ఫ్యాక్ట్ చెక్: కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా లేఖ రాయలేదు

మునుగోడు ఉప ఎన్నికపై రాజకీయంగా ఎంతో చర్చ జరుగుతోంది. ఉప ఎన్నికలో గెలవడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు ప్రయత్నించాయి. ఉప ఎన్నిక నేపథ్యంలో పలు కథనాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాంటిదే ఒకటి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా రాసిన లేఖ అంటూ ప్రచారం జరిగింది.

Update: 2022-11-06 13:00 GMT

మునుగోడు ఉప ఎన్నికపై రాజకీయంగా ఎంతో చర్చ జరుగుతోంది. ఉప ఎన్నికలో గెలవడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీలు ప్రయత్నించాయి. ఉప ఎన్నిక నేపథ్యంలో పలు కథనాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అలాంటిదే ఒకటి మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా రాసిన లేఖ అంటూ ప్రచారం జరిగింది.


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలిశారని.. ఈ భేటీని ఉద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల సమయంలో తమ పార్టీ నేతలకు సమాచారం ఇవ్వకుండా ఈ భేటీ జరిగిందని చెబుతున్నట్లుగా లేఖలో ఉంది.

ఫ్యాక్ట్ చెకింగ్:


కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా లేఖ రాశారన్న వాదన అవాస్తవం.

మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను నిర్వహించాము. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నడ్డాకు రాసిన లేఖ గురించి బీజేపీ తెలంగాణ అధికారిక పేజీలో ట్విట్టర్ పోస్ట్‌ని కనుగొన్నాము. ఆ లేఖ కూడా వైరల్ లెటర్ లానే ఉంది. బండి సంజయ్ అది ఫేక్ లెటర్ అంటూ వైరల్ లెటర్ పోస్ట్ చేసినట్లు మేము గుర్తించాము.


నిశితంగా పరిశీలిస్తే, రెండు లెటర్‌హెడ్ లలో అక్షరాలూ భిన్నంగా ఉన్నట్లు మేము గమనించాము.

పలు తేడాలను గుర్తించాం:

మొదట, అక్షరాల టెక్స్ట్, ఫాంట్ భిన్నంగా ఉంటాయి. అధికారిక లేఖలో (ఎడమవైపు), పార్టీ పేరు, చిరునామా హిందీ- ఇంగ్లీషులో ఉంచారు.. వైరల్ చిత్రం (కుడివైపు) ఆంగ్లంలో మాత్రమే ఉంది.

అధికారిక లెటర్‌హెడ్‌లో వేరొక అంచుతో కమలం ఉంది, అయితే వైరల్ ఇమేజ్‌లోని కమలం అసలైన దానికి భిన్నంగా కనిపిస్తుంది.

వైరల్ లెటర్‌లో ఎటువంటి సబ్జెక్ట్ ప్రస్తావించబడలేదు. భాష, రాసే శైలి కూడా అధికారిక లెటర్ కు భిన్నంగా ఉన్నాయి.

మేము లేఖ యొక్క ప్రమాణీకరణను తనిఖీ చేయడానికి JP నడ్డా సంతకాన్ని కూడా కనుగొనడానికి ప్రయత్నించాము, కానీ దాన్ని నిర్ధారించలేకపోయాం.

వైరల్ చిత్రం అసలు లేఖ కాదు, డిజిటల్ కాపీ అని మేము గమనించాము. లేఖపై జేపీ నడ్డా సంతకం కూడా డిజిటల్‌గా ఉంది. ఇప్పటివరకు, ఏ రాజకీయ నాయకుడూ తమ పార్టీ నుండి డిజిటల్ సంతకంతో పాటు అధికారిక లేఖ చిత్రాన్ని పంచుకోలేదు.
పైగా కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి కేసీఆర్‌ను కలిశారనే వార్త కూడా ఎక్కడా ప్రచురితమవ్వలేదు.

నడ్డా రాసిన వైరల్ లేఖ కల్పితమని మేము స్పష్టంగా గుర్తించాం.
Claim :  A letter written by BJP national president Jagat Prakash Nadda, addressed to former MLA Komatireddy Rajgopal Reddy, enquiring him about meeting Telangana CM KCR without informing his party leaders.
Claimed By :  Social Media Users
Fact Check :  False
Tags:    

Similar News