ఫ్యాక్ట్ చెక్: కూల్ డ్రింక్స్ తాగకండి అంటూ ప్రజలను జీహెచ్ఎంసీ సూచించిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు

కూల్ డ్రింక్స్/శీతల పానీయాలు ఎబోలా వైరస్ తో కలుషితమైనవని.. వాటిని తీసుకోవద్దని GHMC ప్రజలకు ఒక హెచ్చరికను జారీ చేసిందని చెబుతూ కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. సదరు కూల్ డ్రింక్స్ కంపెనీ కార్మికులు

Update: 2024-02-14 05:40 GMT

cool drinks contaminated

కూల్ డ్రింక్స్/శీతల పానీయాలు ఎబోలా వైరస్ తో కలుషితమైనవని.. వాటిని తీసుకోవద్దని GHMC ప్రజలకు ఒక హెచ్చరికను జారీ చేసిందని చెబుతూ కొన్ని పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. సదరు కూల్ డ్రింక్స్ కంపెనీ కార్మికులు ప్రమాదకరమైన ఎబోలా వైరస్ ఉన్న రక్తాన్ని ఈ పానీయాలలో కలిపారని.. దాన్ని ఎన్డీటీవీ వెల్లడించిందంటూ పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి.

“గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్, టౌన్ ప్లానింగ్ విభాగం. మిత్రులందరికీ హైదరాబాద్ పోలీసులు భారతదేశం అంతటా సమాచారం అందించారు. దయచేసి ఒక్కటి కూడా తాగకండి Maaza, Fanta, 7 Up, Coca Cola, Mountain Deo, Pepsi, etc వంటి శీతల పానీయాలు రాబోయే కొద్ది రోజులు ఎందుకంటే ఈ కంపెనీ కార్మికులు కలుషితాన్ని కలిపారు అందులో ఎబోలా అనే ప్రమాదకరమైన వైరస్ రక్తం. వార్త ఒకటి నిన్న NDTV ఛానెల్లో చెప్పబడింది. దయచేసి వీలైనంత త్వరగా ఈ సందేశాన్ని ఫార్వార్డ్ చేయడం ద్వారా సహాయం చేయండి. ఈ సందేశాన్ని మీ కుటుంబ సభ్యులకు ఫార్వార్డ్ చేయండి. దీన్ని వీలైనంత షేర్ చేయండి” అంటూ వైరల్ అవుతున్న పోస్టులో ఉంది.


Full View

Full View
Full View
ఈ వైరల్ మెసేజీ వాట్సాప్ లో కూడా వైరల్ అవుతూ ఉంది.

ఫ్యాక్ట్ చెకింగ్:

వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదు.
మేము వైరల్ మెసేజీ గురించి సెర్చ్ చేశాం. మేము NDTV లేదా ఇతర వార్తా వెబ్‌సైట్‌లలో ఎబోలా వైరస్ ఉన్న రక్తం కలిపారనే సంఘటనలకు సంబంధించి ఎటువంటి నివేదికలను కనుగొనలేకపోయాము.
“cool drinks contaminated with ebola’ అనే కీవర్డ్స్ ను ఉపయోగించి సెర్చ్ చేయగా.. ఈ మెసేజీ 2019 నుండి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉందని గుర్తించాం.

కూల్ డ్రింక్స్ గురించి సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వ్యాప్తి జరుగుతూ ఉందని.. హైదరాబాద్ సిటీ పోలీసులు హెచ్చరించిన పోస్టులను మేము గమనించాం. హైదరాబాద్ సిటీ పోలీసులు కూడా కలుషిత కూల్ డ్రింక్స్ కు సంబంధించి ఎలాంటి మెసేజ్ విడుదల చేయలేదని వివరణ ఇస్తూ.. హైదరాబాద్ సిటీ పోలీసులు తమ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో చేసిన పోస్టులను మేము కనుగొన్నాము.
Full View

జూలై 2019లో వచ్చిన news minutes.com నివేదిక ప్రకారం, హైదరాబాద్ పోలీసులు అటువంటి హెచ్చరికలు జారీ చేయలేదని వివరణ ఇచ్చారు. అలాగే అలాంటి వార్తలను కూడా ఖండించారు. ప్రజలను టెన్షన్ పెట్టే ఇటువంటి పుకార్లను నమ్మకండని.. వ్యాప్తి చేయడం కూడా కరెక్ట్ కాదంటూ ప్రజలను అప్రమత్తం చేశారు.

PIB Fact Check కూడా ఇలాంటి వైరల్ మెసేజీలో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. కూల్ డ్రింక్స్ గురించి కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందంటూ వైరల్ అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. ఎబోలా వైరస్‌తో కలుషితమవ్వడంతో కొద్ది రోజుల పాటు శీతల పానీయాలకు దూరంగా ఉండాలని భారత ప్రభుత్వం పౌరులకు సూచించిందని పేర్కొంటూ సోషల్ మీడియాలో ఒక మెసేజీ వైరల్ అవుతూ ఉందని పీఐబీ తెలిపింది. ఈ వైరల్ సందేశం ఫేక్ అని అందులో తెలిపారు.

కాబట్టి, GHMC జారీ చేసిన హెచ్చరికకు సంబంధించి వైరల్ అవుతున్న మెసేజీలో ఎలాంటి నిజం లేదు. బూటకపు వాదనలతో షేర్ చేస్తూ ఉన్నారు. ఎబోలా వైరస్‌తో కూడిన రక్తంతో కూల్ డ్రింక్స్ కలుషితం కావడంపై GHMC ఎలాంటి సలహాలు ఇవ్వలేదు. భారత్‌లో ఇలాంటి ఘటనే జరగలేదు.
Claim :  GHMC has warned the public against drinking cool drinks contaminated with Ebola virus
Claimed By :  Youtube Users
Fact Check :  False
Tags:    

Similar News