నిజ నిర్ధారణ: బోస్టన్ విమానాశ్రయంలో రాహుల్‌ను అరెస్టు చేసినట్లు చూపుతున్న వార్తాపత్రిక క్లిప్పింగ్ డిజిటల్‌గా రూపొందించింది

సెప్టెంబరు 30, 2001 నాటి పాత వార్తాపత్రిక క్లిప్పింగ్ చిత్ర స్క్రీన్‌షాట్, “భారత రాజకీయ నాయకుడు అరెస్ట్” అనే శీర్షికతో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

Update: 2023-03-08 01:17 GMT

సెప్టెంబరు 30, 2001 నాటి పాత వార్తాపత్రిక క్లిప్పింగ్ చిత్ర స్క్రీన్‌షాట్, “భారత రాజకీయ నాయకుడు అరెస్ట్” అనే శీర్షికతో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఆ రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ అని పేర్కొంటూ సోషల్ మీడియా వినియోగదారులు ఈ చిత్రాన్ని పంచుకుంటున్నారు. వార్తాపత్రిక 13వ పేజీలో ప్రచురించబడిన కథనం, బోస్టన్ విమానాశ్రయంలో ఒక భారతీయ రాజకీయ నాయకుడు నిషేధించబడిన మాదకద్రవ్యాలు, నగదును కలిగి ఉన్నట్లు విమానాశ్రయ భద్రత కనుగొన్నప్పుడు అతనిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది.

చిత్రం క్యాప్షన్ ఇలా ఉంది “రాహుల్ గాంధీని డ్రగ్స్ కోసం బోస్టన్‌లో తిరిగి అరెస్టు చేసినప్పుడు. ప్రధాని వాజ్‌పేయి జోక్యంతో ఆయన విడుదలయ్యారు. సోనియా వేడుకున్నారు, విశాల హృదయంతో వాజ్‌పేయి అమెరికా అధికారులతో మాట్లాడారు. ఇప్పుడు అలాంటి నీచమైన వ్యక్తి ప్రధాని కావాలనుకుంటున్నారు. బోస్టన్ (USA) వార్తాపత్రిక క్లిప్పింగ్‌ను తనిఖీ చేయవచ్చు”

నిజ నిర్ధారణ:

క్లెయిం అవాస్తవం. ఇది డిజిటల్‌గా మార్చబడిన చిత్రం.

ముందుగా, 2001లో బోస్టన్ నగరంలో అన్ని వార్తాపత్రికల గురించి వెతికాము. ప్రధాన వార్తాపత్రికలు "ది బోస్టన్ గ్లోబ్", "బోస్టన్ పోస్ట్" మొదలైనవి.

మాస్ట్‌హెడ్ డిజైన్ “ది బోస్టన్ గ్లోబ్” డిజైన్‌ను పోలి ఉన్నందున, మేము సెప్టెంబర్ 30, 2001న ది బోస్టన్ గ్లోబ్ 13వ పేజీ కోసం వెతసగా, ఏ భారతీయ రాజకీయ నాయకుడిని అరెస్టు చేసిన ప్రస్తావన లేదు.

వార్తాపత్రిక క్లిప్ వార్తాపత్రిక క్లిప్పింగ్ జనరేటర్ సాధనాన్ని ఉపయోగించి రూపొందించబడింది - ఫోడీ.కాం

ఫోడీ.కాం ని ఉపయోగించి తెలుగుపోస్ట్ ఇలాంటి చిత్రాన్ని రూపొందించింది. ఇక్కడ వైరల్ చిత్రం, మేము రూపొందించిన చిత్రాల పోలిక చూడవచ్చు.

 

ది హిందూ ప్రకారం, 2001 సెప్టెంబరు 29న బోస్టన్ విమానాశ్రయంలో రాహుల్ గాంధీని సుమారు గంటసేపు నిర్బంధించారు. నిర్బంధానికి గల కారణాలు తెలియనప్పటికీ, గంట తర్వాత ఆయన విడుదలయ్యారు.

కనుక, షేర్ చేసిన వైరల్ చిత్రం నిజమైనది కాదు, డిజిటల్‌గా రూపొందించబడింది. వాదన అవాస్తవం.

Claim :  Rahul Gandhi arrested in Boston in 2001
Claimed By :  Twitter Users
Fact Check :  False
Tags:    

Similar News