొని రికార్డులు సఋష్టించారు. విదేశాల నుండి వేలాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహా కుంభమేళా 2025కి హాజరవుతున్నారు. ఐఐటీ బాబా, కాంటేవాలా బాబా, రుద్రాక్ష్ బాబా, ఇలా ఎందరో బాబాలను చూసి భక్తులు మురిసిపోతున్నారు.

ఈ హైప్‌లో భాగం కావడానికి, అనేక మంది సోషల్ మీడియా వినియోగదారులు ఇంటర్నెట్‌లో ముఖ్యంగా సోషల్ మీడియాలో అనేక పాత, తప్పుదారి పట్టించే వీడియోలు,చిత్రాలను షేర్ చేస్తున్నారు. మహా కుంభమేళాకు సంబంధించిన తప్పుదారి పట్టించే వాదనలతో ఎన్నో ఆఈతో రూపొందించిన విజువల్స్ కూడా చెలామణిలో ఉన్నాయి.

ప్రస్తుతం, స్విట్జర్లాండ్ నుండి భారతదేశానికి 5 సంవత్సరాల పాటు కాలిబాటన నడిచి వచ్చి కుంభమేళాకు హాజరైన ఒక విదేశీయుడి గురించిన ఒక వీడియో సోషల్ మీడియా లో షేర్ అవుతోంది. ఈ వీడియోలో ఒక భారతీయ వ్యక్తి, ఈ విదేశీయుడితో చేసిన ఇంటర్వ్యూను చూపిస్తుంది. ఆ విదేశీయుడు స్విట్జర్లాండ్ నుండి భారతదేశానికి చేరుకోవడానికి 5 సంవత్సరాలు నడిచానని, వివిధ దేశాల గుండా ప్రయాణించి, ఈ దేశాలకు వేర్వేరు వీసాలు తీసుకుంటూ వచ్చానని చెప్పడం మనం చూడొచ్చు.

ఈ వీడియో ముఖ్యంగా ఫేస్ బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో తెలుగులో “విదేశీ భక్తుడు సనాతన ధర్మం గొప్ప తనం తెలుసుకొని స్వీజర్ లాండ్ నుండి పుణ్య భూమి అయిన మన భారత దేశం కీ కుంభమేళాకి శివుడి కోసం కాలి నడకన” అనే శీర్షికలతో ప్రచారంలో ఉంది. వచ్చాడు భక్తుడు 🙏 ఇకడ ఉన మన లౌకిక వేదాలకు ఎపుడు అర్దం అవతుందో” అనే క్యాప్షన్ తో వైరల్ అవుతోంది

Full View

మరి కొంత మంది వినియోగదారులు వీడియోను "స్వీజర్ లాండ్ నుండి" అనే శీర్షికతో పంచుకున్నారు కుంభమేళాకి శివుడి కోసం కాలి నడకన వచ్చాడు భక్తుడు” అంటూ షేర్ చేస్తునారు.

Full View


క్లెయిం ఆర్కైవ్లింక్ ను ఇక్కడ ఉంది.

ఫ్యాక్ట్ చెక్:

వాదన తప్పుదారి పట్టిస్తోంది. ఈ వీడియో హరిద్వార్‌లో జరిగిన 2021 కుంభమేళాలో చిత్రీకరించినది, ఇటీవలది కాదు.

గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను శోధించగా, జూన్ 22, 2021న సంజయ్ ధుంధ్వాల్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో “Switzerland se pahunche Bharat mein nagrik” అనే టైటిల్ తో ప్రచురించిన వీడియోను మాకు లభించింది.

Full View

మరింత శోధించగా, గౌతమ్ ఖట్టర్ అనే యూట్యూబ్ ఛానెల్ మార్చి 22, 2021న “Haridwar Kumbh 2021॥ Switzerland से लगातार 4 साल पैदल चलकर महाकुम्भ मेले में पहुंचे BEN BABA" అనే టైటిల్ తో ప్రచురించిన మరో వీడియోను కూడా లభించింది.

Full View

వీడియో వివరణలో ‘ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవం అయిన కుంభ్ హరిద్వార్‌లో నిర్వహిస్తున్నారని మీ అందరికీ తెలుసు, దీనిలో మేము సాధువులను మీకు పరిచయం చేస్తున్నాము. ఈ సిరీస్‌లో, 18 దేశాలను దాటిన తర్వాత 4 సంవత్సరాలలో భారతదేశానికి చేరుకున్న స్విట్జర్లాండ్‌కు చెందిన బెన్ బాబాను మీకు పరిచయం చేస్తున్నాము.’ అని ఉంది. వివరణలో అదే ఛానెల్ ప్రచురించిన మరొక వీడియో లింక్‌ను కూడా మనం చూడొచ్చు, అది "Ben Baba Part -2 - Switzerland के Ben viatee कैसे बने संत बैन गिरी॥ Christian से Hindu का सफर ॥ Haridwar Kumbh 2021॥". ఈ వీడియో ద్వారా ఆ వ్యక్తి పేరు బెన్ వియాటీ అని తెలిసింది.

Full View

దీనిని క్యూ గా తీసుకొని, బెన్ వియాటీ కోసం శోధించగా, ఆయన కి చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్, స్విట్జర్లాండ్ నుండి భారతదేశానికి ఆయన ప్రయాణాన్ని చూపించే ‘ది హెర్మిట్ క్రాబ్’ అనే వెబ్సైట్ కూడా లభించాయి. బెన్ వియాట్టే సోషల్ మీడియా హ్యాండిల్స్ ఇక్కడ చూడొచ్చు.

బెన్ వియాట్టే తన కొత్త పుస్తకం ‘టూ లిటిల్ వాండరింగ్ మాంక్స్’ గురించి తన యూట్యూబ్ ఛానెల్‌లో ప్రచురించిన మరొక వీడియో కూడా మాకు లభించింది. వివరణలో ‘బెన్ కొత్త పుస్తకం “టూ లిటిల్ వాండరింగ్ మాంక్స్” పై గౌతమ్ ఖట్టర్ ఇంటర్వ్యూ’ అని ఉంది.

Full View

కాబట్టి, వైరల్ వీడియో 2021 నాటిది, ఇటీవలిది కాదు. ఈ వీడియో 2021లో హరిద్వార్‌లో జరిగిన కుంభమేళాను సందర్శించేందుకు స్విట్జర్లాండ్ నుండి భారతదేశానికి నడిచి వచ్చిన ఒక సాధువు, బెన్ వియెట్టి ఇంటర్వ్యూను చూపిస్తుంది. అది 2025లో జరుగుతున్న మహా కుంభ మేళా లో తీసినది అనే వాదన తప్పుదారి పట్టిస్తోంది.

Claim :  మహా కుంభమేళాలో పాల్గొనడానికి స్విట్జర్లాండ్ నుండి భారతదేశానికి నడిచి వచ్చిన వ్యక్తి ని వీడియో చూపిస్తోంది
Claimed By :  Social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News