ఫ్యాక్ట్ చెక్: భారత దాడుల్లో పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ విమానాశ్రయం ధ్వంసమయ్యింది అంటూ సూడాన్ కి చెందిన వీడియో వైరల్ అవుతోంది

ఆపరేషన్ సిందూర్ తర్వాత, పహల్గామ్ ఉగ్రవాద దాడి, పాకిస్తాన్‌తో జరిగిన ఘర్షణలపై భారతదేశం దృక్పథాన్ని వివరించడానికి రాజకీయ

Update: 2025-05-16 11:35 GMT

Khartoum airport

ఆపరేషన్ సిందూర్ తర్వాత, పహల్గామ్ ఉగ్రవాద దాడి, పాకిస్తాన్‌తో జరిగిన ఘర్షణలపై భారతదేశం దృక్పథాన్ని వివరించడానికి రాజకీయ నాయకులు, దౌత్యవేత్తలు, నిపుణుల బృందాలను ప్రపంచంలోని పలు దేశాలకు పంపాలని భారత ప్రభుత్వం యోచిస్తోంది. యూరప్, ఉత్తర అమెరికా, పశ్చిమ ఆసియా, గ్లోబల్ సౌత్ వంటి ప్రాంతాలను చేరుకోవడానికి ప్రభుత్వం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగమయ్యే పార్లమెంటేరియన్లలో కాంగ్రెస్ నాయకుడు, విదేశీ వ్యవహారాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రస్తుత అధ్యక్షుడు శశి థరూర్, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్, ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఉన్నారు. ఆపరేషన్ సిందూర్ కి సంబంధించి సామాన్య ప్రజలలో భయాందోళనలను వ్యాప్తి చేయడానికి టన్నుల కొద్దీ తప్పుడు కథనాలు కూడా ప్రచారంలో ఉన్నందున, భారత్ తీసుకునే ఇలాంటి చర్యలు చాలా ముఖ్యమైనవి.  ప్రజలకి సరైన సమాచారం అందించాలనే ఉద్దేశ్యం తో, భారతదేశం-పాకిస్తాన్ ఉద్రిక్తతలకు సంబంధించిన అనేక ఫేక్ న్యూస్ ను తెలుగుపోస్ట్ తిప్పికోట్టింది.

అయితే, రన్‌వేపై దెబ్బతిన్న విమానాలను చూపిస్తూ, విమానాశ్రయం మీద వాహనం ముందుకు వెళుతున్న ఒక వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఈ వీడియో భారత సాయుధ దళాల దాడుల వల్ల ధ్వంసమైన పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ విమానాశ్రయాన్ని చూపిస్తుందని ప్రచారం చేస్తున్నారు. “భారత్ కే జవానో నే పాకిస్తాన్ కే నూర్ ఖాన్ విమానాశ్రయం కే నక్షా హి బాదల్ దియా” అనే టెక్స్ట్ వీడియో మీద ఉంది. భారత్ కు చెందిన జవాన్లు నూర్ ఖాన్ విమానాశ్రయం రూపు రేఖలను మార్చేశారని అర్థం వస్తుంది.
Full View
Full View
Full View
వైరల్ పోస్టు ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు .
ఫ్యాక్ట్ చెక్:
వైరల్ అవుతున్న వాదన నిజం కాదు. వైరల్ వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి శోధించినప్పుడు, మార్చి 31, 2025న africanaviators_official అనే పేజీలో అప్లోడ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ను మేము కనుగొన్నాము.
అందులో “సుడాన్‌లోని ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం (KRT/HSSK) దృశ్యాలు ఉన్నాయి. ఇవి మే 2023లో సూడాన్ సైన్యం, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య జరిగిన ఘర్షణల సమయంలో పెద్ద సంఖ్యలో విమానాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. సుడాన్ సైన్యం ఖార్టూమ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. రెండేళ్లుగా అక్కడ కొనసాగుతున్న అంతర్యుద్ధంలో కీలకమైన ఘటన. సుడాన్, చరిత్ర, సంస్కృతి, స్థితిస్థాపకతతో సమృద్ధిగా ఉన్న దేశం, అయితే సూడాన్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ఉంది. అంతర్యుద్ధం ప్రజలకు అపారమైన నష్టాన్ని, మనో వేదనను తెచ్చిపెట్టింది. ప్రతికూల పరిస్థితుల మధ్య వారి ధైర్యం, బలాన్ని విస్మరించడం అసాధ్యం. "ఈ విజయాన్ని మనం ఎంతో విలువైనదిగా భావిస్తూనే, సూడాన్ దుస్థితిపై అవగాహన తీసుకురావడానికి ఈ క్షణాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నాము. ప్రభావిత కుటుంబాలను గుర్తుంచుకుందాం, మానవతా ప్రయత్నాలకు మద్దతు ఇద్దాం. ఈ అందమైన భూమిలో శాంతి నెలకొనాలని ప్రార్థిద్దాం. #DontForgetSudan #Sudan #PortSudan #Sudanese” అంటూ ఆ పోస్టులో వివరించారు.
మరో ఇన్‌స్టాగ్రామ్ యూజర్ కూడా ఈ వీడియోను షేర్ చేశారు. ఇది సూడాన్‌లోని ఖార్టూమ్ విమానాశ్రయాన్ని చూపిస్తుందని తెలిపారు.
ది గార్డియన్‌లో ప్రచురితమైన వీడియో నివేదిక ప్రకారం, మార్చి 2025 చివరిలో సూడాన్ సైన్యం ఖార్టూమ్‌ను పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ నుండి పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకుంది. ఏప్రిల్ 2023 నుండి ఈ పోరాటం జరుగుతూ ఉంది. సూడాన్ రాజధాని అంతటా అనేక కీలక ప్రదేశాలను స్వాధీనం చేసుకున్న తర్వాత, సైన్యం RSFని వెనక్కి తగ్గేలా చేసింది. ఇది దేశ అంతర్యుద్ధంలో కీలకమైన మలుపును సూచిస్తుంది. ఆ దేశ రాజధానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ రెండు సంవత్సరాల పోరాటంతో నాశనమైన నగరాన్ని చూపిస్తుంది, దీని వలన ఖార్టూమ్‌లోని అనేక ముఖ్యమైన ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న విమానాలు, విమానాశ్రయాన్ని కూడా మనం చూడవచ్చు.
పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ డ్రోన్ దాడిని ఉపయోగించి చేసిన నష్టాన్ని సూడాన్ సైన్యం చూపించిన ఇతర నివేదికలు కూడా  మాకు లభించాయి. సైన్యం పోర్ట్ సూడాన్‌లో ఒక వైమానిక స్థావరం, ఒక కార్గో గిడ్డంగి, కొన్ని పౌర సౌకర్యాలను లక్ష్యంగా చేసుకున్నాయి.
Full View
కాబట్టి, వైరల్ వీడియో పాకిస్తాన్‌లోని నూర్ విమానాశ్రయానికి సంబంధించింది కాదు. కానీ మార్చి 2025లో పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ దాడుల కారణంగా సూడాన్‌లోని ఖార్టూమ్ విమానాశ్రయం ధ్వంసమైన విజువల్స్ ఇవి. వైరల్ అవుతున్న వాదన నిజం కాదు.
Claim :  భారత దాడుల కారణంగా పాకిస్తాన్‌లోని నూర్ ఖాన్ విమానాశ్రయం ధ్వంసమవ్వడం వైరల్ వీడియోలో చూడొచ్చు
Claimed By :  Youtube Users
Fact Check :  Unknown
Tags:    

Similar News