ఫ్యాక్ట్ చెక్: థాయిలాండ్ లో జగడం చేసిన టూరిస్ట్ భారతీయుడు కాదు, శ్రీ లంక కు చెందిన వ్యక్తి
అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడుల్లో ఒకటి జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో చోటు చేసుకుంది. అక్కడి ప్రకృతిని ఆస్వాదించాలని అను
Sri lankan Tourist
అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడుల్లో ఒకటి జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో చోటు చేసుకుంది. అక్కడి ప్రకృతిని ఆస్వాదించాలని అనుకున్న 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. దాడి చేసిన వారు బాధితులను కాల్చి చంపే ముందు వారి మతాన్ని అడిగారని, పురుషులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కశ్మీర్‌లో జరిగిన ఈ అనాగరిక హత్యలు ఎంతో మందిపై తీవ్ర ప్రభావం చూపించాయి. పర్యాటకులతో సహా స్థానికేతరుల రాక పెరుగుతుండటం జనాభా మీద, సాంస్కృతిక దాడి అని జమ్మూ కశ్మీర్ నాయకులు చేసిన ప్రకటనల తర్వాత ఈ దారుణం జరిగింది.
ఇతర దేశాలలో తిరిగేటప్పుడు, భారతీయ ప్రయాణికుల ప్రవర్తన ను విమర్శిస్తూ పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విదేశాలలోనూ, స్వదేశంలోనూ పర్యాటకులు చేసే పనులు దేశ ప్రతిష్టను దిగజార్చుతున్నాయని ప్రస్తావించే పోస్టులు, కథనాలు ఎన్నో సోషల్ మీడియాలో ఉన్నాయి. అయితే హోటల్ సిబ్బందిపై ఒక వ్యక్తి గట్టిగా అరుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది, ఆ టూరిస్ట్ భారతీయుడని, అతను బ్యాంకాక్ హోటల్‌లో గట్టిగా అరుస్తూ ఇబ్బందులు సృష్టించాడనే వాదనలు ఉన్నాయి.
చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను “Indian invader has an insane freakout after being charged twice at a hotel" అనే క్యాప్షన్‌తో షేర్ చేయగా, కొందరు ఈ వీడియోను "బ్యాంకాక్ హోటల్‌లో అతడి కార్డ్ నుండి హోటల్ సిబ్బంది రెండు సార్లు డబ్బులు లాగేశారు" అనే టెక్స్ట్‌తో షేర్ చేస్తున్నారు.
వీడియో క్యాప్షన్ లో "ఏప్రిల్ 17న హోటల్ సిబ్బంది చెక్-ఇన్ సమయంలో ప్రామాణిక క్రెడిట్ కార్డ్‌ను హోల్డ్ చేయడంతో ఇదంతా జరిగింది. ఆ వ్యక్తి గదికి ఇప్పటికే బంధువు డబ్బు చెల్లించాడని నమ్మాడు. అతను గట్టిగా అరిచాడు, కౌంటర్‌ను కొట్టాడు. పోలీసులు జోక్యం చేసుకోవలసి వచ్చేంత సీన్ ను సృష్టించాడు." అని ఉంది. సిబ్బంది అంత ఒత్తిడిలోనూ ప్రశాంతంగా వ్యవహరించారని పోస్టులు పెట్టారు. #HotelMeltdown #BangkokViral #TravelTantrum #CaughtOnCamera #CreditCardChaos #TouristFails #HolidayInnDrama #ViralRage” అనే హ్యాష్ ట్యాగ్స్ తో వీడియోను షేర్ చేస్తున్నారు.
క్లెయిం ఆర్కైవ్ లింక్ ఇక్కడ చూడొచ్చు.
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి భారతీయుడు కాదు. అతను శ్రీలంకకు చెందినవాడు. మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను సంగ్రహించి, రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి శోధించినప్పుడు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా కొన్ని పోస్ట్‌లు కనిపించాయి.
