ఫ్యాక్ట్ చెక్: పాకిస్తాన్ కిరానా హిల్స్‌ బేస్ ను భారతదేశం ధ్వంసం చేసింది అనే ప్రచారం తప్పుదారి పట్టిస్తోంది

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక భారతీయ పర్యాటకులు మరణించినందుకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్

Update: 2025-05-13 08:48 GMT

Kirana hills

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది అమాయక భారతీయ పర్యాటకులు మరణించినందుకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. భారత ప్రధానమంత్రి మోదీ భారత పౌరులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక ఆపరేషన్ కాదని, సిద్ధాంతపరమైన మార్పు అని అన్నారు. ఇది ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ చేసిన ఓ పోరాటం అని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని, ఇది కొనసాగుతుందని, భారత పౌరులపై రాష్ట్ర ప్రాయోజిత ఉగ్రవాద దాడులపై నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని కూడా ప్రధాని మోదీ అన్నారు.

గత వారం జరిగిన వైమానిక దాడిలో భారత క్షిపణులు, డ్రోన్లు కనీసం ఎనిమిది పాకిస్తాన్ వైమానిక దళ స్థావరాలు, అనేక రాడార్ & వైమానిక రక్షణ విభాగాలపై భారీ నష్టాన్ని కలిగించాయి. పాకిస్తాన్ వైమానిక రక్షణ దళాలు నేలకూలినప్పటికీ, వారి వైమానిక దాడులు భారత వైమానిక రక్షణ వ్యవస్థలను దాటి లోపలికి రాలేకపోయాయి. ఇక రావల్పిండిలోని పిఎఎఫ్ బేస్ నూర్ ఖాన్, చక్వాల్‌లోని పిఎఎఫ్ బేస్ మురిద్, పిఎఎఫ్ బేస్ సుక్కూర్ వంటి ప్రదేశాలపై భారత దాడులు జరిగాయి.
ఇంతలో, పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్ లోని రహస్య అణ్వాయుధ నిల్వ స్థావరం భారత సాయుధ దళాల దాడుల ద్వారా ధ్వంసమైందని పేర్కొంటూ తెలుగులో ఒక సందేశం వైరల్ అవుతూ ఉంది.
“ఇది అసలైన వార్త. భారత్ పాకిస్తాన్ అణు దాడి చేసిందని వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్‌లోని కిర్నా హిల్స్ అనే కొండ ముషాఫ్ ఎయిర్‌బేస్ (సర్గోధ) సమీపంలో ఉంది. పాకిస్తాన్ తన అణ్వాయుధాలు మరియు మందుగుండు సామగ్రిని ఇక్కడే దాచి ఉంచుతుందని చెబుతారు - ఇది ఒక రకమైన అత్యంత రహస్యమైన సైనిక బంకర్.
భారత్ ఈ ప్రదేశంపై క్షిపణి లేదా బాంబుతో దాడి చేసిందని వాదనలు ఉన్నాయి. ఈ దాడిలో బంకర్-బస్టింగ్ మ్యూనిషన్ (కొండ లేదా బంకర్‌లోకి చొచ్చుకెళ్లి లోపల పేలే బాంబులు) ఉపయోగించారు. ఈ దాడి వల్ల కొండలో ఉన్న రహస్య సొరంగాలు మరియు అణ్వాయుధాలు ఉంచే ప్రదేశాలు దెబ్బతిని ఉండవచ్చు.
పాకిస్తాన్ "ఖాళీ కొండపై బాంబు వేశారు, ఎలాంటి నష్టం జరగలేదు" అని చెబుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ వాస్తవం ఏమిటంటే కొండ లోపల ఉన్న రహస్య స్థావరాలపై దాడి జరిగి ఉండవచ్చు. అక్కడ 6 కంటే ఎక్కువ సొరంగాల ప్రవేశ ద్వారాలు కనిపించాయి. పాకిస్తాన్ ఫైటర్ జెట్‌లు ఎగరకూడదనే ఉద్దేశ్యంతో ముషాఫ్ ఎయిర్‌బేస్ రన్‌వే కూడా ధ్వంసం చేయబడింది. ఒకవేళ రేడియేషన్ సంభవించినా అది భూమి లోపలే ఉంటుంది. గుర్తించవలసిన విషయం ఏమిటంటే, అణు బాంబులు సాధారణ బాంబుల్లా పేలవు. వాటికి ప్రత్యేక ట్రిగ్గరింగ్ మెకానిజం అవసరం, అది ఈ దాడిలో జరగలేదు.
భారత్ నేరుగా అణ్వాయుధాలను కాకుండా, వాటి భద్రత, నియంత్రణ వ్యవస్థ మరియు నిర్వహణ వ్యవస్థను నిష్క్రియం చేసి ఉండవచ్చనేది చాలా మటుకు సంభవించే విషయం. అంటే శరీరం కాదు, వెన్నెముక విరిగింది. అటువంటి పరిస్థితిలో, పాకిస్తాన్ వాటిని వెంటనే ఉపయోగించలేదు లేదా మరెక్కడికీ తరలించలేదు. ఒకవేళ ఇది నిజమైతే, భారత వైమానిక దళానికి ఇది ఒక అసాధారణమైన విజయం - ఎటువంటి రేడియేషన్ ప్రమాదం లేకుండా, శత్రువు యొక్క అత్యంత ప్రమాదకరమైన దంతాలను పెకిలించింది, మరియు అవి నిజంగా ప్రమాదకరమైనవా లేదా కేవలం బెదిరింపుల కోసం ఉంచిన ప్రదర్శన వస్తువులా అనేది కూడా తెలియదు. తారేక్ ఫతేహ్ మాటలు గుర్తుకు వస్తున్నాయి: "ఈ అజ్ఞానులు పావు-పావు కిలోల అణు బాంబుల గురించి మాట్లాడుతున్నారు, వాస్తవానికి వారి దగ్గర ఏమీ లేదు!"
भारत ने पाकिस्तान के किराना हिल्स पर हमला किया है, जो सरगोधा एयर बेस के करीब है और संभवतः "परमाणु हथियारों का भंडारण करता है"। पाकिस्तान में हाल ही में आए भूकंपों को "परमाणु भंडारण स्थल पर हमले" से जोड़ा गया है। అంటూ హిందీలో కూడా అదే వాదనతో పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.
వైరల్ పోస్టుకు సంబంధించిన ఆర్కైవ్ లింక్ ను ఇక్కడ చూడొచ్చు.

