ఫ్యాక్ట్ చెక్ : డోనాల్డ్ ట్రంప్, సెక్స్ స్కాండల్-నిందితుడు ఎప్స్టీన్‌ను చూపుతున్న చిత్రాలు AI ద్వారా రూపొందించారు

జెఫ్రీ ఎప్‌స్టీన్ హై ప్రొఫైల్ సెక్స్ కుంభకోణం అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలను రేపుతూ ఉంది. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఫైల్స్ అమెరికాలోని ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లను బయటకు తెస్తోంది. ఇప్పటికే ఈ సెక్స్ స్కాండల్‌లో మాజీ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ పేర్లు బయటకు వచ్చాయి

Update: 2024-01-10 04:41 GMT

Trump and Epstien

జెఫ్రీ ఎప్‌స్టీన్ హై ప్రొఫైల్ సెక్స్ కుంభకోణం అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలను రేపుతూ ఉంది. ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న ఫైల్స్ అమెరికాలోని ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లను బయటకు తెస్తోంది. ఇప్పటికే ఈ సెక్స్ స్కాండల్‌లో మాజీ అమెరికా అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ పేర్లు బయటకు వచ్చాయి. 2005లో మైనర్‌ బాలికకు సెక్స్‌ కోసం డబ్బులిచ్చాడనే ఆరోపణలపై అరెస్టు చేయడంతో అతని కేసు వెలుగులోకి వచ్చింది. అతన్ని అరెస్టు చేసి లైంగిక నేరస్థుడిగా నిర్ధారించారు. అతను జైలులో మరణించాడు.. ఇది అధికారికంగా ఆత్మహత్యగా అధికారులు నిర్ధారించారు.


కోర్టుకు సమర్పించబడిన ఒక చట్టపరమైన పత్రంలో ఎప్స్టీన్ క్లయింట్‌లుగా భావించే ధనవంతులు, శక్తివంతమైన వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్‌లో బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్, లియోనార్డో డికాప్రియో, కెమెరూన్ డియాజ్ తదితర నటుల పేర్లు ఉన్నాయి. ఈ పత్రాల విడుదలతో ఎప్స్టీన్ కేసు అంశం మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ తర్వాత జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో డొనాల్డ్ ట్రంప్ ఉన్న అనేక చిత్రాలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.

ఈ చిత్రాలలో, జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చూపించే రెండు చిత్రాలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ చిత్రాలలో ట్రంప్, ఎప్స్టీన్ పక్క పక్కనే కూర్చున్నట్లు చూపించారు.. మొదటిది వారు విమానంలో కూర్చున్నట్లు చూపుతున్నారు, రెండవది వారు కొంత మంది మహిళలతో కలిసి కూర్చున్నట్లు చూపుతుంది.

ఇమేజ్ -1


“Both legends Trump and Epstein in the Lolita express #EpsteinClientList” అనే క్యాప్షన్ తో ఫోటోను షేర్ చేస్తున్నారు.

ఇమేజ్ -2

రెండవ చిత్రం డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఎప్స్టీన్ ఇద్దరు అమ్మాయిలతో పాటు కౌచ్ మీద కూర్చున్నట్లు చూపిస్తుంది. ఈ చిత్రం "ట్రంప్, ఎప్స్టీన్ లెట్స్ గెట్ ది రికార్డ్ స్ట్రెయిట్" అనే శీర్షికతో పోస్టు చేశారు. ట్రంప్ అబద్ధాలు చెబుతున్నా.. చిత్రాలు చెప్పవని ఈ ఫోటోలను పోస్టు చేస్తున్న వ్యక్తులు తెలిపారు.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు. ఈ చిత్రాలు నిజమైనవి కావు, అవి AI సాంకేతికతను ఉపయోగించి రూపొందించారు.

మేము రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి చిత్రాల కోసం సెర్చ్ చేయగా, వాటిని భాగస్వామ్యం చేసిన వార్తా నివేదికలు ఏవీ కనుగొనలేదు.

తరువాత మేము ఈ చిత్రాలను ఈజ్ ఇట్ AI, హైవ్ డిటెక్టర్ వంటి AI ఇమేజ్ డిటెక్షన్ టూల్స్‌లో అప్‌లోడ్ చేసాం.. ఈ చిత్రాలు ఎక్కువగా AI ద్వారా రూపొందించారని మేము కనుగొన్నాము.


 




అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దోషిగా తేలిన లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్ కౌచ్ మీద కూర్చున్న రెండవ చిత్రాన్ని గమనించినప్పుడు, చిత్రం AI- రూపొందించారని స్పష్టం చేసే అనేక ఆధారాలు మాకు లభించాయి. ఈ చిత్రంలో ఎప్స్టీన్‌కు కాళ్లు లేవు, అనేక చేతులు ఎప్స్టీన్ భుజం చుట్టూ కనిపిస్తాయి. ట్రంప్ ఒక చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లుగా ఆ ఫోటోలు ఉన్నాయి.

అందువల్ల, ట్రంప్, ఎప్స్టీన్‌లను కలిపి చూపించే వైరల్ చిత్రాలు AI ద్వారా రూపొందించారని గుర్తించాం. ఈ రెండు చిత్రాలు ప్రామాణికమైనవి కావు. వైరల్ అవుతున్న వాదనలో ఎటువంటి నిజం లేదు.
Claim :  Two images show genuine images of Donald Trump and Jeffrey Epstein
Claimed By :  Social media users
Fact Check :  False
Tags:    

Similar News