ఫ్యాక్ట్ చెక్ : విశాఖపట్నం హెచ్ పి సి ఎల్ లో అగ్నిప్రమాదం అంటూ వైరల్ అయిన వీడియో పాతది

వైరల్ అవుతున్న వీడియో, విశాఖపట్నం హెచ్ పి సి ఎల్ లో 2021లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబందించినది.

Update: 2025-11-04 05:57 GMT

విశాఖపట్నం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఒక ముఖ్య నగరం. ఈ నగరాన్ని వాడుక భాష లో వైజాగ్ అని కూడా పిలుస్తుంటారు. ఇక్కడ, ఇండస్ట్రియల్ ప్లాంట్, స్టీల్ ప్లాంట్, పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కి సంబందించిన కర్మాగారాలు అనేకంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో, ఇక్కడ అగ్ని ప్రమాదాలు తరుచుగా సంభవిస్తూ ఉంటాయని, మనకు వార్తా కథనాలు ద్వారా అర్థమవుతుంది.

ఇటీవల 2025 లో, సెప్టెంబర్ నెలలో భారత్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్ లో, మే నెలలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో కూడా అగ్ని ప్రమాదాలు జరిగాయి అని తెలుస్తోంది. ఈ సందర్భంగా మరొక అగ్ని ప్రమాదం జరిగింది అంటూ, సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో వైరల్ అవుతుంది. 

ఆ వీడియోలో ఒక కొండ పైన మంటలు చెలరేగడం చూడవచ్చు, ఇందులో కొండ కింద, కొంత మేరకు ఒక నగరం కూడా కనిపిస్తుంది. ఈ వీడియోను షేర్ చేసి ఇది విశాఖపట్నం లోని హెచ్ పి సి ల్ లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం అంటూ రాసుకొస్తున్నారు. 


క్లెయిమ్ కి సంబందించిన స్క్రీన్ షాట్ ను ఇక్కడ చూడవచ్చు. 



 ఫ్యాక్ట్ చెక్ : 


కానీ, ఈ క్లెయిమ్ తప్పుదారి పట్టించే విధంగా ఉంది. ఎందుకంటే, వైరల్ అవుతున్న అగ్ని ప్రమాదం వీడియో 2021 లో విశాఖపట్నంలో హెచ్ పి సి ల్ లో జరిగిన ప్రమాదానికి సంబందించినది. ఇటీవల సంఘటన కాదు. 


తెలుగు పోస్ట్ నిజ నిర్ధారణ బృందం, ఈ వైరల్ అవుతున్న వీడియోలో చెప్పినట్టుగా, విశాఖపట్నం లో ఈమధ్య ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించిందా అని వెతుకగా, మాకు అటువంటి వార్తా కథనాలు ఏమి లభించలేదు. కానీ మరింత పరిశీలించగా, 2021 లో కళింగ టీవీ ప్రసారం చేసిన మరొక కథనం లభించింది, దీని ప్రకారం, ఇది విశాఖపట్నం హెచ్ పి సి ఎల్ లో 2021 లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అని తెలుస్తుంది. 2025 నాటిది కాదు.

ఈ వైరల్ వీడియోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ ద్వారా వెతుకగా, మాకు ఏ ఎన్ ఐ ( ANI) మే 25, 2021 నాడు తమ సామాజిక మాధ్యమాలలో చేసిన పోస్ట్ లభించింది. ఈ పోస్ట్ లో, "ఆంధ్రప్రదేశ్: విశాఖపట్నంలోని హెచ్‌పిసిఎల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం. జిల్లా అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. వివరాలు తెలియాల్సి ఉంది." దీని ప్రకారం కూడా, ఇది పాత సంఘటన అని తేలుతుంది.


గతం లో జరిగిన ఈ సంఘటన గురించి అనేక వార్తా కథనాలు ప్రచురించబడ్డాయి. వాటిలో, ETV లో మే 25, 2021 లో ప్రసారం చేసిన వీడియో లభించింది. ఆ వార్తా కథనం ప్రకారం, ఇది ఆంధ్రప్రదేశ్‌లో లోని విశాఖపట్నం హెచ్ పి సి ఎల్ (HPCL) లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబందించిన ఘటన.

ఇదే రకమైన విషయాలతో, India TV, మే 25 2021 లో ప్రసారం చేసిన వీడియో రిపోర్ట్ కూడా లభించింది. ఈ కథనం లో, “ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలోని హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పడానికి అనేక అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి. త్వరలోనే మంటలను అదుపులోకి తెచ్చారు” అని ఇండియా టీవీ పేర్కొంది. పైగా, ముడి చమురు ప్రాసెసింగ్ యూనిట్‌లో మంటలు చెలరేగాయని ఇండియా టీవీ కూడా ప్రచురించింది. 


ఇదే విషయాన్నీ, ది ఎకనామిక్ టైమ్స్, ఎన్డీటీవీ వంటి ఇతర ప్రధాన మీడియా సంస్థలు కూడా ప్రచురించాయి.

పై ఆధారాల ప్రకారం, వైరల్ అవుతున్న వీడియో, విశాఖపట్నం హెచ్ పి సి ఎల్ లో 2021లో జరిగిన అగ్నిప్రమాదానికి సంబందించినది. కానీ తప్పుగా ఇటీవల కాలంలో జరిగిన సంఘటనలాగా వైరల్ అవుతుంది. అటువంటి ప్రమాదం ఈమధ్య హెచ్ పి సి ఎల్ లో జరగలేదు. 






Claim :  విశాఖపట్నం హెచ్ పి సి ల్ లో ప్రస్తుత అగ్నిప్రమాదం
Claimed By :  Social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News