ఫ్యాక్ట్ చెక్:

వైరల్ అవుతున్న వాదన తప్పుదారి పట్టిస్తోంది. పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్‌లోని రహస్య అణు నిల్వ స్థావరంపై భారత సాయుధ దళాలు దాడి చేయలేదు. అవే కొండచరియల మధ్య, ఖాళీ గా ఉన్న ప్రదేశంలో మిసైళ్లు పేలినట్టు తెలుస్తోంది.

పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్‌లోని అణు కేంద్రాన్ని భారత సాయుధ దళాలు లక్ష్యంగా చేసుకోలేదని ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఎకె భారతి ధృవీకరించారని టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన యూట్యూబ్ వీడియోను కూడా మేము కనుగొన్నాము. 

Full View

అణు స్థావరాలు ఉన్నట్లు నివేదికలు ఉన్నప్పటికీ, భారతదేశం పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్‌ను లక్ష్యంగా చేసుకోలేదని ఎయిర్ మార్షల్ ఎకె భారతి తెలిపారు. భారతదేశం ఉగ్రవాదులు, వారి మౌలిక సదుపాయాలను మాత్రమే టార్గెట్ చేసిందని ఆయన నొక్కిచెప్పారు. ఉగ్రవాద సమూహాలకు పాకిస్తాన్ సైనిక మద్దతు ఇవ్వడం పట్ల విచారం వ్యక్తం చేశారు. డ్రోన్ దాడులను అడ్డుకోవడం, పాకిస్తాన్ ఉపయోగించే చైనా మూలాల క్షిపణుల శిథిలాలను ప్రదర్శించడం వంటి పాకిస్తాన్ దాడులకు వ్యతిరేకంగా భారతదేశం సాధించిన విజయాన్ని భారతి హైలైట్ చేశారు.

