ఫ్యాక్ట్ చెక్: కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందనే ఆనందంలో బీజేపీ జెండాపై ఆవును కోయలేదు

బీజేపీ జెండాపై కొందరు యువకులు ఆవును చంపిన గ్రాఫికల్ వీడియో ట్విట్టర్, వాట్సాప్ వంటి కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతూ ఉంది. 'ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత, ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు' అనే కథనంతో వీడియో షేర్ చేస్తున్నారు.

Update: 2023-05-25 06:04 GMT

బీజేపీ జెండాపై కొందరు యువకులు ఆవును చంపిన గ్రాఫికల్ వీడియో ట్విట్టర్, వాట్సాప్ వంటి కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతూ ఉంది. 'ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత, ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు' అనే కథనంతో వీడియో షేర్ చేస్తున్నారు. బీజేపీ జెండాపై ఆవును చంపడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటూ ఉన్నారని చెప్పారు.

“కర్ణాటకలో ఖాన్-గ్రేస్ గెలిచిందని ఆనందంలో బిజెపి జెండా పైన ఆవును కోసి ఆనంద పడుతున్న. నిజమైన భారతీయులు."

https://twitter.com/sricharan_gleo/status/1658479986456817664

(Viewer Discretion - GRAPHICAL VIDEO)

https://www.facebook.com/princemurthy7056/videos/247486044625713

నిజ నిర్ధారణ:


వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది. ఇది 2022లో మణిపూర్‌లో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన పాత వీడియో.

మేము కీ వర్డ్స్ తో పాటు కీలక ఫ్రేమ్‌లను సెర్చ్ చేసాం. 2022లో ప్రచురించిన అనేక ట్వీట్‌లను మేము కనుగొన్నాము.

మణిపూర్ లో ఈ ఘటన చోటు చేసుకుందని.. కొందరు వ్యక్తులు బీజేపీ నాయకులను కూడా విమర్శించారు.

(Viewer Discretion - GRAPHICAL VIDEO)

https://twitter.com/AnuJain22213023/status/1488198992810840065

https://twitter.com/azad_nishant/status/1488115006449549318

మణిపూర్‌లోని లిలాంగ్ పోలీసులు ఆవును వధించిన ముగ్గురు ముస్లిం యువకులను అరెస్టు చేశారు. బీజేపీ జెండాపై యువకుల బృందం ఆవును వధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో వారిని అరెస్టు చేసి, జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం 1960లోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

https://www.opindia.com/2022/01/manipur-muslim-youth-arrested-for-slaughtering-a-cow-on-bjp-flag-lilong/

https://organiser.org/2022/01/31/13508/bharat/manipur-muslim-youths-slaughter-cow-keeping-on-bjp-flag/

టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 60 స్థానాలకు బీజేపీ టిక్కెట్లను ప్రకటించిన కొందరు అసంతృప్త నాయకులకు చెందిన వాళ్లు ఆవును వధించారు. ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్, మణిపూర్ యూనిట్ బిజెపి అధ్యక్షురాలు ఎ. శారదా దేవిపై కొందరు వ్యక్తులు దూషణలకు దిగారు. రక్తంతో ఉన్న ఆవు బీజేపీ జెండాపై పడి ఉన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం 1960, వివిధ మత సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించే నిబంధనల ప్రకారం వారిపై అభియోగాలు మోపారు.

ఆవును చంపిన వ్యక్తులకు సంబంధించిన వీడియో కర్ణాటకకు చెందినది కాదు. అది ఇటీవలిది కాదు. వైరల్ అవుతున్న వాదన ప్రజలను తప్పుదారి పట్టించేది.

Claim :  cow killed on bjp flag after congress win in Karnataka
Claimed By :  Social Media Users
Fact Check :  Misleading
Tags:    

Similar News