కొంతమంది వినియోగదారులు వైరల్ వీడియోను "అతను శ్రీలంక టూరిస్ట్. దయచేసి ప్రతిచోటా భారతదేశాన్ని కించపరచడం ఆపండి" అనే శీర్షికతో షేర్ చేశారు. “He is a SRI LANKAN TOURIST. Please STOP DEFAMING INDIA everywhere.” అంటూ పోస్టు పెట్టారు.
ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది, అందులో ఒక వ్యక్తి తన గట్టిగా అరుస్తున్నట్లు కనిపించింది. బ్యాంకాక్‌లోని హాలిడే ఇన్ హోటల్‌లో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి ఒక పర్యాటకుడు. క్లిప్‌లో విన్న వాయిస్ ప్రకారం, కొంత 'గందరగోళం' కారణంగా ఈ సమస్య తలెత్తింది, ఆ వ్యక్తి నుండి రెండుసార్లు డబ్బులు వసూలు చేశారనే కారణంతో కోపం వ్యక్తం చేశాడు. చెక్-ఇన్ సమయంలో అతను, అతని కుటుంబం బస చేసిన గదుల కోసం హోటల్ అతని కార్డును వాడింది. అయితే, మరొక బంధువు ఇప్పటికే గదులకు డబ్బు చెల్లించాడని తరువాత తేలింది. హోటల్ ఇప్పటికీ తన కార్డును ఉంచుకోవడంపై సహనం కోల్పోయి, ఆ వ్యక్తి సిబ్బందిపై విరుచుకుపడ్డాడు. ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నాడు. వారు కూడా అతన్ని శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా మంది ఆ వ్యక్తి మూలాలను భారతదేశంతో ముడిపెట్టగా, మరికొందరు అతను శ్రీలంక నుండి వచ్చాడని పేర్కొన్నారని మీడియా కథనాలను చూశాం.
"ఒక శ్రీలంక పర్యాటకుడు థాయిలాండ్‌లో ఒక హోటల్ ఫ్రంట్ డెస్క్ వద్ద కోపంగా ప్రవర్తించాడు" అంటూ లోకల్ టక్ అనే యూజర్ షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను మేము కనుగొన్నాము. ఆ వ్యక్తి మాటలలో ఆవేశం కనిపించిందని, రిసెప్షన్ ప్రాంతంలో కోపంగా ప్రవర్తించడం చూపరులను, సిబ్బందిని దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆ పోస్టులో తెలిపారు. పర్యాటక రంగంలో ఎన్నో సవాళ్లు ఉంటాయని ఆ పోస్టు ద్వారా తెలిపారు.
డైలీ మిర్రర్ శ్రీలంక వంటి వార్తా వెబ్‌సైట్‌ల పోస్ట్‌లను కూడా మేము కనుగొన్నాము. X పోస్ట్ లో "థాయిలాండ్‌లోని ఒక హోటల్‌లో ఒక శ్రీలంక పర్యాటకుడు ఫ్రంట్ డెస్క్ వద్ద కోపం వ్యక్తం చేశాడు. ఆ వ్యక్తి దూకుడుగా ప్రవర్తించాడు. ఈ సంఘటన సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించింది" అని తెలిపారు.
వీడియోలో ఆ వ్యక్తులు మాట్లాడే భాషను గమనించినప్పుడు, మధ్యలో మాట్లాడే భాష శ్రీలంకలో మాట్లాడే సింహళీస్ అని నిర్ధారించుకోగలిగాము.
కాబట్టి, వైరల్ వీడియోలో కనిపించే వ్యక్తి భారతీయుడు కాదు, శ్రీలంకకు చెందినవాడు. కొంతమంది ఆ పర్యాటకుడు భారతదేశానికి చెందినవాడని, భారతీయ పర్యాటకుల ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నంలో ఉచిత గదులు పొందడానికి కోపాన్ని ప్రదర్శిస్తున్నారనే వాదనతో షేర్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim : థాయిలాండ్‌లోని ఒక హోటల్ లాబీలో భారతీయ పర్యాటకుడు గొడవ చేసినట్లు వైరల్ వీడియో చూపిస్తుంది.
Claimed By : Social media users
Fact Check : Unknown