ఫ్యాక్ట్ చెక్: శ్రీ వైష్ణో దేవి ఆలయానికి వెళ్తున్న యాత్రికుల పై ప్రజలు రాళ్లు రువ్వడం లేదు, వైరల్ వీడియో ముజఫరాబాద్ కు చెందినది

వైష్ణో దేవి మందిరం త్రికూట కొండలలో ఉంది. ఇది రియాసి జిల్లాలోని ప్రముఖ పట్టణం కాట్రా, బేస్ క్యాంప్ నుండి 13 కి.మీ దూరంలో

Update: 2025-05-27 11:48 GMT

వైష్ణో దేవి మందిరం త్రికూట కొండలలో ఉంది. ఇది రియాసి జిల్లాలోని ప్రముఖ పట్టణం కాట్రా, బేస్ క్యాంప్ నుండి 13 కి.మీ దూరంలో, జమ్మూ నగరం నుండి 63 కి.మీ దూరంలో ఉంది. ఈ మందిరం జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని ఒక ప్రసిద్ధ తీర్థయాత్ర కేంద్రం. దీనిని 1986 నుండి శ్రీ మాతా వైష్ణో దేవి మందిర బోర్డు నిర్వహిస్తోంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు ఈ పవిత్ర స్థలాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయం సాధారణంగా ఏడాది పొడవునా భక్తులకు తెరిచి ఉంటుంది, కానీ అనుకూల వాతావరణం కారణంగా మార్చి నుండి జూన్ వరకు వేసవి నెలల్లో సందర్శించడానికి ఉత్తమ సమయం. ఆలయం 24 గంటలూ తెరిచి ఉంటుంది.

ఇంతలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో వైష్ణో దేవి ఆలయ దర్శనానికి యాత్రికులు ప్రయాణించే వాహనాలపై స్థానికులు రాళ్ళు రువ్వుతున్నట్లు చూపిస్తుంది. ఈ వీడియోలో స్థానికులు రాళ్ళు తీసుకొని కొండ దిగుతున్న వాహనంపై విసురుతున్నారు. ప్రజలు 'మారో మారో' అని అరుస్తూ ఉండగా, కొన్ని తుపాకీ కాల్పులను కూడా మనం వినవచ్చు. వీడియోతో పాటు షేర్ చేసిన క్యాప్షన్ ‘వైష్ణో దేవీ దర్శనానికి వెళ్తున్న హిందువులు మరియు రక్షణ కాన్వాయ్ పై జీహాదీల రాళ్ళ దాడులు... వీళ్లా శాంతి కాముకులు..!? అని ఉంది.

Full View


Full View


Full View

Full View
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ వీడియో శ్రీ వైష్ణో దేవి ఆలయ యాత్రికులకు సంబంధించినది కాదు. పాక్-ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌ లో జరిగిన సంఘటన ఇటీవలిది గా ప్రచారం జరుగుతోంది.
మేము వీడియో నుండి కీఫ్రేమ్‌లను తీసుకుని, గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, పహారి అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోను కనుగొన్నాము. ఆ వీడియోలోని టెక్స్ట్ ప్రకారం, స్థానిక ప్రజలు పాకిస్తాన్ భద్రతా దళాలపై రాళ్ళు విసురుతున్నారని, వాహనాలు తగలబెడుతున్నారని ఆ వీడియోలో చూపించారు.
"పాకిస్తాన్ పై కోపంతో, బలూచిస్తాన్ ప్రజలు మే 22, 2024న పాకిస్తానీ వాహనాలపై రాళ్ళు రువ్వారు" అనే క్యాప్షన్ తో మరో యూజర్ అదే వీడియోను షేర్ చేశారు.

ఈ ప్రదేశాన్ని మరింత వివరంగా కొందరు యూజర్లు పోస్ట్ చేసిన వీడియోలో చూడొచ్చు.

Full View

ఇది నిజంగానే పాకిస్తాన్ ఆక్రమిత కష్మీర్ ప్రదేశమేనా అని వెతికి చూడగా, ఈ ప్రదేశం నిజంగానే పాక్-ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబద్‌ అని మాకు తెలిసింది. దీనికి సంబంధించిన స్టాక్ ఇమేజీలను ఇక్కడ చూడొచ్చు.

నివేదికల ప్రకారం, పాకిస్తాన్ సైన్యంలోని పారామిలిటరీ దళమైన పాకిస్తాన్ రేంజర్స్ ముజఫరాబాద్‌లో కాల్పులు జరిపడంతో నలుగురు పౌరులు మరణించారు. ఇది పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో ఉద్రిక్త పరిస్థితిని మరింత తీవ్రతరం చేసింది. హింసాత్మక ఘర్షణలను అంచనా వేయడానికి ఇస్లామాబాద్‌లో అత్యవసర సమావేశం తర్వాత పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ రూ.23 బిలియన్లను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించిన రోజున ఈ పరిణామం జరిగింది.

కశ్మీర్ టైమ్స్ ప్రకారం, పాకిస్తాన్ రేంజర్లు జరిపిన కాల్పుల్లో ముగ్గురు స్థానిక పౌరులు మరణించగా, ఆజాద్ జమ్మూ కాశ్మీర్ (AJK) రాజధాని నగరం ముజఫరాబాద్ పరిసరాల్లో నివాసితులకు, రేంజర్ల మధ్య జరిగిన ఘర్షణల్లో ముగ్గురు రేంజర్లు సహా ఏడుగురు గాయపడ్డారు. ముజఫరాబాద్, పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ మధ్య సరిహద్దులో ఉన్న బరార్కోట్ మీదుగా వెళుతున్న రేంజర్ల కాన్వాయ్‌పై యువకులు రాళ్ళు విసరడం ప్రారంభించడంతో ఘర్షణలు చెలరేగాయి. రాళ్ల దాడికి ప్రతిస్పందిస్తూ, పాకిస్తాన్ రేంజర్లు కాల్పులకు దిగడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం ప్రారంభించారు.
కాబట్టి, వైరల్ వీడియో ఇటీవలిది కాదు. వైష్ణో దేవి ఆలయానికి ప్రయాణించే యాత్రికుల వాహనాలపై దాడి చేస్తున్నారనే వాదన నిజం కాదు. పాక్-ఆక్రమిత కశ్మీర్‌లోని ముజఫరాబాద్‌ లో జరిగిన సంఘటన ఇటీవలిది గా ప్రచారం జరుగుతోంది. 
Claim :  కాశ్మీర్‌లోని శ్రీ వైష్ణో దేవి ఆలయానికి వెళ్తున్న యాత్రికుల వాహనాలపై ప్రజలు రాళ్లు రువ్వుతున్నారు
Claimed By :  Facebook Users
Fact Check :  Unknown
Tags:    

Similar News