నిజ నిర్ధారణ - పెప్సికో 119వ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ బాక్స్‌లను పంపడం లేదు, ఇది ఒక స్కామ్

పెప్సీ ఫ్యాన్స్ పేరుతో ఫేస్ బుక్ పేజీలు పెప్సీ ఈ సంవత్సరం 119వ పుట్టినరోజు జరుపుకుంటున్నందున బహుమతులు ఇస్తోందని పెప్సీ-కోలా బాక్స్‌లను ఉన్న కొన్ని చిత్రాలను షేర్ చేసారు.

Update: 2022-08-18 14:00 GMT

పెప్సీ ఫ్యాన్స్ పేరుతో ఫేస్ బుక్ పేజీలు పెప్సీ ఈ సంవత్సరం 119వ పుట్టినరోజు జరుపుకుంటున్నందున బహుమతులు ఇస్తోందని పెప్సీ-కోలా బాక్స్‌లను ఉన్న కొన్ని చిత్రాలను షేర్ చేసారు.

పోస్ట్ చేస్తున్న క్లెయిమ్ ఇది "@పెప్సీ 119వ జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆగస్ట్ 20లోపు "పూర్తయింది" అంటూ కామెంట్ చేసి షేర్ చేసే ఎవరికైనా పెప్సీ బహుమతి పెట్టె అందుతుంది.

Full View


Full View

నిజ నిర్ధారణ:

ఈ కెల్యిం ఒక స్కామ్. ఈ ఆఫర్ ను షేర్ చేసిన పేజలకు చాలా తక్కువ లైక్‌లు ఉండడం విషేషం. తమ కంటెంట్‌ను షేర్ చేయడానికి, ప్రజలను ఆకర్షించడానికి వాడే సర్వే స్కామ్‌లను వీరు ఉపయోగిస్తున్నారు.

పోస్ట్‌ల వ్యాఖ్యలను గమనించినప్పుడు, వినియోగదారు 'పూర్తయింది' అని వ్యాఖ్యానించినప్పుడు, పేజీ నిర్వాహకుడు పోస్ట్‌ను 8 సమూహాలలో పంచుకోమని ప్రోత్సహించారు. తర్వాత వారు బహుమతిని నిర్ధారించడానికి వ్యక్తిని సంప్రదిస్తామని చెబుతున్నారు. కానీ, తర్వాత ఏం జరిగిందనే దానిపై పబ్లిక్‌ సమాచారం లేదు.

వైరల్ పోస్ట్‌లను పంచుకున్న రెండు పేజీలు కూడా కొన్ని రోజుల క్రితం సృష్టించబడ్డాయి, అది కూడా ఒకే ఒక పోస్ట్‌ను మాత్రమే అవి పంచుకున్నాయి.

సంప్రదింపుల కోసం ఎటువంటి సమాచారం పంచుకోలేదు, అయితే పెప్సికో వారి అసలైన ఫేస్‌బుక్పేజీ లో అటువంటి వైరల్ పోస్ట్‌లు ఏవి కనపడలేదు.

పెప్సికో అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అలాంటి ఆఫర్‌లు ఏవీ కనుబడలేదు. పెప్సికో పంచుకున్న సమాచారం ప్రకారం, 1898లో, చిన్న-పట్టణ ఫార్మసిస్ట్ కాలేబ్ డి. బ్రాడ్‌మ్ తన ఫార్ములాను బాగా వివరించే పేరు కోసం వెతికాడు. అతను "బ్రాడ్స్ డ్రింక్" పేరుతో విక్రయించడం మొదలుపెట్టాడు. అతను స్థానిక పోటీదారు నుండి "పెప్ కోలా" అనే పేరును కొనుగోలు చేసి తన డ్రింక్ కు పెప్సీ-కోలా అని పేరు పెట్టాడు.

పెప్సికి 1898లో ఈ పేరు వచ్చింది, కాబట్టి 2022లో ఇది పెప్సీ 119వ పుట్టినరోజు లేదా వార్షికోత్సవం అవడానికి వీలు లేదు.

https://contact.pepsico.com/pepsi/article/when-was-pepsi-cola-invented-how-did-it-get-its-name

పెప్సీ బ్రాండ్ వెబ్‌సైట్‌లు ఏవీ వైరల్ ఆఫర్ గురించి మాట్లాడవు.

https://www.pepsi.com/

https://www.pepsico.com/who-we-are/about-pepsico

https://www.pepsicobeveragefacts.com/

అందువల్ల, వైరల్ క్లెయిం ప్రజలను స్కామ్ చేసి దాని కంటెంట్‌ను నమ్మించి వారు పంచుకునేలా చేసే ప్రయత్నం. మన పరికరాలను ప్రభావితం చేసి సున్నితమైన డేటా తెలుసుకునే లేదా మాల్వేర్‌ని డౌన్‌లోడ్ చేసే ఉద్దేశ్యంతో ఇటువంటి స్కాం లు జరుగుతాయి. కాబట్టి ఇలాంటి పోస్ట్‌ల గురించి తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలి, వాటిని ఎక్కువ షేర్ చేయకూడడు. క్లెయిం ఒక స్కామ్.

Claim :  Pepsico is sending gift boxes for its 119th birthday through its Facebook pages
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News