Livemint.com లో ప్రచురితమైన ఒక కథనం ప్రకారం దేశ రాజధానిలో డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMOs) ప్రత్యేక విలేకరుల సమావేశంలో ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఎయిర్ మార్షల్ భారతి స్పందిస్తూ “కిరణా హిల్స్‌లో కొన్ని అణు సంస్థాపనలు ఉన్నాయని మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. దాని గురించి మాకు తెలియదు. మేము కిరణా హిల్స్‌ను టార్గెట్ చేయలేదు.” అని అన్నారు. కిరణా హిల్స్‌లోని భూగర్భ అణు నిల్వకు అనుసంధానించిన సర్గోధలోని పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌పై భారతదేశం దాడి చేసిందని విస్తృతమైన ఊహాగానాలు, సోషల్ మీడియా వాదనల మధ్య ఎయిర్ మార్షల్ భారతి వ్యాఖ్యలు వచ్చాయి.

బిజినెస్ టుడే యూట్యూబ్ ఛానెల్‌లో ప్రచురించిన ఒక వీడియో నివేదిక ప్రకారం, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశం కిరానా హిల్స్‌లోని పాకిస్తాన్ అణు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.భారత రక్షణ ఉన్నతాధికారులు కిరానా హిల్స్‌పై ఎటువంటి దాడి జరగలేదని ఖండించారు. నిజమైన లక్ష్యం? సర్గోధ ఎయిర్‌బేస్ కేవలం 10 కి.మీ దూరంలో ఉంది. పాకిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని కఠినమైన, పరిమితం చేసిన జోన్ అయిన కిరానా హిల్స్, దాని భూభాగం, సామీప్యత కారణంగా గందరగోళాన్ని మరింత పెంచి ఉండవచ్చు. అయితే, ఓపెన్-సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT) జియోలొకేషన్ ద్వారా 
ఈ పేళుల్ల 
ప్రదేశం దూరంగా ఉందని నిర్ధారిస్తుంది.
Full View

పేళ్లుల్లను చూపుతూ సోషల్ మీడియాలో షేర్ అవుతున్న కొన్ని వీడియోలను తీసుకొని వాటి లొకేషన్ నిర్ధారించి చూడగా, మిసైల్లు సొరంగాల దగ్గరగా పేలలేదనీ, వాటికి దూరంగా పేలాయనీ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ తెలిపారు. 'భారత మిసైల్ న్యూక్లియర్ ఆయుధాలు నిల్వ చేసిన సొరంగాలు లేదా సొరంగ ద్వారాలను దగ్గర పేలలేదు, అది కొండ దిగువన (ఖాళీ భాగం) పేలింది. పాకిస్తాన్‌ను హెచ్చరించడానికి లేదా మన క్షిపణులు ఎక్కడ లక్ష్యంగా చేసుకోవచ్చో చూపించడానికి కావచ్చు' అని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు.

కనుక, భారత సాయుధ దళాలు పాకిస్తాన్‌లోని కిరానా హిల్స్‌లోని రహస్య అణు స్థావరాన్ని ధ్వంసం చేశాయనే వాదన తప్పుదారి పట్టిస్తోందిఅవే కొండచరియల మధ్య, ఖాళీ గా ఉన్న ప్రదేశంలో మిసైళ్లు పేలినట్టు తెలుస్తోంది. 


Update: The conclusion of the article has been updated from False to Misleading, based on few facts 


Claim :  పాకిస్తాన్ అణ్వాయుధాలను నిల్వ ఉండే అవకాశం ఉన్న కిరానా హిల్స్‌ బేస్ ను భారతదేశం ధ్వంసం చేసింది
Claimed By :  Social media users
Fact Check :  Unknown
Tags:    

Similar News