నిజ నిర్ధారణ: వీడియోలో కనబడుతున్న వినాయక చతుర్థి సంబరాలు దక్షిణాఫ్రికాలో కాదు, తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో జరిగాయి

ఆఫ్రికన్ ప్రజలు డ్రమ్స్‌ వాయిస్తుంటే, భారతీయులు ఆ దరువులకు అనుగుణంగా నృత్యం చేస్తూ ‘గణపతి బప్పా మోరియా’ పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. "దక్షిణాఫ్రికాలో గణేష్ చతుర్థి యొక్క పవిత్రమైన వేడుకలు!!" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ అవుతోంది.

Update: 2022-09-09 13:16 GMT

ఆఫ్రికన్ ప్రజలు డ్రమ్స్‌ వాయిస్తుంటే, భారతీయులు ఆ దరువులకు అనుగుణంగా నృత్యం చేస్తూ 'గణపతి బప్పా మోరియా' పాడుతున్న వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. "దక్షిణాఫ్రికాలో గణేష్ చతుర్థి యొక్క పవిత్రమైన వేడుకలు!!" అనే క్యాప్షన్‌తో ఈ వీడియో షేర్ అవుతోంది.

Full View


Full View


నిజ నిర్ధారణ:

వేడుకలు దక్షిణాఫ్రికాలో జరిగాయి అనే వాదన తప్పుదారి పట్టించేది. వీడియో పాతది, తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాకు చెందినది. గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ని ఉపయోగించి వీడియో నుండి సంగ్రహించిన కీఫ్రేమ్‌లను శోధించినప్పుడు, హెల్పింగ్ హ్యుమానిటీ అనే ఛానెల్ ద్వారా ప్రచురించబడిన యూట్యూబ్ వీడియో లభించింది. వీడియో సెప్టెంబర్ 2017లో ప్రచురించినది.

'ఆఫ్రికన్ స్టైల్ ఆఫ్ సెలెబ్రేటింగ్ గణేష్ ఫెస్టివల్... శ్రీ గణేష్ టెంపుల్, ఎంటెబ్బే, ఉగాండా' అనే టైటిల్ తో ఆ వీడియో ఉంది.

Full View

అమర్ ఉజాలా.కామ్ లో ఇదే కథనంతో సహా వీడియో షేర్ చేసారు. ఆఫ్రికా దేశమైన ఉగాండాలోని ఎంటెబ్బే నగరం నుండి వచ్చిన ఒక వీడియోను మీకు చూపిస్తున్నాం. ఎంటెబ్బే యొక్క గణేష్ ఆలయంలో ఆఫ్రికన్ శైలిలో భారతీయులు గణేష్ జీని స్వాగతించారు, అంటూ ఈ కధనం పేర్కొంది.

నటుడు అనుపమ్ ఖేర్ ఉగాండాలో గణేష్ చతుర్థి వేడుకల మ్యాజికల్ వీడియోను షేర్ చేసినట్లు పేర్కొంటూ సెప్టెంబర్ 13, 2018న ఏ ఎన్ ఐ ప్రచురించిన వీడియోలో పేర్కొన్నారు.

Full View

వేడుకల గురించి 2017 లో నటుడు అనుపం ఖేర్ చేసిన వైరల్ ట్వీట్ ఇక్కడ ఉంది.

గణేష్ టెంపుల్, ఎంటెబ్బే కోసం వెతుకుతున్నప్పుడు, ఉగాండా జాతీయులు డ్రమ్స్ కొడుతూ, 'గణపతి బప్పా మోరియా' పాడే వీడియోను షేర్ చేసిన వారి ఫేస్‌బుక్ పేజీ లభించింది.

Full View

2021లో కూడా వైరల్ అయిన ఇదే వీడియో ను తప్పుదారి పట్టించేదిగా కొన్ని నిజ నిర్ధారణ చేసే సంస్థలు నిర్ధారించాయి, అయితే అదే వీడీయో మళ్లీ ఈ సంవత్సరం కూడా వైరల్ అయ్యింది.

Claim :  Recent video of Ganesh Chaturthi celebrations in South Africa
Claimed By :  Social Media Users
Fact Check :  Misleading
Tags:    

Similar News