నిజ నిర్ధారణ: అమరవీరుడైన సైనికుడి పాత, సంబంధం లేని చిత్రాన్ని బిఎసెఫ్ అధికారిది అంటూ తప్పుగా షేర్ చేస్తున్నారు

'బతుకుదాం... బతక్నిద్దాం' అంటూ అందరికీ హితవు చెప్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆఫీసర్ వీడియో, పూలమాలలు దండలతో కప్పబడిన అమర సైనికుడి చిత్రంతో తో కలిపి షేర్ అవుతోంది. వీడియోలోని వ్యక్తి జీవితం అనిశ్చితంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలని, ఇతరులను జీవించనివ్వాలని అన్నారు. చిత్రం, వీడియో ల కోల్లాజ్ “దేశం కోసం ప్రాణ త్యాగం చేసారు, కోటి కోటి నమస్సులు” అంటూ ప్రచారం చేస్తున్నారు కొందరు.

Update: 2022-08-26 06:32 GMT

'బతుకుదాం... బతక్నిద్దాం' అంటూ అందరికీ హితవు చెప్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆఫీసర్ వీడియో, పూలమాలలు దండలతో కప్పబడిన అమర సైనికుడి చిత్రంతో తో కలిపి షేర్ అవుతోంది. వీడియోలోని వ్యక్తి జీవితం అనిశ్చితంగా ఉందని, ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలని, ఇతరులను జీవించనివ్వాలని అన్నారు. చిత్రం, వీడియో ల కోల్లాజ్ "దేశం కోసం ప్రాణ త్యాగం చేసారు, కోటి కోటి నమస్సులు" అంటూ ప్రచారం చేస్తున్నారు కొందరు.

Full View


Full View
Full View

షేర్ అవుతున్న వైరల్ కొల్లాజ్ లో వీడియో లో కనబడుతున్న బిఎసెఫ్ ఆఫీసర్ అమరవీరుడు అయ్యాడనీ, చిత్రం లో కనబడుతున్న అమరవీరుడు అతనే అనే క్లెయిం తో ఈ కొల్లాజ్ షేర్ అవుతోంది.

నిజ నిర్ధారణ:

వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి అమరవీరుడయ్యాడన్న వాదన అవాస్తవం. వీడియో లో కనపడుతున్న బిఎసెఫ్ ఆఫీసర్, చిత్రంలో ఉన్న జవాను ఒకరు కాదు. వీడియో 15 ఆగస్టు 2022లో తీసినది, అయితే వైరల్ కోల్లెజ్‌లో కనిపించే చిత్రం 2019 నాటిది. 'జియో ఔర్ జీనే దో' అని చెబుతున్న బిఎసెఫ్ ఆఫీసర్ కి సంబంధం లేని పాత చిత్రం ప్రచారంలో ఉంది.

మేము గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని నిర్వహించి, కొల్లాజ్‌లోని చిత్రం కోసం వెతికినప్పుడు, సెప్టెంబర్ 30, 2019న పోస్ట్ చేసిన వీడియో యూట్యూబ్‌లో కనిపించింది.

Full View

వీడియో క్యాప్షన్ ఇలా ఉంది ""अंतिम दर्शन, शहीद राजेंद्रसिंह भाटी,जैसलमेर 30.09.2019" తర్జుమా చేయగా "చివరి దర్శనం, షహీద్ రాజేంద్ర సింగ్ భాటి, జైసల్మేర్ 30.09.2019"

'అమరవీరుడు రాజేంద్ర సింగ్' అనే కీవర్డ్‌ని ఉపయోగించి శోధించినప్పుడు, త్రిశక్తి ఆపరేషన్‌లో, నాయక్ రాజేంద్ర సింగ్, ఒక భారతీయ సైనికుడు తీవ్రంగా గాయపడి, అమరుడయ్యాడని తెలిపే కొన్ని కథనాలను లభించాయి. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ పారిపోవడానికి ప్రయత్నించిన ఉగ్రవాదిని అడ్డుకొని అమరుడయ్యాడు. నాయక్ రాజేంద్ర సింగ్ రాజస్థాన్‌లోని జైల్‌సమేర్‌లోని మోహన్‌ఘర్‌కు చెందినవాడు. అంత్యక్రియలు ఆయన గ్రామమైన మోహన్‌గఢ్‌లో జరిగాయి అనికధనాలు పేర్కొన్నాయి.

"చివరి దర్శనం, అమరవీరుడు రాజేంద్ర సింగ్ భాటి, జైసల్మేర్ 30.09.2019" అనే క్యాప్షన్‌తో బార్మెర్ అనే పేరు గల ఫేస్‌బుక్ పేజీలో అమరవీరుడి చిత్రం షేర్ చేసారు. అదే చిత్రం వైరల్ కొల్లాజ్ లో వడాడం మనం చూడొచ్చు.

Full View


వైరల్ కొల్లాజ్‌లోని వీడియోలో కనిపించిన బిఎసెఫ్ ఆఫీసర్ కోసం వెతికినప్పుడు, 0.2 ఫ్రసెన్ వ్లొగ్స్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన వీడియో లభించింది. వ్యాఖ్యల విభాగంలో, బిఎసెఫ్ ఆఫీసర్ మరణ వార్త అబద్ధమని వ్లాగర్ వివరించారు. అతడిని వీరేంద్ర సర్ అని కూడా సంబోధించాడు. ఈ వీడియోను ఆగస్టు 16, 2022న పోస్ట్ చేసారు.

Full View

'జియో ఔర్ జీనే దో, @0.2 ప్రసేన్ వ్లాగ్స్‌తో వైరల్ బిఎసెఫ్ అధికారి మూమెంట్స్' అనే టైటిల్‌తో హ్యాపీనెస్ షేర్డ్ అనే యూట్యూబ్ ఛానెల్ షేర్ చేసిన మరో వీడియోలో కూడా అదే అధికారి ని చూడొచ్చు. వీడియో వివరణలో, వీడియోలో కనిపించే వ్యక్తి పేరు వీరేంద్ర కుమార్ సింగ్, బిఎసెఫ్ అధికారి, పశ్చిమ బెంగాల్‌కు తూర్పున ఉన్న భారతదేశం-బంగ్లాదేశ్ గెడే సరిహద్దులో విధులు నిఎవహిస్తున్నారు. పంచుకున్న వీడియో 15 ఆగస్టు 2022న చిత్రీకరించబడింది అని ఉంది. ఈ వీడియో ఆగస్టు 24, 2022న పోస్ట్ చేయబడింది.

Full View

అందువల్ల, వైరల్ కొల్లాజ్‌లోని చిత్రానికీ, వీడియోకు సంబంధం లేదు, వీడియోలో కనిపించే బిఎసెఫ్ ఆఫీసర్ వీరమరణం పొందలేదు. వీరమరణం పొందిన సైనికుడి పాత చిత్రంతో కలిపి భ్శ్F అధికారి వీడియో తో కలిపి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Tags:    

Similar News